The magnificence of the mughal gardens

Archana Mishra, Mughal Gardens, Delhiites, Taj Mahal, Prakash Nigam, Edwin Lutyens

The Mughal Gardens have always been an irresistible attraction for Delhiites and tourists alike. The onset of spring, in February-March, provides once-in-a-year oppurtunity to witness a riot of colours

The magnificence of the Mughal Gardens.png

Posted: 02/21/2013 01:10 PM IST
The magnificence of the mughal gardens

mughal-gardensమనసుదోచే గులాబీలు....సిరిమల్లెల గుబాళింపు... రంగురంగుల లతల అల్లికలు...సప్తవర్ణశోభిత సీతాకోక చిలుకల మకరందాన్వేషణ.... ఝుమ్మంటూ ఎగిరుతున్న భ్రమరాల నాదాలు.... ఆకాశాన్ని ముద్దాడేందుకు తపనపడేలా ఉవ్వెత్తున ఎగిరపడే జతారులు... ఇవన్నీ ప్రకృతి రమణీయతకు దర్పణాలు. దేశ రాజధానిలో.... ప్రధమపౌరుని నిలయంవద్ద ఠీవిగా...దర్పంగా ఆకర్షించే మొఘల్‌ గార్డెన్‌ సోయగమిది. వందల ఏళ్ల చరిత్ర... పర్షియన్‌, మొఘల్‌ నిర్మాణ శైలి....ఆకట్టుకునే పుష్పజాతులు, ఔషధవనాలు వెరసి మొఘల్ గార్డెన్‌ శోభను ద్విగుణీకృతం చేస్తున్నాయి. పండితపామరులను....దేశ విదేశీయులను ఒకే రీతిలో ఆకట్టుకుని మనసుదోచే ఈ పూదోట అందరికీ అందుబాటులోకి వచ్చేది ఏడాదిలో ఒక్క నెల మాత్రమే. మరి ఉద్యానవన సొబగులు ఏంటో చూద్దాం.నిర్మాణం...

మొగల్‌ సామ్రాజ్య స్థాపకుడు బాబర్‌ పలు చోట్ల ఇస్లామిక్‌ పద్ధతిలో తోటలను ఏర్పాటు చేశారు. మన రాష్టప్రతి భవన్‌లో ఉంది కూడా ఆయన నిర్మించిందే. తరువాత పచ్చటి పచ్చిక లాన్‌లను బ్రిటీష్‌ వారు ఏర్పాటు చేశారు. అందుకే ఈ అందాల పూదోట మొఘల్‌, బ్రిటిష్‌ సమ్మిళిత శైలిలో ఉంటుంది. మొగల్‌ కాలం అనంతరం సర్‌ ఎడ్వర్ట్‌ లిటిన్స్‌ ఈ గార్డెన్స్‌ రూప శిల్పి. ఈ గార్డెన్‌లో మొత్తం మూడు భాగాలుంటాయి.

విస్తీర్ణం....

రెక్టాంగ్యులర్‌, లాంగ్‌, సర్క్యులర్‌ గార్డెనల్‌గా కనువిందు చేస్తుంది. ఈ గార్డెన్‌ను విదేశీ ప్రముఖులు జె.ఎఫ్‌.కెన్నడీ, ఎలిజబిత్‌ రాణి, అబ్రహం లింకన్‌, క్రిస్టియన్‌ డైర్‌ సందర్శించి తన్మయం చెందారు. దాదాపు 13 ఎకరాల్లో ఉన్న ఈ తోటలో తామరపూల ఆకారంలో అందమైన ఆరు ఫౌంటైన్‌లు ఉన్నాయి. వందల రకాల గులాబీలతోపాటు, ఎన్నో ఇతర పూల మొక్కలతో కళకళలాడే మొఘల్‌ గార్డెన్‌ నిర్వహణకు సుమారు 500 మంది తోటమాలులు పనిచేస్తారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ గార్డెన్‌లోకి సందర్శకులను ఫిబ్రవరి నుంచి మార్చి వరకు మాత్రమే అనుమతిస్తారు. అదీ ఉదయం 9.30ల నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకే. సోమవారం గార్డెన్‌ను మూసేస్తారు. ఆ ఒక్క రోజు పూర్తిస్థాయిలో నిర్వహణ పనులు చేపడతారు.

ఉల్లాసభరితం...

రాష్టప్రతి భవన్‌లోని హాల్‌లో మాజీ రాష్టప్రతుల ఫోటోలను వీక్షించవచ్చు. రాష్ట్రపతి భవనానికి వెనుక పేరు గాంచిన మొఘల్‌ గార్డెన్‌ ఉంటుంది. దీనిలో ఉత్తర, దక్షిణ అని రెండు భాగాలుగా విభజించారు. అనేక రకాల పూలు మొక్కలతో పర్యావరణ అందాలను పోత పోసినట్లుగా గోచరిస్తుంది. అత్యంత సౌందర్యవంతమయిన గులాబీ తోట మన మనసులను కట్టిపడేస్తుంది. వాటర్‌ ఫౌంటెన్‌ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. వివిధ రకాల పూల మొక్కలతో చూపరులను ఎంతగానో ఆకట్టుకునే చారిత్రాత్మక మొఘల్‌ గార్డెన్స్‌ను తిలకించడానికి త్వరలో ప్రజలను అనుమతించనున్నారు.

రాష్టప్రతి భవన్‌ ఉద్యానవన ఉత్సవాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు గార్డెన్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ఈ తోటలలో అనేక రకాలు, జాతుల పూల మొక్కలు ఉన్నాయి. ఇది దేశంలోని విభిన్న మతాలకు, కులాలకు ప్రతీకగా నిలుస్తోంది. రాష్టపత్రి భవన్‌లోని ఈ మొఘల్‌ గార్డెన్స్‌లో ఫ్లోరల్‌ కార్పెట్స్‌, బోన్సాయి గార్డెన్‌, కాక్టస్‌ కార్నర్‌ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయనడంలో ఆశ్చర్యం లేదు. మన దేశంలోని తాజ్‌మహల్‌, కుతూబ్‌మీనార్‌ల తరువాత ప్రజలు దీన్ని సందర్శించడానికే ఎక్కువ ఇష్టపడతారు.

సర్కులర్‌ గార్డెన్‌..

ప్రధాన భవనం పక్కనే ఉండేది సర్క్యులర్‌ గార్డెన్‌. ఇందులో గుబాళించే పూల మొక్కలతో పాటు.. ఔషధ మొక్కలు, చెట్లు కనిపిస్తాయి. ఒబెసిటీ, డయాబెటీస్‌, కేన్సర్‌ నివారణ మొక్కలే ఎక్కువ. బర్మహి, స్టీవియా, పావింకిల్‌ తరహా మొక్కల్ని ఇక్కడ చూడొచ్చు. వివిధ మ్యూజికల్‌ ఫౌంటైన్‌లు కూడా వీక్షకులను పలకరిస్తాయి. పూల మధ్య విహరించే రంగురంగుల సీతాకోక చిలుకల అందాలు కనువిందు చేస్తాయి.

Mughal_Gardens_రెక్టాంగ్యులర్‌ గార్డెన్‌...

రెక్టాంగ్యులర్‌ గార్డెన్‌ ఇది ప్రధాన భవనానికి వెనకుండే గార్డెన్‌. పూల మొక్కలు, చెట్లు, రంగురంగుల తామర పూలతో నిండిన మడుగులు అలసట చెందిన వారికి ఉత్సాహాన్ని తీసుకోస్తాయి. ఈ గార్డెన్లో వివిధ కూరగాయల పంటలెన్నో కనిపిస్తాయి. ఆకు పచ్చని తివాచీ పరచినట్లు లాన్‌లతోపాటు కట్టడాలు కూడా చూపు తిప్పుకోనివ్వవు.

లాంగ్‌ గార్డెన్‌..

లాంగ్‌ గార్డెన్‌ అంతా గులాబీలతో నిండి ఉంటుంది. అందానికే అందం ఈ రోజ్‌ గార్డెన్‌. ఎన్నో రంగులు, రకాల గులాబీలను ఇక్కడ చూడవచ్చు. రెడ్‌రోజ్‌, పింక్‌ రోజ్‌, వైట్‌, డార్క్‌రెడ్‌, యెల్లో, ఆరెంజ్‌ రోజ్‌లు మంత్రముగ్దుల్ని చేస్తాయి. ఈ పూల తోటలకు మొగల్‌ గార్డెన్‌లో నాలుగు ప్రధాన నీటి మార్గాల ద్వారా నీళ్లు సరఫరా అవుతాయి.

హెర్బల్‌ గార్డెన్‌...

అశ్వగంధ, బేరిపండు మింట్‌, బ్రహ్మి, సిట్రోనెల్లా, జెరానియం, ఈవినింగ్‌ ప్రైమ్‌రోజ్‌, గరిత కుమారి, జిలోయ్‌, ఇసాబ్‌గోల్‌, కాల్‌మేగ్‌, లెమన్‌ గ్రాస్‌, మారిగోల్డ్‌, మెంతాల్‌ మింట్‌, పూదీన, పాల్మరోజా, పాపర్‌ మింట్‌ ఇలా ఎన్నో రకాల హెర్బల్‌ మొక్కల గార్డెన్‌ కూడా రాష్టప్రతి భవన్‌లో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  The history of nalanda university
United arab emirates tourism  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles