Nirmala pandit haridwar private tution teacher indore chain snatcher rewarded 10 thousand police investigation

nirmala pandit, nirmala pandit chain snatcher, nirmala pandit catch chain snatcher, indore chain snatcher, haridwar private teacher nirmala pandit, indore police stations, hyderabad crime news, hyderabad chain snatchers

nirmala pandit haridwar private tution teacher indore chain snatcher rewarded 10 thousand police investigation

చైన్ స్నాచర్ను ఓ మహిళ పరుగెత్తి పట్టుకుందని...

Posted: 12/01/2014 06:45 PM IST
Nirmala pandit haridwar private tution teacher indore chain snatcher rewarded 10 thousand police investigation

ఈమధ్య చైన్ స్నాచర్’లా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మహిళల గొలుసులను కొట్టేయడంతోబాటు వారికి హాని కలిగిస్తున్నారు. తమ వెనుక పరుగెత్తుకుంటూ రాకూడదనే ఉద్దేశంతో చైన్ లాగేసుకున్న తర్వాత కిందపడేసి మరీ పారిపోతున్నారు దుర్మార్గులు! పైగా గొలుసు కొట్టేశారన్న భయంతో మహిళలు కంగారుతో ఏంచేయాలో బిత్తరపోతారు. కానీ ఇక్కడ సీన్ మొత్తం రివర్స్’లో జరిగింది. తన గొలుసు కొట్టేసిన వాడిని ఓ మహిళ ధైర్యంగా వెంటే పరుగెత్తి పట్టుకుని, పోలీసులకు అప్పగించి పదిమందికి ఆదర్శంగా నిలిచింది.

వివరాల్లోకి వెళ్తే.. హరిద్వార్ నగరంలో ప్రైవేటు ట్యూషన్లు చెప్పుకొనే నిర్మలా పండిట్ అనే మహిళ.. ఇండోర్’లో వుండే తన బంధువుల ఇంటికి వచ్చింది. సరదాకోసం బయటకు వెళ్లినప్పుడు ఓ వ్యక్తి వచ్చి ఆమె మెడలో ఉన్న గొలుసు కొట్టేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే.. అందరి మహిళల్లా భయపడకుండా ఆమె ధైర్యంగా అతడిని కిలోమీటరు దూరం వరకు పరిగెత్తి పట్టుకుంది. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించింది. ఆమె ధైర్యానికి మెచ్చుకున్న పోలీసులు 10 వేలరూపాయల రివార్డుతో సత్కరించారు.

అందరూ మహిళలు కూడా ఇలాగే ధైర్యంగా ఎదుర్కుంటే.. చైన్ స్నాచర్ల బెడద నుంచి తమను తామే రక్షించుకున్నట్లవుతారు. అలాకాకుండా ఇంకా భయపడుతూనే వుంటే.. దుండగులు తమ పని సునాయాసంగా చేసుకుని వెళ్లిపోతారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని అందరూ మహిళలు అలాగే చేస్తే దుండగుల భరతం పట్టొచ్చని పోలీసులు సూచించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nirmala pandit  indore chain snatcher  indore crime news  private teachers  telugu news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more