Modi promises not yet fullfilled even after 2 years

Modi government ignoring common man problems

Prime minister Narendra Modi, Modi government, modi election promises, modi misses election promises, modi promises, sushma swaraj, lalith modi, vasundara raje, sadhvi saraswathi, amit shah, bjp, narendra modi, lk advani, murali manohar joshi, lower class, middle class, upper middile class, corporates, anna hazare, black money, land bill, cash transfer

Prime minister Narendra Modi government not yet fullfilling election promises, ignoring common man problems and utilising small issues to divert common man problems.

ఏకపక్ష మెజారిటీ ఇచ్చిన మోడీకి ముచ్చమటలేలా..?

Posted: 03/04/2016 06:12 PM IST
Modi government ignoring common man problems

భారతీయ జనతా పార్టీ.. అంతకన్నా అధికంగా దేశ ప్రజల నోళ్లలో నానిన పేరు నరేంద్ర మోడీ.. ఈ నమో మంత్రంతో దేశ యావత్తు సమ్మోహనం చెంది తమ అభిష్టాన్ని ఓట్ల రూపంలో చూపి బీజేపి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. గత ముఫ్పై ఏళ్లుగా భారత దేశ ప్రజాస్వామ్యంలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయమే. అయితే నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిగా చేసిన హామీలు నెరవేరాయా..? అసలు అవి నేరవేరుతాయా..? కనీసం నెరవేర అవకాశాలు వున్నాయా..? అన్న విషయాలను కూడా అలోచించని ప్రజలు ఆయన చెప్పిన మాటలకు మంత్రముగ్దులై ప్రతిపక్షమన్నదే లేకుండా అధికారాన్ని కట్టబెట్టారు.

వాస్తవానికి బిజేపి శ్రేణులు కూడా అలోచించనంత మోజారిటీ బీజేపికి వచ్చింది. దేశంలో ఏకపక్షంగా సంస్కరణలు చేపట్టే అవకాశాన్ని నరేంద్రమోడీకి అందించింది. అయితే వంద రోజుల వ్యవధిలో నల్లధనాన్ని భారత్ కు తీసుకువస్తానని. ఆ డబ్బు నుంచి దేశంలోని ప్రజలకు లక్షల రూపాయల మేర పంచుతానని కూడా ప్రకటించారు. రమారమి రెండేళ్లు కావస్తున్నా.. ఇప్పటి వరకు ఆయన కానీ, ఆయన ప్రభుత్వం కానీ ఒక్క పైనాను అందించలేదు. అయితే అంతకు ముందు వున్న నగదు బదిలీ పథకం ద్వారా వచ్చే డబ్బుల్ని జమ చేసేందుకు జీరో డిఫాజిట్ కింద ఖాతాలను తెరిపించడం మాత్రమే చేసిన మోడీ అందులో జమ అవుతున్న డబ్బు తమ ప్రభుత్వం ఇస్తున్నదేనన్న క్రిడిట్ ను మాత్రం కోట్టేశారు.

ఇక అధికారంలోకి వచ్చి రాగానే కార్పరేట్లకు దన్నుగా నిలిచిన మోడీ యూపిఏ సర్కార్ తీసుకువచ్చిన భూ సంస్కరణ చట్టంలో సవరణలకు తెరలేపారు. దీనిపై యావత్ దేశ రైతాంగం వ్యతిరేకించింది. రాష్ట్రాలు, జిల్లాలను కేంద్రంగా చేసుకుని రైతులు నిరసనలు తెలిపారు. ఈ సవరణలను ఉపసంహరించుకోని పక్షంలో తాను మరోమారు సత్యగ్రహ దీక్షకు దిగుతానని సామాజిక కార్యకర్త అన్నహాజారే కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కార్పోరేట్ల కోసమే మోడీ ప్రభుత్వం రైతుల భూములను లాక్కునేందుకు చట్టంలో పలు సవరణలు చేస్తుందన్న విమర్శలు కూడా శృతిమించాయి. దీంతో డోలాయమానంలో పడిన ప్రభుత్వం ఎట్టకేలకు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.

ఇదిలా వుంచితే.. దేశంలో అటు పెద్దలు, ఇటు పేదలను పక్కన బెడితే.. అత్యంత అధిక సంఖ్యలో వున్నది మాత్రం మధ్య తరగతి జీవితాలు.. పేదల్లా వారు బతకలేక, ఇటు పెద్దల్లా వారు నిలువలేక అనునిత్యం అవస్థ పడుతుంటారు. ప్రభుత్వం ఏ ఒక్క వస్తువుపై ధరను పెంచినా.. అది మెదట ప్రభావం చూపేది మాత్రం మధ్య తరగతి ప్రజలపైనే. అయితే నిత్యవసర సరుకులు, కూరగాయాలు, ఇలా దేని ధర పెరిగినా వెనువెంటనే స్పందించి.. అన్నింటికీ వామ్మో..! అనేది మద్య తరగతి ప్రజలే.

యూపీఏ హయాంలో నిత్యవసర ధరలు పెరిగిపోయాయి.. తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వాటిని నియంత్రిస్తామని చెప్పిన మోడీ.. వచ్చిన వెంటనే వాటిని కట్టడి చేశారు. కానీ ఆ తరువాత అవి అమాంతం ఆకాశాన్నే చూస్తున్నాయి. ఎంతలా అంటే ఉల్లి ధర వింటేనే కన్నీళ్లు వచ్చేంతలా.. కంది పేరు చెబితేనే కడుపు ఉబ్బరం అనిపించేలా.. మరి మోడీ, సంబంధిత శాఖ మంత్రులు అధికారులు ఏం చేస్తున్నారో..  అసలు వాళ్లకు మధ్య తరగతి ప్రజల వ్యధలు పట్టవా అని ఆయావర్గ ప్రజలు నిట్టూరుస్తున్నారు.

అయితే పేద, మద్య తరగతి ప్రజల అవస్థలను పక్కదారి పట్టించేందుకే బిజేపి కొత్త ఫార్ములా అవలంభిస్తుందన్న విమర్శలు వినబడుతున్నాయి. అదే సున్నితమైన అంశాలపైకి దృష్టి మరల్చడం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ శర్మ.. జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిధ్యాలయంలో కన్హయ్య కుమార్ అంశాలను పెద్దవిగా చేసి చూపడం. జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై ఓ విద్యార్థి సంఘం నేత జైలుకు పంపితే అది చట్టం, న్యాయం పరిధిలోని అంశం. ఇక న్యాయం, చట్టం విచారణ జరిపి ఏది నిజం.. ఏది అబద్దం అన్న విషయాలను తన తీర్పుతో వెలువరిస్తుంది.

బీజేపి అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతి తగ్గిందన్న ప్రచారం చేసుకుంటున్నా బీజేపి.. ఒక పాత్రికేయుడు సహా సుమారు యాభై మందికి పైగా ఎలా మరణించారన్న విషయమే అంతుచిక్కని కుంభకోణం వ్యాపం స్కామ్. ఆ తరువాత దేశానికి చెందాల్సిన వేల కోట్ల రూపాయలను మళ్లించిన ఐపీఎల్ వ్యవస్థాపక చైర్మన్ లలిత్ మోడీ విషయంలో.. తన క్యాబినెట్ లో వున్న మంత్రి  సుజనా చౌదరి బ్యాంకులను నిట్టనిలువునా ముంచిన అంశంపై.. తన ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వామిగా వున్న టీడీపీ రాజధాని భూ కుంభకోణంపై ఇలా అనేక అంశాలపై నోరు విప్పరెందకన్న ప్రశ్నలు కూడా రెకెత్తుతున్నాయి.

దేశవ్యాప్తంగా రైతులు, మధ్య, బడుగు వర్గాల ప్రజలు పడుతున్న అవస్థలు, ఎదుర్కోంటున్న ఇబ్బందులపై మాత్రం నోరు పెదపడం లేదు. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. మిగతా సమయంలో దేశానికి తాను ప్రధానన్న విషయాన్ని కూడా మర్చిన మోడీ సహా ఆయన ప్రభుత్వంలోని పలువురు మంత్రులు ప్రజలు అందించిన మోజారిటీని.. వారికి సేవ చేసేందుకు వినియోగించకుండా కేవలం రాజకీయాల వైపే పూర్తి దృష్టి నిలుపుతున్నారన్న విమర్శలు వినబడుతున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో కూడా ప్రజల కష్టసుఖాలపై చర్చోపచర్చలు కాకుండా కేవలం మీరు అప్పుడు అలా చేశారు.. మేము ఇప్పుడు ఇలా చేస్తామని ధోరణిలోనే కొనసాగం శ్రేయస్కరం కాదన్న సూచనలు కూడా వెల్లువెత్తుతున్నాయి. నరేంద్ర మోడీ పాలన ఇతర ప్రభుత్వాలతో పోల్చితే ఎంతో వత్యాసం వుంటుందని భావించిన ప్రజలకు.. దేశాభివృద్దితో పాటు తమ జీవితాలు బాగుపడుతాయని ఆశించిన ప్రజల.. గత ప్రభుత్వాల బాటలో మోడీ సర్కారు కూడా సాగడంపై నిట్టూరుస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  modi gvovernment  election promises  black money  land bill  cash transfer  

Other Articles