Bhaskara Sathakam in Telugu 51679 Bhaskara Satakalu

Bhaskara satakam in telugu

Bhaskara Sathakam, Bhaskara Satakalu, Telugu Satakalu, Bhaskara Satakalu in Telugu అరయన్ = విచారించగా ; ఎంత నేరుపరియై = ఎంత నేర్పరి గలవాడైనా ; చరియించినన్ = వ్యవహరించడం ; వాని దాపునన్ = వానికి సమీపంలో ; గౌరవ మొప్పన్ = ఆదరణ ఏర్పడినట్లు ; కూర్చు = కార్యాలు నెరవేర్చు

Get the Bhaskara Sathakam మేలిమి బంగారం అయినా.. సొమ్ములు అతికించడానికి వెలిగారం అవసరమయినట్లు.... ఎంతటి వివేకశాలి అయినా.. ఉపకారాన్ని ఆచరించేవాడొకడు సమీపంలో లేకపోతే.. ఏ కార్యం నిర్వహించబడదు. In Telugu Bhaskara Satakalu

భాస్కర శతకము

Posted: 04/11/2014 10:42 AM IST
Bhaskara satakam in telugu

ఆరయ నెంత నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్

గౌరవ మొప్పఁగూర్చు నుపకారి మనుష్యుఁడు లేక మేలు చే

కూర దదెట్లు; హత్తుగడగూడునె, చూడఁబదాఱువన్నె బం

గారములోన నైన వెలిగారము కూడక యున్న భాస్కరా!

టీకా : అరయన్ = విచారించగా ; ఎంత నేరుపరియై = ఎంత నేర్పరి గలవాడైనా ; చరియించినన్ = వ్యవహరించడం ; వాని దాపునన్ = వానికి సమీపంలో ; గౌరవ మొప్పన్ = ఆదరణ ఏర్పడినట్లు ; కూర్చు = కార్యాలు నెరవేర్చు ; ఉపకారి మనుష్యుఁడు = మేలు చేసేవాడు ; లేక = వుండినచో ; మేలు చేకూరదు = లాభం కలగదు ; చూడన్ = విచారించగ ; పదాఱు వన్నె బంగారములోనైనన్ = మేలిమి బంగారమైన ; కూడకయున్నన్ = చేరకపోతే ; హత్తుగడ కూడునె = అతకడం ఏర్పడుట 

భావము : మేలిమి బంగారం అయినా.. సొమ్ములు అతికించడానికి వెలిగారం అవసరమయినట్లు.... ఎంతటి వివేకశాలి అయినా.. ఉపకారాన్ని ఆచరించేవాడొకడు సమీపంలో లేకపోతే.. ఏ కార్యం నిర్వహించబడదు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 15 | ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మఁదలంచి యుగ్రవా క్పరుషతఁ జూపినన్ ఫలము గల్గుట తథ్యముగాదె; యంబుదం బురిమినయంతనే కురియకుండునె వర్షము లోకరక్షణ స్థిరతర సౌరుసంబున నశేషజనంబు లెఱుంగ భాస్కరా! టీకా : ఉరుకరుణాయుతుండు = గొప్ప దయతో... Read more

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 14 | ఈ జగమందు దా మనుజుఁ డెంత మహాత్మకుఁడైన దైవమా తేజము తప్పఁ జూచునెడఁ ద్రిమ్మరి కోల్పడు; నెట్లన న్మహా రాజకుమారుఁడైన రఘురాముఁడు గాల్నడఁగాయలాకులున్ భోజనమై తగ న్వనికిఁబోయి చరింపఁడె మున్ను భాస్కరా! టీకా :... Read more

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 12 | ఈ క్షితి నర్ధకాంక్ష మది నెప్పుడు పాయక లోకులెల్ల సం రక్షకుఁడైన సత్ర్పభుని రాకలు గోరుదు రెందుఁ, జంద్రి కా పేక్షఁజెలంగి చంద్రుఁ డుదయించు విధంబునకై చకోరపుం బక్షులు చూడవే యెదు రపార ముదంబును... Read more

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 08 | ఆదర మింతలేక నరుఁ డాత్మబలోన్నతి మంచివారికి భేదము చేయుటం దనదు పేర్మికిఁగీడగు మూలమె, ట్లమ ర్యాద హిరణ్య పూర్వకశిపన్ దనుజుండు గుణాఢ్యుఁడైన ప్ర హ్లాదున కెగ్గుచేసి ప్రళయంబును బొందఁడె మున్ను భాస్కరా ! టీకా... Read more

  • Bhaskara satakam

    భాస్కర శతకము

    Apr 07 | అవని విభుండు నేరుపరియై చరియించినఁ గొల్చువార లె ట్లవగుణు లైననేమి? పను లన్నియుఁ జేకుఱు వారిచేతనే,  ప్రవిమల నీతిశాలి యగు రామునికార్యము మర్కటంబులే తవిలి యొనర్పవే జలధిఁదాఁటి సురారులఁద్రుంచి భాస్కరా! టీకా : అవని... Read more