Glaze trading india pvt ltd scam

Glaze Trading India Pvt Ltd Scam, glaze india, andhrapradesh, telangana, telugu unemployees, job consultancy

Glaze Trading India Pvt Ltd Scam

దెబ్బకు రోడ్డునపడ్డ తెలుగు నిరుద్యోగులు.....

Posted: 07/12/2014 05:37 PM IST
Glaze trading india pvt ltd scam

నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడే సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను భారీ ఎత్తున మోసం చేస్తున్నారు. మీరు పది చదవితే చాలు .. నెలకు వేల రూపాయలు సంపాదించే అవకాశం అంటూ ఆశ చూపించి.. చివరకు ఘోరంగా మోసం చేస్తున్నారు.

గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా సంస్థ. పెద్దమొత్తంలో నిరుద్యోగుల నుంచి సొమ్ము రాబట్టుకుంది. రాష్ట్రం కాని రాష్ట్రానికి పంపి తెలుగువారిని ఇబ్బందులకు గురిచేసింది. నిరుద్యోగులను నట్టేట ముంచుతున్న గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గుట్టు బయటపడింది. పదవ తరగతి చదివి పదివేలు చెల్లిస్తే.. నెలనెలా యాభైవేల రూపాయల సంపాదన అంటూ నిరుద్యోగులను మోసగిస్తున్న సదరు సంస్థ భాగోతం బయటపడటంతో.. అందరు షాక్ తిన్నారు.

అరకొర చదువులకు పెద్దమొత్తంలో నెల సంపాదన అనుకుంటూ.. ఎంతోమంది సంస్థ కార్యాలయానికి క్యూ కట్టారు. పదివేల చొప్పున ఏకంగా పదివేలమంది వరకు డబ్బులు సంస్థకు ముట్టజెప్పారు. సంస్థ కల్లిబొల్లి మాటలు విని.. వేలకు వేలు ముట్టజెప్పి జార్ఖండ్ రాష్ట్రానికి ఉద్యోగానికి వెళ్లిన తెలుగువారు ఇబ్బందులకు గురయ్యారు. భాష రాక.. ఏం చేయాలో తెలియక నానాతిప్పలు పడినట్లు తెలుస్తోంది.

గ్లేజ్ ట్రెడింగ్ ఇండియా సంస్థ నుండి మోసపోయిన బాధితుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. పదివేలు కడితే ఉద్యోగం సొంతమన్న నిర్వాహకులు.. తర్వాత మాట మార్చారు. మీతో పాటు నలుగురిని జాయిన్ చేస్తే తప్ప మీకు జాబ్ లేదంటూ చైన్ సిస్టమ్ కథలు చెప్పారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సంస్థ యాజమాన్యాన్ని ప్రశ్నించినా లాభం లేకపోయింది. సొంత రాష్ట్రాలకు వచ్చేందుకు డబ్బులు లేక జార్ఖండ్ లోనే రైల్వే స్టేషన్లు, ఫుట్ పాత్ లపై తలదాచుకునే పరిస్థితి దాపురించింది.

 RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more