KCR | Current Reddy | jagadesh Reddy | Plenary

Telangana cm kcr named jagadesh reddy as currnet reddy

telangana, plenary, minister, jagadesh reddy, current reddy, kcr, power cut

Telangana cm kcr named jagadesh reddy as currnet reddy. IN TRS Party plenary cm kcr proposed to name jagadesh reddy as current reddy.

కరెంట్ రెడ్డి.. ఓ తెలంగాణ మంత్రి

Posted: 04/25/2015 11:24 AM IST
Telangana cm kcr named jagadesh reddy as currnet reddy

అదేంటి.. తెలంగాణ మంత్రుల్లో కరెంట్ రెడ్డి అనే పేరుతో ఎవరూ లేరే అసలు ఆ పేరుతో ఎవరూ ఉన్నట్లు కూడా వినలేదే అని అనుకుంటున్నారు కదా.. అవును నిజమే ఇప్పటిదాకా వినని పేరు కరెంట్ రెడ్డి. ఏదో కామెడి సినిమాల్లో పేరు అని అనుకుంటారేమో అస్సలు కాదు చాలా సీరియస్. నిజం ఎంత సీరియస్ అంటే కెసిఆర్ కూడా కరెంట్ రెడ్డిని కానీ, ఆ పేరును కానీ ఏమాన్న అంటే మాత్రం ఊరుకునేలా లేరు. అసలు ఈ గోళ ఏంటో.. ఆ కరెంట్ రెడ్డి ఎవరో.. కెసిఆర్ కు ఎందుకు కోపమొస్తుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

తెలంగాణ ప్లీనరీలో కేసిఆర్ మాట్లాడుతున్నారు.. తెలంగాణలో విద్యుత్ కష్టాలు తీరిపోయాయి.. ఏ సభ, సమావేశాల్లోనూ ఎండిపోయిన కంకులు, లాంతర్లు పట్టుకొని రైతులు ధర్నాలు చెయ్యకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెంట్ కష్టాలు లేకుండా చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి ప్లీనరీ సమావేశంలో కెసిఆర్ విద్యుత్ శాఖమంత్రి జగదీష్ రెడ్డిని ఇక మీదట కరెంట్ రెడ్డి అని పిలవాలని అన్నాడు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు కరెంట్ కష్టాలు లేకుండా చేశారని. మొత్తానికి విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డికి కరెంట్ రెడ్డి అని పిలవాలని భలే పేరు పెట్టారు. అయితే నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావ్ పేరును వాటర్ గ్రిడ్ పూర్తైన తర్వాత వాటర్ రావ్ అని పేరు పిలుస్తారా ఏంటి అని కొంతమంది చమక్తరించుకుంటున్నారట. అయినా కెసిఆర్ చెబితే ఏమైనా ఊ కొట్టాల్సి వస్తుందేమో.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  plenary  minister  jagadesh reddy  current reddy  kcr  power cut  

Other Articles