Akbar was 'The Great', Maharana Pratap was 'The Great of Greats': Rajnath

If akbar can be called great why not maharana pratap rajnath singh

Union home minister Rajnath Singh, Rajnath Singh, chapter on Maharana Pratap, Mughal emperor Akbar, Akbar, Rajasthan education, Mewar ruler Maharana Pratap, statue of Maharana Pratap, Dhariwad road, Pratapgarh district, jaipur, Rajasthan, Central Board of Secondary Education's syllabus,

Union home minister Rajnath Singh endorsed the Rajasthan government's move to introduce erstwhile Mewar ruler Maharana Pratap as someone greater than Mughal emperor Akbar in the state's school curriculum.

మార్చేస్తే మారేది చరిత్ర కాదు.. తెలుసుకోండి అమాత్యా..!

Posted: 05/18/2015 04:36 PM IST
If akbar can be called great why not maharana pratap rajnath singh

ఎవరు గోప్పవారు. మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించిన అక్బర్..? లేక మేవర్ సామ్రాజ్యాన్ని పాలించిన మహారాణా ప్రతాప్..? ఇరువురిలో ఎవరు గోప్పవారు అన్నే ప్రశ్న ఇన్నాళ్లకు మన రాజకీయ నేతల పుణ్యమా అని ఉద్భవించింది. అక్బర్ గొప్పవ్యక్తే.. కానీ మహారాణా ప్రతాప్ అంతకన్నా గోప్పవ్యక్తని వారి పరిపాలన ముగిసిన నాలుగు వందల ఏళ్ల తరువాత ఇప్పుడీ ప్రశ్న ఉత్పన్నమైంది. అక్బర్ గోప్ప వ్యక్తే కానీ అంతకంటే మహరాణా ప్రతాప్ అత్యంత గొప్పవ్యక్తి అని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అభిప్రాయపడ్డటంతో ఎవరు గోప్ప అన్న అనుమానాలకు తావిస్తోంది.

చరిత్రకారులు మాత్రం అక్బర్ ను మహోన్నత వ్యక్తిగా చిత్రీకరించి.. మహారాణా ప్రతాప్ ప్రతిష్టను మరుగున పడేట్లు చేశారని రాజ్ నాథ్ సింగ్ చెప్పకనే చెప్పారు. అందుకు అక్బర్ ను చరిత్రకారులు మహోన్నత వ్యక్తిగా చిత్రీకరించడాన్ని తాను ఏమీ తప్పుబట్టడం లేదంటూనే..అక్బర్ కంటే రాణా ప్రతాప్ గొప్ప వ్యక్తి అని తన వ్యక్తిగత అభిప్రాయంగా పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రిగా కోనసాగుతూ.. ఆయన తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అంతటితో ఆగకుండా ఈ మేరకు పాఠ్యాంశాలలో మార్పులు చేయాలని, సూచించారు.

ఆదివారం రాజస్థాన్ లోని ప్రతాప్ ఘర్ లో రాణా ప్రతాప్ 475వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆయన విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ నాథ్ మాట్లాడుతూ.. కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతి ఇరానీతో మాట్లాడి సీబీఎస్ఈ పాఠ్యాంశాలలో కూడా ఈ మేరకు సవరణలు చేయిస్తామని చెప్పారు. అక్బర్-రాణాల చరిత్ర సరి చేయాలని రాజ్ నాథ్ పేర్కొన్నారు. రాణా ప్రతాప్ ప్రజల్లో అపారమైన గౌరవాన్ని సంపాదించుకోవడమే కాకుండా.. ఉన్నతమైన వ్యక్తిగా నిలిచిపోయాడన్నారు. తదుపరి తరాలకు మహరాణా ప్రతాప్ జీవితం ఆదర్శం కావాలని రాజ్ నాథ్ తెలిపారు.

అయితే మోఘల్ సామ్రాజ్యంలో హల్దీ ఘాట్ యుద్ధంలో అక్బర్ చేతిలో మేవర్ చక్రవర్తి రాణా ప్రతాప్ ఓటమి పాలవ్వడంతోనే అక్బర్ సామ్రాట్ గా వెలుగోందారు. మహారాణా ప్రతాప్ అంతకన్నా మహోన్న వ్యక్తి కావచ్చుగాక. రాచరికపు కాలంలో యుద్దం నెగ్గిన వాడే సామ్రాటుగా మారుతారన్న విషయం తెలసికూడా మన వ్యక్తిగత అభిప్రాయాలతో చరిత్రను మర్చాలని, లేక చరిత్ర పార్యాంశాలకు సవరణలు చేయాలని భావించడం తప్పే అవుతుందని పలువురు అంటున్నారు. 420 ఏళ్లుగా అక్బర్ గొప్పవాడని.. ఇప్పుడెన్ని సవరణలు చేసినా అతి అతికించినట్టు అవుతుందే తప్ప.. సహజంగా వుండదు. ఇక వందల ఏళ్లుగా చరిత్రకారులు అక్బర్ గోప్పదనాన్ని కీర్తించారంటే అయన పాలన అప్పటి ప్రజలు చవిచూసిన విషయాలే కారణం కావచ్చు. అయినా మార్చేస్తే మారిపోయేది చరిత్రకాదన్న విషయాన్ని అమాత్యుల వారు గుర్తెరితే మంచింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akbar  Rana Pratap  rajnath singh  

Other Articles