యూపీ టెన్షన్ తో నరాలు తెగుతున్నాయి | Smriti Irani as chief ministerial face for UP polls

Smriti irani as chief ministerial face for up polls

Smriti Irani, chief ministerial candidate, UP, ఉత్తర ప్రదేశ్, సీఎం అభ్యర్థి, స్మృతి ఇరానీ, ప్రియాంక గాంధీ, రాజ్ నాథ్ సింగ్, latest news, political news

In a sign of possible turbulence for the Bharatiya Janata Party in the run-up to the Uttar Pradesh polls, the party's eagerness to field Union minister Smriti Irani as the chief ministerial candidate has reportedly led to a standoff with the Rashtriya Swayamsevak Sangh, its ideological parent.

యూపీ లో టెన్షన్ తో నరాలు తెగుతున్నాయి

Posted: 05/30/2016 06:15 PM IST
Smriti irani as chief ministerial face for up polls

దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే యూపీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ విజయంతో ఎలాగైనా పునర్వైభవం తెచ్చుకోవాలని కాంగ్రెస్, స్థానిక పార్టీల ఆధిపత్యాన్ని దెబ్బతీసి పగ్గాలు చేపట్టాలని బీజేపీ తీవ్రంగా భావిస్తున్నాయి. మరో 15 రోజుల్లో ఈ రెండు తమ నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. దేశానికి గుండె కాయ వంటి యూపీ లో రాజకీయాలు, సీఎం అభ్యర్థి ఎంపిక వంటి అంశాలు అనుకున్నంత సులువు కాదు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందాన ఉంటాయి ఇక్కడి వ్యవహారాలు. ఉదాహరణకు సీఎం అభ్యర్థిగా బ్రాహ్మణులను ఎంపిక చేస్తే ఠాకూర్లకు కోపం, ఠాకూర్లను ఎంపిక చేశారనుకోండి యాదవులకు మండిపడతారు, పోనీ దళితులను ఎంపిక చేస్తే అగ్రవర్ణాలకు మంట ఇలా ఉంటాయి అక్కడి రాజకీయాలు.

కానీ, మెజార్టీ ఉన్న బ్రాహ్మణ ఓటర్లే ఇక్కడ కీలకం కానున్నాయి. రాష్ట్ర ఓటర్లలో 10 నుంచి 12 శాతం ఉన్న బ్రాహ్మణ వర్గంపైనే పార్టీలన్నీ ఆధారపడి ఉంటాయి. అందువల్ల ఆ వర్గానికి చెందిన వ్యక్తినే సీఎంగా అభ్యర్థిగా ప్రకటిస్తే ప్రయోజనం ఉంటుందని యోచిస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటు బ్యాంకుగా బ్రాహ్మణ ఓటర్లు రామ మందిర్ రాజకీయాలతో బీజేపీవైపు మళ్లారు. దీంతో ఇప్పుడున్న  పీసీసీ అధ్యక్షుడితో పాటు సీఎల్పీ నేత, ఏఐసీసీ పరిశీలకుల్ని కూడా ఆ వర్గం వారినే నియమిస్తారన్న ప్రచారం జోరందుకుంది. ఏఐసీసీ ఇన్‌చార్జ్‌గా ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ పేరు పరిశీలనలో ఉండగా, ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ అల్రెడీ రంగంలోకి దిగిపోయి లెక్కలు వేయడం మొదలెట్టారు. సోనియా వారసుల్లో  ఒకరిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే బావుంటుదని ప్రశాంత్ ముందుగా అనుకున్నారు. మరీ ముఖ్యంగా రాహుల్ కన్నా ప్రియాంక గాంధీ అయితే తన పని ఇంకా సులువు అవుతుందని ఆయన భావించారట. అదే సమయంలో బ్రాహ్మణ వర్గానికి చెందిన ఓ చురుకైన నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన చాలన్న ఆప్షన్ కూడా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఇక బీజేపీ విషయానికొస్తే... ముఖ్యమంత్రి అభ్యర్థిగా స్మృతీ ఇరానీ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఎన్డీయే సంకీర్ణంలో భాగస్వామిగా ఉన్న ఆర్ఎస్ఎస్, బయటి రాష్ట్రాలకు చెందిన వారు వద్దని వ్యతిరేకిస్తున్నప్పటికీ, ప్రజాదరణగల మహిళా నేతగా స్మృతి ప్రత్యర్థులకు గట్టి సవాళ్లను విసరగలదని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ కాదంటున్నంత మాత్రాన స్మృతీ అభ్యర్థిత్వంపై వెనుకంజ వేసినట్టు కాదని బీజేపీ అధికార వర్గాలు అంటున్నాయి.  పార్టీ పగ్గాలను మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ కు అప్పజెప్పింది. ఒకవేళ కాంగ్రెస్ స్ట్రాటజీ మార్చి ప్రియాంక గాంధీని గనుక బరిలోకి దించితే మాత్రం పోటీగా కేంద్ర హోంమంత్రి, యూపీ మాజీ సీఎం రాజ్ నాథ్ సింగ్ ను నిలిపే అవకాశం ఉంది. అప్పుడు పోటీ రసవత్తరంగా మారటం ఖాయం. ప్రస్తుతం దేశ మంతా ఈ రెండు పార్టీలు ఎవరిని అభ్యర్థులుగా నిలబెడతాయన్న అంశంపైనే తీవ్రంగా చర్చించుకుంటున్నాయి.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles