Tollywood super star krishna block buster movie simhasanam

super star krishna, block buster movie simhasanam, produced by krishna, film released in 1986, krishna double action, telugu film industry, jayaprada, many records in telugu film industry

tollywood super star krishna block buster movie simhasanam

ఈ 'సింహాసనానికి ' తిరుగులేదు

Posted: 05/10/2013 12:30 PM IST
Tollywood super star krishna block buster movie simhasanam

100 సంవత్సరాల సినిమా పండుగ ని మనం జరుపుకుంటున్నాం , సినిమా అనే పదాన్ని , ఇంతటి ఎంటర్టెయిన్మెంట్ ని మనకు పరిచయం చేసిన 'దాదా సాహెబ్ ఫాల్కే' దగ్గరి నుండి , నేటి స్టార్ నిర్మాతలు , దిల్ రాజు, అల్లు అరవింద్ వరకు , సినీ పరిశ్రమ , ముఖ్యం గా మన తెలుగు సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడానికి కృషి చేసిన అందరి గురించీ మనం నేమరవేసుకుంటున్నాం . ఇందులో భాగం గానే, నేటికీ మనల్ని అమితంగా ఆకట్టుకునే నాటి సినిమాల గురించి కూడా తెలుసుకుంటున్నాం . 'మాయా బజార్' దగ్గరి నుండి 'గుండమ్మ కధ' , 'రక్త సంబంధం' దగ్గరి నుండి 'మంచి మనసులు', 'డాక్టర్ చక్రవర్తి' , 'మహా భారతం', 'రామాయణం', 'కులేబకావాలీ కధ' , 'దేవదాసు' , 'జగదేక వీరుని కధ' , 'అర్ధాంగి ' , 'డాక్టర్ . చక్రవర్తి ', తరువాతి తరం లో ఒచ్చిన సినిమాలు , ఇలా ఒక్కటేమిటి , మనకు ఇష్టమైన అలనాటి సినిమాల లిస్టు రాస్తూ కూర్చుంటే , సమయం తెలియదు ... ఇటువంటి కోకొల్లలైన ఆణిముత్యాలలో మెరిసిన ఒకానొక తార , 'సింహాసనం '... చిత్రం పేరుకి తగ్గట్టుగానే , ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రంహరాధం పట్టారు గత సంవత్సరమే ఈ చిత్రం 25 సంవత్సరాల విడుదలని పూర్తీ చేసుకుంది ... ఇప్పటికీ ఈ సినిమా గురించి ఆలోచిస్తే 'ఆకాశం లో ఒక తార' పాట మనకు గుర్తుకురాక తప్పదు . కుటుంబ కధా చిత్రాలకి ప్రేక్షకులు పెద్దపీట వేస్తున్న సమయం లో , ఒక విన్నోత్న కధాంశం తో , అప్పట్లోనే 3 కోట్ల భారీ బడ్జెట్ తో , తన స్వీయ నిర్మాణ సంస్థ 'పద్మాయల' లో సూపర్ స్టార్ కృష్ణ నిర్మించి , నటించి , దర్శకత్వం వహించిన చిత్రం 'సింహాసనం' ...

మానవీయ విలువలని తెలిపే 'పాడి పంటలు' అప్పుడే విడుదల అయిన సమయం . సూపర్ స్టార్ కృష్ణ తదుపరి చిత్రం ఏంటి అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం ... ఇటు వంటి సమయం లో , ఇంకొక కుటుంబ కధ తో ముందుకు రావడం ఇష్టం లేదు కృష్ణ గారికి ... అప్పుడే , ఒక కధని అనుకున్నారాయన ... ఈ సమయం లో ఇంత భారీ వ్యయం తో , ఇటువంటి కధని నమ్మి సినిమా తీస్తే , ప్రేక్షకులు స్వీకరిస్తారా??? ఇంత రిస్క్ అవసరమా అని కృష్ణ గారిని వారించిన వారూ లేకపోలేదు ... అయితే తన ఆలోచనకి కార్య రూపం ఇవ్వాలి అన్న ఉద్దేశం తో , కృష్ణ 'సింహాసనం' తెర మీదకు తీసుకెళ్ళారు ...

ఈ సినిమా సంగీతం దగ్గరి నుండి , కధనం వరకు ప్రతీ అంశం దేనికదే ప్రత్యేకం . కృష్ణగారు హీరోగా , నిర్మాతగా , దర్శకుడిగా ఈ చిత్రం కోసం త్రిపాత్రాభినయం చేసి , విజయం సాధించారు ... అప్పట్లో బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోన్న బప్పీలహరి ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యి , నేటికీ మరచిపోలేని బాణీలని అందించారు ... ఇక ఆర్ట్ డిపార్ట్మెంట్ అనే శాఖను ఈ చిత్రం లో పూర్తీ స్థాయి లో ఉపయోగించుకున్నారు అనే చెప్పాలి . ఈ చిత్రం కోసం 35 లక్షల భారీ వ్యయం తో పద్మాలయ లో సెట్ వేసారు ...

చిత్రం లో మరొక ఆకర్షించే విషయం , భారీ తారాగణం ... జయప్రద , రాధ, మందాకినీ వంటి తారలు హీరోయిన్లు గా , తెలుగు లో కృష్ణ హీరోగా , హిందీ వెర్షన్ లో జితేంద్ర హీరోగా ఈ చిత్రం లో నటించారు ... తెలుగులో ఈ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసుకుందో , హిందీ వెర్షన్ లో కూడా అంతటి విజయాన్నే సొంతం చేసుకుంది ...

ఒక విధంగా చెప్పాలంటే , సూపర్ స్టార్ కృష్ణ నట విశ్వరూపాన్ని ఆవిష్కరించిన చిత్రం 'సింహాసనం'... అలాగే, నిర్విరామ కృషితో చేసే ప్రయత్నానికి ప్రేక్షకులు తప్పకుండా బ్రంహరాధం పడతారు అని ఈ చిత్ర విజయం మరొక్కసారి రుజువు చేసింది …

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles