Ysrcp mps joining telugu desam party

ysrcp mps joining tdp, ysr congress party mps migrating into tdp party, ysr congress party news, ys jagan mohan reddy latest news, ys jagan mohan reddy with party leaders, ysr congress mps migrating in tdp party, ysr congress mps resigning to the party, tdp party mlas, ysr congress party mlas, ysr congress party latest news, ys jagan mohan reddy latest photos, ys jagan mohan reddy newsq

ysr congress party mps migrating into tdp party

వైకాపా ప్రస్థానం ముగిసినట్టేనా..?

Posted: 07/19/2014 04:33 PM IST
Ysrcp mps joining telugu desam party

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి రానురాను మరీ దారుణంగా మారిపోతోంది. ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా పార్టీయే గెలుస్తుందని కోటీ ఆశలతో ఎదురుచూసిన వారందరికీ చేదు అనుభవమే ఎదురయింది. ఇక జగన్ కూడా ఆంధ్రాకి నేను సీఎంనంటూ ప్రచారాలు చేసుకుంటూ, ధీమాగా వుండటంతో ఆ పార్టీ నాయకులు కూడా ఫుల్ జోష్ తో ఊగిపోయారు. సీమాంధ్రలో గెలిచేది కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనంటూ ఆ పార్టీ నేతలు కొన్నాళ్లవరకు బాగానే సొంత డబ్బాలు కొట్టుకున్నారు. ఒకరికిమించి ఇంకొకరు తమ పార్టీ గురించి రకరకాలుగా సొంత డబ్బాలు కొట్టేసుకున్నారు. వీరు వ్యవహరించిన తీరును బట్టి వైకాపాయే అధికారంలోకి వస్తుందని ప్రతిఒక్కరు అనుకున్నారు.

కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొంది, ఆంధ్ర అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఏదేతై జరగకూడదని జగన్ ఊహించుకున్నారో అదే జరిగింది. దీంతో ఆయన, ఆయన పార్టీ వర్గాలు మొత్తం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా అధికారంలోకి వస్తుందని భావించిన నేతలు... ఎన్నికల ముందు కోట్లకొద్దీ డబ్బులు ఖర్చుపెట్టారు. ఇప్పుడు అధికారం రాకపోవడంతో వారు చేసిన ఖర్చంతా నీరుగారిపోయింది. మరికొంతమంది అప్పులు చేసి మరీ చిక్కుల్లో ఇరుక్కుపోయారు. దీంతో కొంతమంది నాయకులు పార్టీ ఘోరంగా పరాజయం కావడంతో వైకాపా పార్టీకి రాజీనామా చేసి వైదొలిగారు.

ఎన్నికల తరువాత వైకాపా పార్టీ తరఫున గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు, నాయకులు కూడా ఆ పార్టీ నుంచి టీడీపీ పార్టీకి జంప్ అయిన దాఖలాలు వున్నాయి. ఒకేసారి 30 మంది నాయకులు వైకాపా పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారని ఆ మధ్య పెద్ద దుమారంగా మారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ జగన్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అయినా ఏమి చేయలేని పరిస్థితి కాబట్టి... ఆయన కూడా చూస్తూ ఊరుకుండిపోయారే తప్ప... జంప్ జిలానీలను ఆపుకోలేకపోయారు.

ఇప్పుడు తాజాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ పార్టీ ఎంపీలు కొంతమంది ఝలక్ ఇవ్వనున్నట్టు తాజా సమాచారం వెల్లడయ్యింది. జగన్ అధికారంలోకి వస్తాడని భావించి కోట్లకొద్దీ డబ్బులను ఖర్చు పెట్టిన ఆ ఎంపీలు... టీడీపీ అధికారంలోకి రావడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దీంతో వారు టీడీపీ పార్టీలోకి చేరనున్నారని వార్తలు వస్తున్నాయి. పైగా జగన దగ్గర తమకు దక్కాల్సిన గౌరవం లభించడం లేదని, కేవలం అవమానాలు మాత్రమే ఎదరవుతున్నాయని వారు బాధపడుతూ తన మనసులో వున్న ఆవేదనను బయటకు చెప్పుకుంటున్నారు.

ఇప్పటికే నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీ కండువా కప్పేసుకున్నారు. ఇక కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక కూడా టీడీపీ పార్టీలోకి వెళ్లినట్టే వెళ్లి తిరిగి జగన్ గూటిలోకే చేరుకున్నారు. అయితే ఆమె తిరిగి ఎప్పుడూ టీడీపీ కండువా కట్టుకోనుందోనని గందరగోళ పరిస్థితిలో మునిగిపోయారు వైకాపా నాయకులు. అలా అరకు ఎంపీ గీత కూడా సైకిల్ మీద ఎక్కనున్నట్టు తెలుస్తోంది. ఆమె ఇప్పటికే వైకాపా పార్టీ నుంచి అనుమానాలు చాలా ఎక్కువయిపోతున్నాయని ఆ పార్టీ మీద తీవ్రంగా విమర్శలు చేసింది. దీంతో ఆమె ఎప్పుడు పార్టీ మారనుందోనని అందరూ అనుకుంటున్నారు.

సార్వత్రిక ఎన్నికల తరువాత నుంచి వైకాపా పార్టీలో నుంచి నాయకులు వరుసగా టీడీపీలోకి జంప్ అవుతూనే వున్నారు. నిన్నమొన్నటిదాకా వైకాపా కండువా కట్టుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ... ఇప్పుడు ఆ పార్టీనే దూషిస్తూ ఇతర పార్టీలోకి జంప్ అయిపోతున్నారు. ఇటు తెలంగాణాలో కూడా వైకాపాకు చేదు అనుభవమే ఎదురయింది. కేవలం ఖమ్మం మినహా మిగతా ఏ జిల్లాల్లో ఏ అర్హత కూడా దక్కలేదు. ఇటు తెలంగాణాలో గుర్తింపు లేని పార్టీగా పేరు తెచ్చుకుంటే... అటు ఆంధ్రాలో నాయకులందరూ వైకాపా నుంచి జంప్ అయిపోతున్నారు. దీంతో ఈ పార్టీ కథ కంచికి చేరినట్టేనని, త్వరలో ఈ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles