Chandrababu vs ys jagan big fight in 2014 polls

chandrababu, ys jagan, jagan, babu, tdp, ysrcp, 2014 election, cm post, chandrababu vs ys jagan big fight, seemandhra people, telangana people, jagan cm, chandrabab u cm.

chandrababu vs ys jagan big fight in 2014 polls

బాబు ఆరాటం-జగన్ పోరాటం? గెలిచేదేవరు?

Posted: 02/28/2014 02:52 PM IST
Chandrababu vs ys jagan big fight in 2014 polls

ఒకరిది ఆరాటం..మరోకరిది  పోరాటం? చివరికి గెలిచేదేవరు?  ప్రజలు ఎవర్ని గెలిపిస్తారు?  ఇప్పుడు సీమాంద్ర  ప్రజల మద్య నలుగుతున్న చిక్కు ప్రశ్నలు.  ఈ ప్రశ్నలకు  సమాధానం దొరకాలంటే. ఎన్నికల సమరం వరకు ఆగాల్సిందే. కానీ  ఈలోపు.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో జరుగుతున్న  రాజకీయ పరిస్థితులను తెలుసుకోవాలి. 

ఈ ఇద్దరు సమైక్య ముసుగులో సీమాంద్ర ప్రజలను మోసం చేసినవారే అనే విషయం అందరికి తెలుసు. కానీ ఇప్పుడు ఇద్దరు సీమాంద్రలో తమ పార్టీల మనుగడకోసం పోరాటం చేస్తున్నారు. చంద్రబాబు ఈ సారి ఎలాగైన.. అధికారం దక్కించుకోవాలనే ఆరాటంతో  సీమాంద్రలో గెలుపు గుర్రాల కోసం వేట సాగిస్తున్నారు. రాజకీయ పార్టీల కంటే ముందే.. లోక్ సభకు కొంతమది అభ్యర్థులను  ఎంపిక చేసినట్లు సమాచారం. 

ఇప్పుడు చంద్రబాబు కు సీమాంద్రలో వ్యతిరేక గాలులు వీస్తున్నప్పటికి.. గెలుపు మాత్రం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పదేళ్లలో తెలుగు ప్రజలు ఏం కోల్పోయరో తెలుసుకోని , చంద్రబాబు జాగ్రత్త అడుగులు వేస్తున్నారు.  తెలుగు ప్రజలకు న్యాయం చేయటానికి చంద్రబాబు సైకిల్ వేగం పెంచి ..తమ పార్టీ నాయకులను ఎన్నికలకు సిద్దం చేస్తున్నారు. 

అయితే  సీమాంద్రలో తెలుగుదేశం పార్టీకి  ప్రధాన పోటీగా  వైఎస్ఆర్ పార్టీ ఉన్న విషయం తెలిసిందే.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని  ఎన్నికల సమరంలో ఎలా ఓడించాలో.. చంద్రబాబు చాణుక్య బుర్రతో ఆలోచించి, గెలుపు గుర్రాలను రెఢీ చేస్తున్నట్లు సమాచారం.  

ఒకవేళ టిడిపి , వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీలు కలిసి ఎన్నికల్లో పనిచేసిన ఆశ్చర్యం లేదని  రాజకీయ మేథావులు అంటున్నారు.  రీసెంట్ గా జరిగిన  పంచాయితీ ఎన్నికల్లో కొన్ని చోట్ల , చంద్రబాబు, జగన్  పొత్తు పెట్టుకొని  పోటీ చేసిన విషయం తెలిసిందే. 2014లో  బాబు ఆరాటం.. ఏం ఫలితాన్నిస్తుందో  చూద్దాం.

ఇక జగన్  అయితే రాష్ట్ర విభజన విషయంలో  సమైక్య రాగం పాడి , అలసిపోయి,  రాజకీయ పదవి కోసం  పోరాటం  చేస్తున్నారు. కేవలం ముఖ్యమంత్రి పదవే ద్వేయంగా జగన్ రాజకీయల్లో ముందుకు పోతున్నాడు.  

గతంలో  ఓదార్పు పేరుతో  ఉప ఎన్నికల్లో  కొన్ని సీట్లు గెలుచుకున్న, ఇప్పుడు సీమాంద్ర లో ఆ పరిస్థితి లేదని   రాజకీయ మేథావులు అంటున్నారు. సమైక్య రాగంతో.. తెలంగాణ ప్రాంతానికి దూరమైన  జగన్. మళ్లీ తెలంగాణలో  తన ఓదార్పు చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. 

కానీ తెలంగాణ ప్రజలు  తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఆనందంలో ఉన్న సమయంలో  జగన్ ఓదార్పు  తెలంగాణ ప్రజలు ఎంత అవరముందో  త్వరలోనే తెలుస్తోందని రాజకీయ నాయకులు అంటున్నారు. సీమాంద్ర లో జగన్ ప్యాన్  గాలి  తగ్గిందని కొన్ని సర్వేలు చెబుతున్నారు.

ముఖ్యమంత్రి పదవి కోసం పోరాటం చేస్తున్న  జగన్.. 2014 ఎన్నికల సమరంలో ప్రధాన పార్టీ తెలుగుదేశం పార్టీని  ఓడించి  ముఖ్యమంత్రి పదవి  దక్కించుకుంటాడా? అనే పశ్న రాజకీయ నాయకుల్లో  చర్చ జరుగుతుంది.  

ఇప్పటికే.. జగన్ పార్టీలో  రెడ్డి వర్గం అథిపత్యం  ఎక్కువుగా ఉందని  ఆపార్టీ నుండి బయటకు వచ్చిన  బహిరంగం చెబుతున్నారు.  జగన్ ఇలాంటి విమర్శలను దాటుకొని ప్రజల నాయకుడిగా అవుతాడా? అని రాజకీయ మేథావులు  అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పుడు జగన్  మళ్లీ సానుభూతి మీదనే ఆధారపడి..ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారు.   

వైఎస్ఆర్ మరణం తరువాత వచ్చిన సానుభూతిని  ఓటు బ్యాంకుగా మార్చుకోవటానికి జగన్, తల్లి విజయమ్మను, చెల్లి , షర్మిలను ఎన్నికల ప్రచారంలోకి దించుతున్నట్లు సమాచారం. జగన్, విజయమ్మ, షర్మిలా పోరాటంతో.. 2014లో  ముఖ్యమంత్రి పదవికి కైవసం చేసుకుంటాడని .. ఆ పార్టీ నాయకులు బలంగా చెబుతున్నారు. 

జగన్ పోరాటం , చంద్రబాబు ఆరాటం  ఫలితాలు తెలుసుకోవాలంటే.. మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.  

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles