బాబు పై కోపంతోనే బద్ధ శత్రువు తో దోస్తీ?? | Anti-Chandrababu Naidu stand reason for Purandeswari's Decision.

Why purandeshwari to join ysr congress party

Daggubati Purandeswari YS Jagan, Jagan Purandeswari, Purandeswari Quit BJP, Daggubati Purandeswari BJP, Daggubati Purandeswari YSRCP, Daggubati Purandeswari Join, Daggubati Purandeswari Chandrababu Naidu, BJP-TDP Daggubati Purandeswari

BJP Leader, Ex Union Minister Daggubati Purandeswari likely to join YS Jagan's YSRCP soon.

వైసీపీలోకి ఎన్టీఆర్ కూతురు! ఎందుకంటే...

Posted: 02/28/2017 11:54 AM IST
Why purandeshwari to join ysr congress party

నవ్యాంధ్ర రాజకీయాల్లో ఇప్పుడు ఓ వార్త సంచలనంగా మారింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ కూతురు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి త్వరలో వైఎస్సార్సీపీ పార్టీలో చేరబోతుందనేది దాని సారాంశం. వైఎస్సార్పీపీ ఫైర్ బ్రాండ్ రోజా పురంధేశ్వరితో కొద్ది రోజుల క్రితం గంటల తరబడి చర్చలు జరిపి ఒప్పించిందని టాక్.

కాంగ్రెస్ దారుణ ఓటమి తర్వాత బీజేపీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిద్దామనుకున్న పురంధేశ్వరికి అడుగడుగునా అవాంతరాలే ఎదురయ్యాయి. ప్రభావం చూపే మాట అటుంచి మాజీ కేంద్రమంత్రి స్థానం నుంచి ఉనికి కనుమరుగయ్యే స్టేజీకి చేరిపోయింది కూడా. ఇలాంటి సమయంలోనే రాజకీయంగా తన ఎదుగుదల కోసం తీవ్రంగా యత్నిస్తోంది. పైగా వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీటు ఆమె ఆశిస్తోంది. అయితే చంద్రబాబు నాయుడుపై వ్యతిరేకత ఉండటం, ఎప్పటికప్పుడు విడిపోతారని భావిస్తున్నప్పటికీ, బీజేపీ-టీడీపీ మిత్రపక్షం మరింతగా బలపడుతుండటంతో ఆ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి. దీంతో చేసేది లేక ఆమె పార్టీని వీడేందుకే డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో హస్తిన రాజకీయాల్లో ఆరితేరిన ఓ సీనియర్ నేత అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్న జగన్, 2019 ఎన్నికల్లో ఆమెకు ఎంపీ సీటు కేటాయిస్తానని హామీ ఇవ్వటంతో ఆమె చేరికకు దాదాపు మార్గం సుగమం అయ్యిందనే అనుకోవాలి. త్వరలో బెంగళూరులో జగన్ కలిశాక దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అదే జరిగితే గనుక ఎన్టీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా తన చెప్పుచేతల్లో ఉంచుకున్నాడని భావిస్తున్న చంద్రబాబుకి గడ్డుపరిస్థితి ఎదురయినట్లే...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Daggubati Purandeswari  BJP-TDP Alliance  YSRCP  YS Jagan  

Other Articles