Indian mujahideen warning letter to mumbai police commissioner

Indian Mujahideen warning letter, IM warns Mumbai police commissioner, Red alert Hydeabad airport

Indian Mujahideen warning letter to Mumbai Police Commissioner: Red alert at Shamshabad airport Hyederabad

పోలీసులకు కునుకు లేకుండా చేస్తున్న ముజాహిదీన్!

Posted: 07/29/2014 09:47 AM IST
Indian mujahideen warning letter to mumbai police commissioner

ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు పోలీసులకు కునుకు లేకుండా చెయ్యటం కోసమే అన్నట్లు ముంబై పోలీస్ కమిషనర్ కి ముందస్తు హెచ్చరికలను లేఖ ద్వారా చేసారు.  ఆ లేఖ ప్రకారం ఇండియన్ ముజాహిదీన్ దేశంలో పలు ముఖ్య ప్రాంతాల్లోను, మెట్రో నగరాల్లోను బాంబులతో దాడిచెయ్యబోతున్నారు.  

సామాన్యంగా దొంగదెబ్బ తీసే ఉగ్రవాదులు ఇలా ముందుగానే హెచ్చరికలు ఎందుకు చేస్తున్నారూ అంటే వాళ్ళకు పోలీసులకు విశ్రాంతి లేకుండా చెయ్యాలనే ఉద్దేశ్యం కావొచ్చు లేదా ఇలా హెచ్చరికలు చేసి చేసి చివరకు అప్రమత్తమంతా పల్చబడిపోయిన సమయంలో వేటు వెయ్యటానికీ కావొచ్చు.  ఆకతాయిలు రాసిన లేఖా కావొచ్చు, లేదా నిజంగానే చెప్పింది చేసి, లేదా చేసేది చెప్పామని హీరోలమనిపించుకునే ప్రయత్నమూ కావొచ్చు.  కానీ ఏ లేఖనూ ఏ ఫోన్ కాల్ నూ విస్మరించగూడదు కాబట్టి పోలీసులు ఈ లేఖను సీరియస్ గానే తీసుకుంటున్నారు.  ఫలితంగా అన్ని రాష్ట్రాలకూ రెడ్ అలెర్ట్ పంపించబడింది. 

శంషాబాద్ లో అప్రమత్తం

ఆంధ్రప్రదేశ్ లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సి వి ఆనంద్ శంషాబాద్ విమానాశ్రయంలో లో భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేసారు.  అదనపు బలగాలతో ప్రవేశ ద్వారాలను, సందర్శకులు ఎక్కువగా తిరిగే ప్రాంతాలలోను భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా చేసి, అనుమానస్పద వ్యక్తుల కదలికలను కనిపెట్టేందుకు పోలీసులు, విమానాశ్రయం భద్రతా సిబ్బంది సంసిద్ధమయ్యారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more