Emergency announced in islamabad

pakisthan, pti, islamabad, pakisthan news, nawaz sharif, rallies, rally, pti protest, islamabad emergency, pakisthan army, pakisthan police, world news, imran khan

pti of pakisthan protesting against nawaz sharif ruling : emergency announced due to pti rallies against government large number of forces in security

ఇస్లామాద్ లో ఎమర్జెన్సి విధింపు

Posted: 08/20/2014 09:41 AM IST
Emergency announced in islamabad

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని నవాజ్ షరీఫ్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ చేపట్టిన ఆందోళనలు తీవ్రం అయ్యాయి. ఇమ్రాన్, రాజకీయ వేత్త ఖాద్రీ మద్దతుదారులు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. ఆందోళనకారులు రెడ్ జోన్ లోని పార్లమెంటు వైపుకు బయల్దేరటంతో పోలిసులు అప్రమత్తమయ్యారు. దాదాపు నలబైవేల మంది సైనిక బలగాలను రెడ్ జోన్ ప్రాంతంలో మోహరించారు. పార్లమెంటు సహా ఇతర ఏ భవనాల్లోకి ఆందోళనకారులు వెళ్లవద్దని, శాంతియుతంగా నిరసనలు తెలపాలని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు.

నవాజ్ షరీఫ్ ప్రధాని అయిన తర్వాత పాక్ పరిస్థితులు మరింత దుర్బరం అయ్యాయని పీటీఐ నేత ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు. దేశ ప్రగతి మాట అటుంచితే సమస్యలు మరింత పెరిగాయని మండిపడుతున్నారు. చేతగాని ప్రభుత్వం గద్దె దిగాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వైదొలిగే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయన్నారు. ఆందోళన నేపథ్యంలో ఇస్లామాబాద్ లో ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించింది. వేరే నగరాల నుంచి రాజధానికి రాకపోకలపై ఆంక్ష్లు విధించింది. ఆగస్టు 15న ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులతో ఆజాదీ మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్ సందర్బంగా ఖాన్ పై హత్యాయత్నం జరిగింది.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakisthan  pti  imrankhan  nawaz sharif  islamabad  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more