Evms making ec worrty

EVMs making EC worrty, Faulty EVMs, EVMs manufactured before 2006, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

EVMs making EC worrty, Faulty EVMs, EVMs manufactured before 2006,

ఇసికి ఆదుర్దా కలిగిస్తున్న ఇవిఎమ్ లు

Posted: 04/08/2014 11:24 AM IST
Evms making ec worrty

16 వ లోక్ సభ ఎన్నికలలో మొదటి రోజున మొరాయించిన ఇవిఎమ్ లతో ఇసి అధికారులు ఆదుర్దా చెందుతున్నారు.  మొదటి రోజునే 90 ఇవిఎమ్ లను మార్చవలసి రావటంతో వాటి మీద ఎంత వరకు ఆధారపడవచ్చనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. 

అయితే సమస్యంతా 2006 లోపులో తయారు చేసిన ఇవిఎమ్ లతోనే వస్తున్నాయట.  మరి అలాంటప్పుడు వాటిని ఎన్నికలకు ముందుగానే ఇసి ఎందుకు మార్చలేదన్నదానికి సమాధానం వాళ్ళే చెప్పాలి. 

నిజానికి ఇవిఎమ్ లు (సరిగ్గా పనిచేస్తే) కౌంటింగ్ విషయంలో ఆధారపడతగ్గవే, సురక్షితమైనవే.  ఎందుకంటే ప్రతి ఇవిఎమ్ స్వతంత్రంగా పనిచేసేదే కానీ దేనితోనూ అనుసంధానం చెయ్యదగ్గది కాదు.  దానివలన ఒక యంత్రం మరో దానితో నెట్ వర్కింగ్ లో పనిచేసే విధానం లేకపోవటం వలన చేస్తే పోలింగ్ సమయంలో ఏమైనా కుతంత్రానికి పాలుపడటానికి అవకాశం ఉంది కానీ ఆ తర్వాత ఇవిఎమ్ లలో నిక్షిప్తమైన డేటాను ఎవరూ మార్చలేరు.  అలా మార్చే అవకాశమే లేదు.  అందువలన ఇవిఎమ్ లు ఆధారపడతగ్గవే.  కాకపోతే వాటిని కౌంటింగ్ డేట్ వరకు భద్రపరచటం తప్పనిసరి. 

ఎన్నికల కమిషన్ డెప్యూటీ కమిషనర్ విశాల్ వసంత్ సోలంకి చెప్పినదాని ప్రకారం ఏప్రిల్ 1 న పరీక్షించినప్పుడు కొన్ని ఇవిఎమ్ లు అన్ని వోట్లనూ భాజపాకి అనుకూలంగా చూపించటంతో గందరగోళానికి దారితీసింది.  భాజపా ఇవిఎమ్ లను తనకు అనుకూలంగా మార్చుకుందన్న అభ్యంతరాలు కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చాయి.  దానితో ఇవిఎమ్ లను పరీక్షించి చూడగా 2006 లోపులో తయారు చేసిన మిషన్ లే సమస్యాత్మకంగా  ఉన్నాయని తేలింది.  మూడు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో 600 ఇవిఎమ్ లను పరీక్షించామని చెప్తున్నారు.  మొత్తం 1800 ఇవిఎమ్ లు ఉన్నాయి.  మిగతా వాటిని కూడా పరీక్షిస్తున్నామంటున్నారు. 

తీరా ఎన్నికల సమయం వచ్చేంత వరకూ వేచి చూడకుండా ఎన్నికల కమిషన్ ముందే పరీక్షణలను ఎందుకు చెయ్యలేదని పలువురు అడుగుతున్నారు.  పాత మెషీన్లు సరిగ్గా పనిచెయ్యకపోతే వాటిని ముందుగానే మార్చివేయవలసింది అన్న విమర్శలు వస్తున్నాయి. 

ఆవిధంగా అస్సాంలో జరిగిన పోలింగ్ లో బయటపడ్డ ఇవిఎమ్ లోపాలతో మిగతా చోట్ల ఎన్నికలు ఎలా జరుగుతాయా, వాటి మీద ఎంత వరకు ఆధారపడవచ్చా అన్న ప్రశ్నలు దేశ వ్యాప్తంగా తలెత్తటం సహజం.  ఎలక్ట్రానిక్ యంత్రాల్లో కంటికి కనిపించేదేమీ ఉండదు కాబట్టి వాటి సమర్థతను అవిచ్చే ఫలితాలను సామాన్య ప్రజానీకం కేవలం నమ్మకంతో సరిపెట్టుకోవలసివుంటుంది. 

అదే పెద్ద సమస్యగా తయారైంది ఎన్నికల కమిషన్ కి!  పేపర్ ట్రయల్ ఆధారంతో వాళ్ళు వోటు వేసిన పార్టీ తో సరిపోలకపోతే వోటర్లు ఫిర్యాదులు చెయ్యవచ్చు.  అందువలన పోలింగ్ సరిగ్గా జరుగుతుందన్న నమ్మకమైతే కలుగుతుంది కానీ వాటిని మార్చవలసిరావటం వలన జాప్యం లాంటి అనవసరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles