Political Funding Modi's Next Target

Jaitely reveals pm modi next step

Narendra Modi, Modi Next Step, Finance Minister Jaitely, Jaitely About Modi Next Step, Modi Political Fund, Demonetization GST Next, Modi Next Decision, Modi Decisions Shook Parties

After rolling out Demonetization and GST, the government will take up "cleansing" of political funding as its top priority, Finance Minister Arun Jaitley hints in a conference i.e. Modi to target political funding.

పార్టీ ఫండ్ పై కన్నేసిన ప్రధాని?

Posted: 07/06/2017 12:53 PM IST
Jaitely reveals pm modi next step

అతిపెద్ద ప్రజాస్వామిక దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావం చేసే పెద్ద నోట్ల రద్దు, ఆపై జీఎస్టీ అంటూ ఒకే దేశం-ఒకే పన్నువిధానం ద్వారా ప్రపంచ దృష్టిని మరోసారి ఆకర్షించేశాడు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ క్రమంలో ఆయన తర్వాత తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉంటుందా? అన్నచర్చలు అప్పుడే మొదలయ్యాయి. దీనికి హింట్ ఇస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలతో రాజకీయ పార్టీలలో వణుకు మొదలైంది.

పొలిటికల్ పార్టీలకు వచ్చే విరాళాలను ప్రక్షాళన చేయడమే ఇప్పుడు మోదీ ముందు ఉన్న ప్రధాన కర్తవ్యం అని అర్థమౌతోంది. రాజకీయ పార్టీల నిధులు అన్నది అత్యంత ప్రధానమైన అంశం. త్వరలో ప్రభుత్వం చేపట్టబోతున్న చర్యల వల్ల మొత్తం రాజకీయ విరాళాల వ్యవస్థ ప్రక్షాళన అవుతుంది అని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న జైట్లీ వ్యాఖ్యానించాడు. అంతేకాదు పార్టీల విరాళాల అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని తరచూ తనతో మోదీ చెబుతుండేవారని తర్వాతి టార్గెట్ అదేనన్న విషయం చెప్పకనే చెప్పాడు.

70 ఏళ్ల స్వాతంత్ర్య భారతావనిలో ఈ అంశం ప్రజలకు ఏ రకంగానూ ఉపయోగపడలేదన్న భావనలో మోదీ ఉన్నట్లు జైట్లీ ఉటంకించాడు. తాజా నిర్ణయం ద్వారా పార్టీ ఏదైనా సరే నిధుల పేరిట వచ్చే ఫండ్ లపై లెక్కలు ఖచ్ఛితంగా చెప్పాల్సి ఉంటుంది. తద్వారా బినామీ సొమ్ములకు అడ్డుకట్ట వేయొచ్చని కేంద్ర సర్కార్ భావిస్తోంది. అసలు విరాళాలను నగదు రూపంలో కాకుండా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో తీసుకోవాలంటూ ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ ఓ ప్రతిపాదన చేయగా, దానిపై చర్చలను త్వరలోనే ముగించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించాడు. ఇది గనుక సక్సెస్ అయితే మాత్రం పార్టీలకతీతంగా గోల్ మాల్ వేషాలు వేయటం కుదరదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  Political Funds  Arun Jaitely  

Other Articles