తమిళనాడు గవర్నర్ గా ఆనందీ బెన్ పటేల్ | Gujarat Ex CM Anandiben Patel in Tamil Nadu Governor Race

Gujarat ex cm anandiben patel in tamil nadu governor race

Gujarat Ex CM Anandiben in TN governor race, Anandiben Patel in Tamil Nadu Governor Race, Modi Appoints Anandiben Patel as TN governor, Rossaiah out Anadiben Patel in, Anandiben Patel as Governor

Gujarat Ex CM Anandiben Patel in Tamil Nadu Governor Race.

నమ్మకస్తులకు ఈ విధంగా న్యాయం చేస్తున్నాడా?

Posted: 08/19/2016 05:25 PM IST
Gujarat ex cm anandiben patel in tamil nadu governor race

రాష్ట్రాల గవర్నర్లను మార్చే క్రమంలో ఉన్న ప్రధాని మోదీ ముఖ్యంగా యూపీఏ హయాంలో నియమించిన వారిని ఇంకా భరించే పొజిషన్ లో లేరు. ఈ క్రమంలో తమిళనాడు గవర్నర్ రోశయ్యకు పదవీ గండం తప్పదనే తెలుస్తోంది. మొన్నే మూడు రాష్ట్రాలకు గవర్నర్లను మార్చిన మోదీ త్వరలో మరిన్ని రాష్ట్రాలకు మార్పు తప్పదనే సంకేతాలు పంపించారు. ఈ క్రమంలో మోదీ ఓ కొత్త ఫార్ములాను ఫాలో అయిపోతున్నారు. పరిస్థితుల దృష్ట్యా ఏజ్ బార్ అయిన సీనియర్లను, ముఖ్యమైన పొజిషన్ ల నుంచి తప్పించి, ఆపై వారికి ప్రమోషన్లు ఇప్పిస్తున్నారు.

ఈ క్రమంలో గతంలో మైనారిటీ వ్యవహారాల మంత్రి గా పని చేసిన నజ్మా హెప్తుల్లా(76) ను రాజీనామా చేయించి, మణిపూర్ గవర్నర్ గా నియమించారు. మైనార్టీల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ వయో భారంతో స్వచ్ఛందంగా తానే రాజీనామా చేసినట్లు నజ్మాతో ఓ ప్రకటన చేయించారు. ఆపై ఆమెకు గవర్నర్ గా ప్రమోషన్ ఇప్పించారు.

ఇక ఇప్పుడు గుజరాత్ మాజీ సీఎం ఆనందీ బెన్ పటేల్ విషయంలో కూడా ఇదే చేస్తున్నారేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తనతో మంచి సంబంధాలున్నా పదవి కోల్పోయిన ఆనందికి ఎలాగైనా న్యాయం చేయాలని మోదీ భావిస్తున్నారంట ఈ నేపథ్యంలో త్వరలో ఆమెను తమిళనాడు గవర్నర్ గా నియమించనున్నారనే సంకేతాలు అందుతున్నాయి.

గవర్నర్ గా రోశయ్యకు పదవీకాలం పూర్తయినా కూడా ఆయననే కొనసాగించాలని సీఎం జయలలిత ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. కానీ... కేంద్రం ఆమె వినతిని అసలు పట్టించుకునే స్థితిలో లేదు. దీంతో ఆయన తొలగింపు తప్పదు. అయితే రేసులో ఆనందీతోపాటు, కర్ణాటక బీజేపీ సీనియర్ నేత శంకర్ మూర్తి కూడా ఉన్నాడు.

కానీ, కర్ణాటకకు, తమిళనాడుకు కావేరీ జల వివాదాలు, ముఖ్యంగా జయకు ఆ స్టేట్ లకు ఉన్న పర్సనల్ వైరాల దృష్ట్యా కర్ణాటకేతర వ్యక్తినే నియమించాలని ఆమె మోదీకి విజ్నప్తి చేశారంట. అందుకే సానుకూలంగా ప్రధాని మోదీ స్పందించటంతో ఆనందీ బెన్ పటేల్ కు తమిళనాడు గవర్నర్ పగ్గాలు దాదాపు ఖాయమనే అనుకుంటున్నారు. ఇదే నిజమైతే సీఎం పోస్టు పోయినా పార్టీలో ఆనందీ ప్రాధాన్యం ఏ మాత్రం తగ్గదనే అనుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gujarat  EX CM  Anandiben Patel  Tamil Nadu  Governor  

Other Articles