Actor karthik joins congress

karthik joins congress party, tamil hero karthik joins congress, tamilnadu congress latest, tamilnadu politics latest, congress paty latest updates, koliwood latest updates

actor karthik joins congress : tamil hero karthik joins into congress party on wednesday and also amalgamates his party all india nadalam makkal katchini party into congress this will help congress in tamilnadu

కాంగ్రెస్ లో చేరిన సినీ నటుడు

Posted: 11/05/2014 08:38 PM IST
Actor karthik joins congress

సీనియర్ నటుడు కార్తిక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన హస్తం కండువా కప్పుకున్నారు. అంతేకాకుండా తన ‘అఖిల భారత నాదలం మక్కల్ కచ్చి’ పార్టీని కూడా కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇది కాంగ్రెస్ కు పెద్దగా లాభపడకపోయినా.., కనీసం సరైన నేతలు కూడా లేని ప్రస్తుత సమయంలో కార్తిక్ చేరిక కొంతమంది కార్యకర్తలనైనా తీసుకొచ్చే అవకాశముంది.

సీనియర్ నటుడుగా గుర్తింపు పొందిన 54సం.ల కార్తిక్ 2006 సంవత్సరంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. మొదటగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తమిళనాడు రాష్ర్ట విభాగ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత 2009 ఎన్నికలకు ముందుగా ‘ఆల్ ఇండియా నాదలం మక్కల్ కచ్చి’ పార్టి పెట్టి ఎన్నికల్లో పోటి చేశారు. అయితే పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక 2011 లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇబ్బందులు ఎదుర్కుంది. ఈ సమయంలో అన్నాడాఎంకేతో పొత్తు పెట్టుకోవాలనుకన్నప్పటికీ... పలు పరిణామాలతో ఇది కుదర్లేదు.

చివరకు ఆయన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అయితే కేంద్రంలో, రాష్ర్టంలో అధికారంలో లేని పార్టీలో చేరటం విషయంలో కార్తిక్ వ్యూహం ఏమిటో తెలియటం లేదు. తెలుగు, తమిళ భాషల్లో గతంలో ఈయన అనేక సినిమాలు చేశారు. వీటిలో ‘అభినందన’, ‘సీతాకోకచిలుక’, ‘అన్వేషణ’ తదితర సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికి కార్తిక్ సినిమాలు వస్తే చూసే తెలుగు ప్రేక్షకులు చాలామంది ఉన్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karthik  congress  tamilnadu  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more