Pandit jawaharlal nehru biography india prime minister freedom fighters

pandit jawaharlal nehru news, pandit jawaharlal nehru biography, pandit jawaharlal nehru life story, pandit jawaharlal nehru prime minister post, pandit jawaharlal nehru photos, pandit jawaharlal nehru wikipedia, pandit jawaharlal nehru wiki, pandit jawaharlal nehru history, pandit jawaharlal nehru story, pandit jawaharlal nehru personal life story, indian freedom fighters, indian prime ministers list, telugu news, telugu movies news

pandit jawaharlal nehru biography india prime minister freedom fighters

దేశపు మొదటి ప్రధానమంత్రిగా పనిచేసిన ‘చాచా’ నెహ్రూ

Posted: 11/14/2014 02:39 PM IST
Pandit jawaharlal nehru biography india prime minister freedom fighters

పండిట్ జవహర్ లాల్ నెహ్రూ... భారతదేశానికి తొలిసారిగా ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన భారత స్వాతంత్ర్యపోరాటములో ప్రముఖ నాయకుడు. బ్రిటీష్ పాలననుంచి దేశానికి పూర్తిగా విముక్తి (స్వాతంత్ర్యం) కల్పించడంలో ఈయన పాత్ర కీలకం! 1947 ఆగష్టు 15వ తేదీన భారత దేశం స్వాతంత్ర్యం సంపాదించినపుడు న్యూఢిల్లీలో స్వతంత్ర భారత పతాకాన్ని ఎగురవేసే గౌరవం దక్కిన ఏకైక భారతీయుడు నెహ్రూ. ఆయన సుధీర్ఘ పదవీకాలం స్వతంత్ర భారత దేశ సంప్రదాయాలు, విధానాలు రూపొందించటంలో సాధనంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రిగా ఆయన అందించిన గొప్పసేవలకుగాను కొన్ని సందర్భాలలో ‘‘నవ భారత రూపశిల్పి’’గా పేర్కొంటారు.

జీవిత విశేషాలు :

వ్యక్తిగత జీవితం :

1889 నవంబర్ 14వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని అలహాబాదులో నివాసమున్న స్వరూపరాణి, మోతీలాల్ నెహ్రూ దంపతులకు మొదటి సంతానంగా నెహ్రూ జన్మించారు. నెహ్రూ తండ్రి మోతిలాల్ ఒక సంపన్న న్యాయవాది, రాజకీయవేత్తగా పేరుగాంచారు. తండ్రి బాగానే సకలసంపదలు సంపాదించుకోవడంతో నెహ్రూ బాల్యంనుంచి విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. ఇంటివద్దే ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పాఠశాల్లో ఆయన విద్యాభ్యాసం పూర్తిచేశారు. అనంతరం పైచదువులకోసం  15 సంవత్సరాల వయస్సులో ఇంగ్లాండుకు పయనమయ్యారు. మొదట ఇంగ్లాండులో హారో పాఠశాలలో ఆ తరువాత ట్రినిటీ కళాశాలలో విద్యనభ్యసించారు. ఫిబ్రవరి 8, 1916లో కాశ్మీరి బ్రాహ్మణ వంశానికే చెందిన కమలాకౌల్ తో అయన వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె , ఇందిరా ప్రియదర్శిని పుట్టింది.

మరికొన్ని విషయాలు :

భారత దేశ బాలలు, యువకులు విద్యను అభ్యసించాలనే తీవ్రమయిన కోరికగల నెహ్రూ... భారతదేశ భవిష్యత్ అభివృద్ధికి అది అత్యవసరమని భావించారు. ఆ సంకల్పంతోనే ‘‘ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్, ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మానేజ్మెంట్’’ వంటి అనేక ఉన్నత విద్యా సంస్థలను ఆయన ప్రభుత్వం నెలకొల్పింది. భారత దేశ బాలలందరికీ నిర్బంధ, ఉచిత ప్రాధమిక విద్య అందించాలనే సంకల్పాన్ని నెహ్రూ తన పంచ-వర్ష ప్రణాళికలలో ప్రతిపాదించారు. దీని కోసం నెహ్రూ మూకుమ్మడి గ్రామ భర్తీ కార్యక్రమాలను, వేలాది పాఠశాలల నిర్మాణాన్ని పర్యవేక్షించారు. అంతేకాదు... బాలల్లో పోషకాహార లోప నివారణకోసం ఆయన ఉచిత పాలు, ఆహార సరఫరా ప్రారంభించడానికి చొరవ తీసుకున్నారు. వయోజనుల కోసం, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల వారికోసం, వయోజన విద్యాకేంద్రాలు, వృత్తి, సాంకేతిక విద్యా పాఠశాలలు కూడా నిర్వహించారు.

కుల వివక్షను శిక్షార్హమైన నేరంగా పరిగణించడంకోసం, స్త్రీలకు న్యాయ పరమైన హక్కులను, సాంఘిక స్వతంత్రతకు, హిందూ చట్టంలో పలు మార్పులను నెహ్రూ ఆధ్వర్యంలోని భారత పార్లమెంటు చేసింది. షెడ్యుల్డ్ కులాలు, తెగల ప్రజలు ఎదుర్కొంటున్న సాంఘిక అసమానతలను, అననుకూలతలను రూపుమాపడానికి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థలలో రిజర్వేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసారు. నెహ్రూ లౌకికవాదానికి, మత సామరస్యానికి, ప్రభుత్వంలో అల్ప సంఖ్యాక వర్గాల ప్రాతినిధ్యానికి పూనుకున్నారు. హిందూ స్త్రీల దాస్య విముక్తికి, సమానత్వ సాధనకు ఉద్దేశింపబడిన అనేక న్యాయ సంస్కరణలు ఆమోదింప చేసారు. ఈ సంస్కరణలలో వివాహ కనీస వయోపరిమితిని పన్నెండు నుండి పదిహేనుకు పెంచడం జరిగింది. అలాగే భర్తనుంచి విడాకులు పొందిన మహిళలకు ఆస్తి వారసత్వాన్ని పొందేలా శక్తివంతం చేయడం, వినాశకరమైన వరకట్న విధానాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించడం లాంటివి ఆయన ప్రభుత్వం చేపట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles