Ksheera ramalingeswara swamy temple in palakollu

ksheera ramalingeswara swamy, west godavari district, sri ksheera ramalingeswara temple, sri ksheera ramalingeswara temple is located in palakollu, west godavari district of andhra pradesh, teertha yatra - ksheera ramalingeswara swami aalayam , palakollu,teertha yatra, 150-feet dwajasthambham, 300-year-old ksheera ramalingeswara swamy temple in palakollu

Ksheera Ramalingeswara Swamy Temple in Palakollu

శివుని మహిమకు ప్రతీక "క్షీరారామం"

Posted: 05/07/2013 06:46 PM IST
Ksheera ramalingeswara swamy temple in palakollu

శివుడు భోళా శంకరుడు ... అటు మానవులు, దేవతలకే కాదు , ఇటు రాక్షసులకు కూడా వరాలను ప్రసాదించే ఏకైక దైవ స్వరూపం , సకల సృష్టికీ మూలం ఆ పరమ శివుడు ... అట్టి భగవత్స్వరూపం కొలువయ్యి ఉన్న ఎన్నో ఆలయాలలో , ఇంకొక పరమ పవిత్రమైన ఆలయ విశేషాలు ఈనాటి అన్వేషణ లో;

 పశ్చిమ గోదావరి జిల్లలో పాలకొల్లు అను గ్రామము ఉంది . ఈ గ్రామం లో శ్రీ రాముని చేత క్షీర కొలను పక్కన ప్రతిష్టించబడిన స్వామీవారి లింగం శ్రీ క్షీరారామ లింగేశ్వర స్వామి. పాలకొల్లు గ్రామము నరసాపురమునకు సుమారు 11 కి . మీ . దూరంలోను, భీమవరానికి 21 కి . మీ . దూరంలోను ఉంది .

 క్షీరా రామలింగేశ్వర స్వామీ వారి దేవాలయమునకు ముందున్న గోపురం చాల ఎత్తైనది .  క్షీరా రామలింగేశ్వర స్వామీ వారి లింగము శిరస్సున చిన్న ముడి , మరియు కొమ్ము ఉన్నట్లుగా కనిపించును . లింగము తెలుపు రంగులో చూడ ముచ్చటగా నుండును . లింగము చుట్టూ నొక్కులు కలిగి ఉండును.

దేవాలయమునకు సమీపంలో రామగుండము అను కొలను కలదు . ఈ కొలనులో నీరు తెల్లగానుండును . అందుచేత పాలకొలను (క్షీరాపురం) అని ప్రసిద్ధి చెంది కాలక్రమంలో పాలకోల్లుగా మారింది . క్షీరారామ క్షేత్రం "ఆంధ్ర కైలాసం" గా పేరు పొందింది .

క్షీరారామ క్షేత్రమందు పార్వతీ పరమేశ్వరులు , లక్ష్మీ జనార్దనులు , సరస్వతీ బ్రమ్హాలు వేంచేసి ఉన్నారు . అందుచేత ఈ ఆలయము "త్రిమూర్త్యాలయము' గా ప్రాచూర్యం చెందినది .

అంతేకాక, "హరి హర" క్షేత్రమని కూడా ప్రసిద్ధి చెందినది .

క్షీరారామ క్షేత్రమందు సుబ్రమణ్యస్వామి , ఆంజనేయస్వామి , భైరవ స్వామీ ఆలయములు కలవు .

చైత్ర సుద్ధ దశమి రోజున కల్యాణోత్సవం జరుగుతుంది .

క్షీరా రామలింగేశ్వరుని భక్తీ శ్రద్ధలతో ఆరాదిన్చినవారు దారిద్ర బాధ నుండి విముక్తి పొందుతారు . సిరిసంపదలు కలుగుతాయి .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles