Jail warder of cherlapally jail harassed prisoner wife

jail harasments, women harassment, women harassed in india, jail woman harassment, jail warder duties, cherlapally jail warder harassments, cherlapally jail cellphones, latest news, telangana

jail warder of cherlapally jail harassed prisoner wife : jail warder in cherlapally jail harassed prisoner ramulu wife by calling her and talking abused in abused language. with wife allegations ramulu given complaint in kushaiguda police station

ఖైదీ భార్యను వేధిస్తున్న జైలు వార్డర్

Posted: 10/28/2014 10:46 AM IST
Jail warder of cherlapally jail harassed prisoner wife

ఓ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ భార్యను వేధిస్తున్న ఘటన చర్లపల్లి జైలులో వెలుగు చూసింది పోలిసుల వివరాల ప్రకారం.., రాములు అనే ఖైదీ ఓ కేసులో దోషిగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో అప్పుడప్పుడూ భర్తను చూసేందుకు రాములు భార్య జైలుకు వచ్చేది. అలా ఓ సారి రాములు భార్య నంబర్ తీసుకున్న వార్డర్ వెంకన్న ఆమెకు తరుచుగా ఫోన్ చేయటం మొదలు పెట్టాడు. అసభ్యంగా మాట్లాడటం, తాను చెప్పినట్లు వినాలని ప్రలోభపెట్టడం వంటివి చేశాడు. ఈ విపరీత ప్రవర్తన ఈ మద్య మరీ ఎక్కువైంది.

వెంకన్న వ్యవహారంపై ఈ మద్య జైలుకు వచ్చిన సమయంలో రాములుకు అతని భార్య తెలిపింది. దీంతో వార్డర్ ప్రవర్తనపై రాములు జైలు ఉన్నతాధికారులను కలిశాడు. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కుషాయిగూడ పోలిసులకు ఫిర్యాదు చేశాడు. కంప్లయింట్ అందుకున్న పోలిసులు ఆరోపణలపై ధర్యాప్తు చేస్తున్నారు. అయితే వెంకన్న ప్రవర్తనపై ఇతర ఖైదీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైళ్లో ఒంటరిగా ఉన్న తమను చూడటానికి వచ్చే  కుటుంబ సభ్యులను వివిధ కారణాలతో ఇలా వేధించటం సరికాదు అని మండిపడుతున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jail  prisoner  wife  harassment  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more