Tourist information on singapore

Information on Singapore, geography, history, politics, government, economy, population statistics, culture, religion, languages, largest cities, as well as a map and the national flag

Information on Singapore.

tourist information on Singapore.png

Posted: 11/19/2012 05:24 PM IST
Tourist information on singapore

singapore

అక్కడ కాలం మనకంటే రెండున్నర గంటల ముందు నడుస్తుంది... ఆ దేశం మనకంటే రెండు వందల ఏళ్ల ముందు పరుగులు తీస్తోంది ! అక్కడ ప్రతి పౌరుడూ సైనికుడే ! అవినీతిపై కొరడా ఝళిపించి అభివృద్ధికి తెరతీసిన ప్రభుత్వం...
కొత్తదనం కోల్పోని భవనాలు దేశాన్ని చూపించే ఎత్తై ఫ్లయర్... మెరీనా బే సాండ్ టై హోటల్ గిన్నిస్ రికార్డు ఫౌంటెయిన్ ఆఫ్ వెల్త్‌ల సుమహారం సింగపూర్.. విశేషాలు.

సింగపూర్ అంటే మనకు ఆధునికమైన దేశం, ఎన్నో పర్యాటక ఆకర్షణలున్న దేశం, టెక్నాలజీరంగంలో దూసుకుపోతున్న దేశం... వంటి విశేషణాలే తెలుసు. కానీ తక్కువ కాలంలో ఇంతటి అభివృద్ధి ఎలా సాధించింది అంటే... కచ్చితమైన నియమాలు, కఠినమైన నిబంధనలు, అంతకు మించిన లక్ష్యాలు, ప్రభుత్వంలో చిత్తశుద్ధి కారణం. మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దాదాపు ఇరవై ఏళ్లకు సింగపూర్ స్వతంత్ర దేశం అయింది. అభివృద్ధిలో మనకంటే వందేళ్ల ముందు ఉంది. ఎందుకింత ప్రోగ్రెసివ్‌గా ఉంది అని... రెండు దేశాల వనరులను బేరీజు వేస్తే ప్రశ్న జటిలమవుతుంది. వీళ్లకు ప్రధాన ఆదాయ వనరులు టూరిజం, వస్తువుల అమ్మకం, రవాణా మాత్రమే.

మిలటరీలో పనిచేయాలి !

సింగపూర్‌లో పిల్లలు ఒకటో తరగతిలో స్కూల్‌లో చేరినప్పటి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు స్టూడెంట్ ట్రాక్ రికార్డు మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. పీజీ చదివిన వాళ్లను ‘ప్రజాప్రతినిధిగా పనిచేయడం ఇష్టమేనా ’ అని అడుగుతారు. ఆసక్తి ఉంటే రాజకీయరంగాన్ని ఎంచుకోవచ్చు. ఏ సబ్జెక్టులో నిపుణులను అదే రంగానికి మంత్రిని చేస్తారు. అలాగే చదువు పూర్తయిన తర్వాత కెరీర్‌లో స్థిరపడడానికి ముందు రెండేళ్లు మిలటరీలో పనిచేయాలి. ఈ నిబంధన దేశ పౌరులకే. దేశంలో పుట్టని వాళ్లకు ఎప్పటికీ పౌరసత్వం ఇవ్వదు సింగపూర్. వాళ్లు రెసిడెంట్స్ మాత్రమే.అవినీతి లేదు !ఇక్కడ ఉద్యోగుల్లో అవినీతి మచ్చుకు కూడా కనిపించదు. ఉద్యోగి అవినీతితో సంపాదించినట్లు రుజువైతే ఆ ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. పనులు ఎంత కచ్చితమంటే... షిప్ అన్‌లోడింగ్ మూడు గంటలకు మించదు. ఓడ తీరం చేరడానికి ముందే అది ఎంత లోడ్‌తో వస్తోంది, ఎంతమంది పనివాళ్లు కావాలి అని అంచనా వేసి, ఆ ప్రకారం పని మొదలుపెడతారు.

నాణ్యమైన సేవలు !

ఉద్యోగమే కాదు వ్యాపారమూ అంతే కచ్చితంగా ఉంటుంది. కూరగాయల నుంచి ప్రతి వస్తువూ నాణ్యమైనదే ఉంటుంది. ఇవన్నీ వింటూ ఉంటే ఇంతటి కచ్చితమైన నియమాలు, నిబంధనలతో దేశాన్ని అభివృద్ధి చేసింది ఎవరా అన్న సందేహం వస్తుంది. అందుకు సమాధానంగా లీ క్వువాన్ య్యూ పేరు చెబుతారు. ఇతడిని ఫాదర్ ఆఫ్ మోడరన్ సింగపూర్ అంటారు.

అన్నీ కొత్త భవనాలే !

ఇక్కడ ఏ కట్టడమూ పాతగా లేదు, పురాతన భవనాలకు రిపేర్ చేస్తూ యాంటిక్‌ లాగ కాపాడుతుంటారు. ఇళ్లకు ఐదేళ్లకోసారి రంగులు వేసి, పెయింట్ చేసినట్లు సర్టిఫికేట్ తీసుకోవాలి. లేకపోతే వాటర్, కరెంట్ కనెక్షన్‌లు కట్ అవుతాయి. ప్రతి ఒక్కరిలో పరిశుభ్రత పట్ల స్పృహ ఉండాలని ఈ నియమం. దేశంలో పచ్చదనం మెండు, నాలుగో వంతు నేల పార్కులే, కానీ ఒక్క కీటకం కూడా ఉండదు. వారం వారం స్ప్రే చేస్తారు. చైనా టౌన్‌కెళ్తే సింగపూర్‌లో ఉన్న విషయాన్నే మర్చిపోతాం. ఇళ్లు, దుకాణాలు, ఆలయం, ప్రతిభవనమూ చైనా నిర్మాణశైలిలోనే ఉంటుంది. ఈ చైనా టౌన్ దుకాణాల్లో వస్తువులు చవక మాత్రమే కాదు నాణ్యమైనవి కూడ. ఇక్కడ బౌద్ధ చైత్యాన్ని ఎంత చక్కగా నిర్వహిస్తారంటే... వర్షంలో తడిసి వచ్చిన వాళ్ల గొడుగు నీటి చుక్కలతో నేల పాడవకుండా ఉండడానికి ఆలయ ఆవరణలో ‘మీ గొడుగును ఇందులో ఉంచండి’ అనే క్యాప్షన్‌తో ఒక సంచి ఉంటుంది. ఇందుకు కారణం ఇక్కడ రోజూ వర్షం పడడం కూడా కావచ్చు. రోజూ సాయంత్రం 4-6 మధ్య వర్షం పడుతుంది. వర్షం పడినా రోడ్డు మీద చుక్క నీరు కూడా నిలవదు. ఇక్కడ భారతీయులు నివసించే ప్రదేశాన్ని లిటిల్ ఇండియా అంటారు.

టూరిస్ట్ ఫ్రెండ్లీ !

ఇక్కడ పర్యాటకులకు ప్రత్యేక రాయితీలు ఉంటాయి. దేశం నుంచి వెళ్లేటప్పుడు ఎయిర్‌పోర్టులో బోర్డింగ్‌ పాస్‌తో పాటు సింగపూర్‌లో కొన్న వస్తువుల బిల్లులు చూపిస్తే సేల్స్ ట్యాక్సు మొత్తాన్ని ఇచ్చేస్తారు. టాక్సులు దేశంలో నివసించేవాళ్లకే తప్ప పర్యాటకులకు కాదు. మన వాళ్లు కొంతమంది ఫ్లయిట్‌లో సింగపూర్ చేరుకుని షిప్‌లో ఇండియాకు ప్రయాణం చేస్తుంటారు. కానీ సింగపూర్‌కి షిప్‌లో చేరుకుని, ఫ్లయిట్‌లో ఇండియాకు పయనిస్తే టాక్స్ మొత్తం వెనక్కు తీసుకోవచ్చు. సింగపూర్ డాలర్. ఇది దాదాపుగా 45 రూపాయలు. ప్లాస్టిక్ పేపర్‌తో చేసిన ఈ నోట్లు చిరగవు.

హెల్దీ ఫుడ్ !

సింగపూర్‌లో దొరికేది రుచికరమైన ఆహారం కాదు కానీ బలవర్ధకమైన ఆహారం. వెజ్ దొరకడం కొంచెం కష్టం. ఇక్కడ ఎక్కువ సీఫుడ్ తీసుకుంటారు. ఇక్కడి చాకొలెట్ ఫ్యాక్టరీ పర్యటన తియ్యని అనుభూతి. ఇక్కడ రుచిలో ఏ మాత్రం తేడా లేని సుగర్‌ ఫ్రీ చాక్లెట్లు దొరుకుతాయి. ఈ ఫ్యాక్టరీలో వెజిటేరియన్ చాక్లెట్ డ్రింక్ ఇస్తారు.

షాపింగ్ !

మెరీనా బే, బుగీస్ స్ట్రీట్, చైనా టౌన్, గేలాంగ్ సెరాయ్, కంపాంగ్ జెలామ్, అరబ్ స్ట్రీట్, లిటిల్ ఇండియా, నార్త్ బ్రిడ్జి రోడ్, ఆర్చడ్ రోడ్‌లు షాపింగ్ జోన్‌లు. ఈ రోడ్‌లో మైళ్లకు మైళ్లు షాపింగ్ మాల్స్ ఉంటాయి. లేట్‌నైట్ షాపింగ్ కాన్సెప్ట్‌ని పరిచయం చేసింది సింగపూర్. ముస్తుఫా వంటి పెద్ద మాల్స్‌లో 24 గంటలూ షాపింగ్ చేయవచ్చు. ముస్తుఫాలో తప్ప ఇతర మాల్స్‌లో క్రెడిట్, డెబిట్ కార్డులను వాడవద్దని చెబుతారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ నేపథ్యంలో సైబర్ నేరాలు మొదలయ్యాయి, వీటిని అరికట్టే చట్టాలు రూపొందలేదు. ఇక్కడ సింగపూర్ డాలర్, అమెరికన్ డాలర్ వాడకంలో ఉన్నాయి. మనవాళ్లు రూపాయలను అమెరికన్ డాలర్లలోకి మార్చుకోవడం మంచిది. ఎందుకంటే మిగిలిపోయిన అమెరికన్ డాలర్లను హైదరాబాద్‌లో రూపాయల్లోకి మార్చడం సులభం.

సింగపూర్ పర్యాటకం !

సింగపూర్ ఫ్లయర్‌లో టాప్‌కెళితే దేశం మొత్తం కనిపిస్తుంది. ప్రపంచంలో ఇదే హయ్యస్ట్ ఫ్లయర్. సెంటోసా అండర్ వాటర్ వరల్డ్ అక్వేరియంలో ట్యూబ్‌లో వెళ్తూ ఉంటే రకరకాల జలచరాలు తల మీద నుంచి, పక్క నుంచి వెళ్తుంటాయి. సింగపూర్ జూలో నైట్ సఫారీ మర్చిపోలేని అనుభూతి. సింగపూర్ బొటానికల్ గార్డెన్‌లో మొక్కలు, రెండవ ప్రపంచ యుద్ధకాలం నాటి ఫోర్ట్ సిలోసో చారిత్రక మ్యూజియంలో నాటి ఆయుధాలను చూడవచ్చు. మినీ సైజ్ గన్ అంటే ఏడు కేజీలు ఉంటుంది. మెర్లిన్ పార్కులో ఉన్న సింహం తల చేప శరీరం బొమ్మ సింగపూర్ చిహ్నం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sri lanka information and tourism
Information on austria  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles