Lambasingi records very low temperatures

lambasingi, cold, smog, visakha agency, kashmir, similar, records, low temperatures

lambasingi becoming similar to kashmir as it records very low temperatures

కాశ్మీర్ ను తలపిస్తున్న విశాఖ మాన్యం..

Posted: 11/27/2014 02:35 PM IST
Lambasingi records very low temperatures

విశాఖ మన్యం వాతావరణం మరో కశ్మీరును తలపిస్తోంది. కొద్ది రోజులుగా ఇక్కడి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడంతో మాన్యంలో చలిపులి పంజా విసురుతోంది.. జనవరి వరకు చలి తీవ్రత ఇలాగే ఉంటుందని, రానున్న రోజుల్లో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ పరిశోధాన అధికారులు తెలిపారు. సముద్ర మట్టానికి మూడువేల మీటర్ల ఎత్తులో ఉన్న లంబసింగిలో రోజూ ఉదయం 10 గంటల వరకు పొగమంచు దట్టంగా కమ్ముకునే ఉంటుంది. నిన్న లంబసింగిలో 7 డిగ్రీలు, చింతపల్లిలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆంధ్రా కశ్మీరుగా గుర్తింపు పొందుతున్న లంబసింగి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు.

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తెల్లవారుజామునే ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు. పొగమంచులో లైట్లు వేసుకుని వాహనాల్లో ప్రయాణించడం వీరికి వింత అనుభూతి కలిగిస్తోంది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మళ్లీ చలిగాలులు వీస్తున్నాయి. సాయంత్రం నాలుగు గంటలైతే ఈ ప్రాంతంలో చలిమంటలు వేసుకుని సేదదీరాల్సిన పరిస్థితి నెలకొంది.
 
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lambasingi  cold  smog  visakha agency  kashmir  similar  records  low temperatures  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more