Tjac to stage satyagraha deeksha సత్యాగ్రహంతో ‘కారు’సెగ రాజుకోనుందా..?

Tjac to stage satyagraha deeksha with support of opposition parties

joint action commitee, satyageaha deeksha, rythu samanvaya samiti, Congress, TDP, Kodandaram, uttam kumar reddy, revanth reddy, Telangana politics, telangana

Tjac to stage satyagraha deeksha on october 3rd demanding to stop rythu samanvaya samithi interferance in official land records with support of opposition parties

సత్యాగ్రహంతో ‘కారు’సెగ రాజుకోనుందా..?

Posted: 09/28/2017 03:58 PM IST
Tjac to stage satyagraha deeksha with support of opposition parties

అధికార పార్టీ మాటల గారిడీతో ప్రజలను మభ్యపెట్టుతుందే తప్ప.. ప్రజాహిత కార్యక్రమాలకు పూనుకోవడం లేదని, ఉద్యమ సమయంలో చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని.. మరీ ముఖ్యంగా రైతన్నల అక్రంధనలను తీర్చేందుకు పూనుకోవడం లేదని నిరసిస్తూ.. అక్టోబర్ 3న సత్యగ్రహ దీక్షను పూనుకోనుంది తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటి. ఈ మేరకు జేఏసీ అధ్యక్షడు కోదండరామ్ వెల్లడించిన విషయం కూడా తెలిసిందే.

రైతు సమస్వయ సమితులకు గ్రామాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిస్తూ.. మండల కేంద్రాల్లో ధర్నాలకు దిగాలని, రాష్ట్రస్థాయిలో సత్యగ్రహ దీక్షలకు పూనుకుంటామని కొదండరామ్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన సత్యగ్రహ దీక్షకు తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా మద్దతును ప్రకటించింది. దీంతో తెలంగాణలో కూడా ఎన్నికల వాతావరణం అప్పుడే వేడి రాజుకుంటుందా..? అని అన సందేహాలు రేకెత్తుతున్నాయి.

ఈ మేరకు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కోదండరామ్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి హాజరైన పలు పార్టీల నేతలు ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. పంచాయతీలతో పాటు వ్యవసాయ, రెవెన్యూ శాఖలను బలహీన పరిచేలా సర్కారు నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. సుదీర్ఘకాలంగా వస్తున్న వ్యవస్థలపూ నమ్మకం లేకనే రైతు సమన్వయ కమిటీలను వేస్తున్నారా..? అని ప్రశ్నించారు. జీవో నం39 వెంటనే ఉపసంహరించుకోవాలని కోదండరామ్‌ సహా అఖిలపక్ష నేతలు డిమాండ్‌ చేశారు.

అయితే కోదండరామ్ కాంగ్రెస్ ఏజెంట్ అని విమర్శలు చేసి ఆయనను సైడ్ ట్రాక్ చేయాలని చూసిన అధికార వ్యూహాలు మాత్రం ఫలించకపోవడం.. అధికార పార్టీలో కొంత నిరాశ వ్యక్తమవుతుది. కొదండరామ్ ను నిలువరించడం ఎలా అన్న విషయంలో మల్లగుల్లాలు పడుతున్నా.. అతి తమకు లాభించకపోయినా.. నష్టపర్చే విధంగా వుండకూడదని అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

కొదండరామ్ అధ్వర్యంలోనే తెలంగాణకు ఒక రూట్ మ్యాప్ వచ్చిందని.. ప్రత్యేక రాష్ట్ర స్వప్నం సాకారమైందని కూడా గతంలో పలుమార్లు ప్రకటించిన టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మాట మార్చి ఆయనపై విమర్శలను ఎక్కుపెడితే.. వాటిని తెలంగాణ ప్రజలు తోసిపుచ్చుతున్నారు. మల్లన్న సాగర్ భూనిర్వాసితుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి.. అధికారపార్టీపై గురిపెట్టిన కొదండరామ్.. సత్యాగ్రహ దీక్షతో తెలంగాణలో ఎన్నికల కారుసెగలను రగలించడంలో సఫలీకృతం అవుతారా.? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles