The Biography of Garimella Satyanarayana A Famous Peot and Indian Freedom Writer | Indian Freedom fighters

Garimella satyanarayana biography famous poet indian freedom writer

Garimella Satyanarayana, Garimella Satyanarayana biography, Garimella Satyanarayana life history, indian freedom fighters, freedom fighters list, andhra freedom fighters, patriotic songs, patriotic writings, Great Nationalist

Garimella Satyanarayana Biography Famous Poet Indian Freedom Writer : Garimella Satyanarayana was a Poet and Freedom Fighter of Andhra Pradesh, India. Satyanarayana Garimella was a great nationalist who influenced and mobilized the Andhra people against the British with his patriotic songs and writings.

‘మాకొద్దు తెల్లదొరతనం’ అంటూ ఉత్తేజం నింపిన స్వాతంత్ర్యయోధుడు

Posted: 07/14/2015 12:29 PM IST
Garimella satyanarayana biography famous poet indian freedom writer

స్వాతంత్ర్యోద్యమ సమయంలో కొందరు కవులు తమ రచయిత, కలం, గళం ద్వారా సమరయోధుల్ని ఉత్తేజపరిచారు. తెల్లదొరతనాన్ని అరికట్టాలంటూ వారు వినిపించిన స్వరానికి చైతన్యం పొంది ఎందరో స్వాత్రంత్ర్యసమరంవైపు అడుగులు వేశారు. అలా తన కవిత్వంతో భారతీయుల్లో ఉత్తేజం నింపిన వారిలో ‘గరిమెళ్ల సత్యనారాయణ’ ఒకరు. స్వాతంత్ర్యోద్యమ కవుల్లో ఈయనకు విశిష్టమైన స్థానం వుండేది. ఎందుకంటే.. ఈయన గేయాలు జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాన్ని ఉర్రూతలూగించాయి. ఆనాడు ఆయన రాసిన ‘మా కొద్దీ తెల్ల దొరతనం’ అనే పాట సత్యాగ్రహులకు గొప్ప ఉత్తేజాన్ని కలిగించింది. ఇలా ఎన్నో దేశభక్తి కవితలు వ్రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో గరిమెళ్ళ ప్రథముడిగా నిలిచారు. ఆనాడు ఈయనలా ప్రసిద్ధిచెందిన మరొక కవి ఎవ్వరూ లేరు.

జీవిత విశేషాలు :

1893 జూలై 14వ తేదీన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలుక గోనెపాడు గ్రామంలో సూరమ్మ-వేంకట నరసింహం దంతపతులకు గరిమెళ్ల జన్మించారు. ఈయన ప్రాధమిక విద్య స్వగ్రామమైన ప్రియాగ్రహారంలో సాగింది. ఆ తర్వాత పై చదువులు విజయనగరం, మచిలీపట్నం, రాజమహేంద్రవరం మొదలైనచోట్ల కొనసాగింది. ఈయన బి.ఏ. పూర్తి చేసిన తర్వాత గంజాం కలెక్టర్ కార్యాలయంలో కొన్నాళ్లు గుమస్తాగా పనిచేశారు. ఆ తరువాత విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాథ్యాయుడిగా కొన్నాళ్లపాటు పనిచేశారు. ఈయనకు చిన్నప్పుడే ఆయన మేనమామ కూతురితో వివాహం జరిగింది. ఆనాడు తెల్లదొరల అరాచకాలు నచ్చక స్వాతంత్ర్యోద్యమం బాటవైపు ఈయన అడుగులు వేశారు.

స్వాతంత్ర్యోద్యమం వైపు కలిగిన స్ఫూర్తి :

1920 డిసెంబర్‍లో కలకత్తాలో జరిగిన కాంగ్రెసు మహాసభలో సహాయనిరాకరణ తీర్మానం అమోదించబడింది. ఆ సమయంలో గరిమెళ్ల ఉద్యమంలోకి దూకారు. అప్పుడు ఆయన ‘మా కొద్దీ తెల్లదొరతనం’ అనే పాటను రాశారు. ఈ పాట ఆనోటా ఈనోటా చక్కర్లు కొట్టి.. చివరకు ఆనాటి బ్రిటీషు కలెక్టరు బ్రేకన్ చెవినపడింది. ఆయన గరిమెళ్ళను పిలిపించి పూర్తి పాట పాడమనగా.. గరిమెళ్ల అద్భుతంగా పాడారు. బ్రిటిష్ కలెక్టర్ తెలుగు రాకపోయినా.. ‘పాటలో ఎంతట మహత్తర శక్తి ఉంది.. సామాన్య ప్రజల్ని చైతన్యపరుస్తుంది’ అని పేర్కొన్నాడట. అయితే.. ఆ పాటను వ్రాసినందుకు గరిమెళ్ళకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించారు.

శిక్ష నుంచి బయటపడిన అనంతరం ఆనాడు వీధుల్లో గరిమెళ్ల ఆ పాట పడుతూ కవాతు చేసేవారట. దీంతో ప్రభుత్వాధికారులు మళ్లీ ఆయన్ను అరెస్ట్ చేసి.. రెండుళ్ల కారాగార విక్ష విధించారు. ఈయన జైల్లో వుండగా.. ఆయన తండ్రి చనిపోయారు. అప్పుడు క్షమాపణ చెబితే ఒదులుతామని బ్రిటీష్ వారు చెప్పగా.. ఆయన అందుకు నిరాకరించారు. అంతటి దేశభక్తి కలిగిన వ్యక్తి గరిమెళ్ల. ఇటువంటి దేశభక్తి కలిగిన వ్యక్తి.. చివరిదశలో దుర్భరదారిద్ర్యాన్ని అనుభవించారు. ఆ క్రమంలోనే ఆయన 1952 డిసెంబర్ 18వ తేదీన మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Garimella Satyanarayana  Indian Freedom Fighters  Patriotic Writers  

Other Articles