Tdp candidate won in nandigama bypoll

nandigama, nandigama bypoll, bypoll results, elections, by poll elections, tangirala sowmya tdp leader, tangirala sowmya , tangirala sowmya mla, tangirala sowmya won, tangirala sowmya nandigama mla, tdp, ysr congress

krishna district people given choice to tdp in bypoll of nandigama mp constitunecy : ruling party candidate tangirala soumya won nandigama mla seat in bypoll

నందిగామ ఉప ఎన్నికలో టీడీపీ విజయం

Posted: 09/16/2014 11:21 AM IST
Tdp candidate won in nandigama bypoll

అనుకున్నదే జరిగింది. అధికార పక్షానికే ప్రజలు పగ్గాలు అప్పగించారు. ఏపీలో జరిగిన ఉప ఎన్నికలో నందిగామ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్ధి తంగిరాల సౌమ్య గెలుపొందారు. సమీప అభ్యర్ధి, కాంగ్రెస్ పార్టీ నేత బోడపాటి బాబురావుపై 74,827 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటి చేసిన తంగిరాల ప్రభాకర రావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయతే ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయన మరణించటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్దిని నిలబెట్టలేదు. ప్రభాకర్ రావును గౌరవిస్తూ., ఆయన కుటుంబ సభ్యులకే అవకాశం ఇస్తామని పార్టీ ప్రకటించింది. అయితే కాంగ్రెస్ మాత్రం అదృష్టం పరిక్షించుకోవటానికి అభ్యర్ధిని పోటికి పెట్టింది. అసలే విభజన కోపంతో ఉన్న ప్రజలు సానుభూతి ఓట్లను కూడా కలిపి వేయటంతో సౌమ్య గెలిచింది. అయితే ఈ సారి కాంగ్రెస్ పరిస్థితి కాస్త మెరుగయింది. బాబురావు డిపాజిట్ దక్కించుకుని పరువు కాపాడుకున్నారు. మొత్తం పోలయిన ఓట్లలో సౌమ్యకు 99,748 ఓట్లు రాగా, బాబురావుకు 24,921 ఓట్లు వచ్చాయి. ఇక పోటిలో ఉన్న ఒక స్వతంత్ర్య అభ్యర్ధికి 650 ఓట్లు వచ్చాయి. తండ్రిపై నమ్మకం ఉంచి తనను గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు సౌమ్య ధన్యావాదాలు తెలిపారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tangirala sowmya  nandigama  bypoll result  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more