"ఉల్లి ధర ఎందుకు పెరిగిందని వ్యాపారులను అడగాలి కాని మమ్మల్ని అడుగుతారేం? ప్రభుత్వం ఏమైనా ఉల్లిపాయలు అమ్ముతుందా?" అన్నారు సాక్షాత్తూ కేంద్ర మంత్రి కపిల్ సిబాల్.
మంత్రిగారి ఉద్దేశ్యం అమ్ముకుంటున్నవాళ్ళని అడగాలి కానీ మమ్మల్ని కాదు అని! ఈ మాట చెప్పేటప్పుడు ఆయన ఒకింత ఆగ్రహాన్ని కూడా ప్రదర్శించారు. ఇక్కడ ప్రశ్న ఉల్లిపాయలని కాదు నిత్యావసరాల ధరలను నియంత్రించే బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదన్న సంగతి పోనీ ఆ మంత్రిగారికి తెలియదేమోలే అని సరిపెట్టుకున్నా, "ఆహార ధరల పెరుగుదల విషయంలో బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే సుమా" అంటూ నిన్న ఆహార శాఖా మంత్రి కెవి ధామన్ అన్నారు. సమాచార శాఖా మంత్రి మాటల్లో దాన్ని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉల్లిపాయలు, ఇతర ఆహార పదార్థాలను అమ్ముతుందనా అర్థం?
ఆ మధ్య శరద్ పవార్ మాట్లాడుతూ, "ధరలు పెరిగితే మంచిదేగా రైతులు బాగుపడతారు!" అని అన్నారు. రైతులే బాగుపడితే ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి? ఇక్కడ బాగుపడుతున్న వారు మధ్యవర్తులే కానీ ఉత్పాదన చేసే రైతులూ కారు, కొనుగోలు చేసే వినియోగదారులూ కారని ఆయనకు తెలియదేమో అని సరిపెట్టుకోవాలి మనం!
"నిత్యావసర వస్తువులను అక్రమంగా నిలవచేసి అధిక లాభాలను దండుకుంటున్న మధ్యవర్తుల ఆగడాలను అణచివేయాల్సిన పని సర్కారుదే మంత్రి వర్యా!" అని చెప్తే ఆయనకి కోపం వచ్చింది. పెద్ద పెద్ద 2జి 3జి లాంటి కోట్ల రూపాయల విషయాల్లో చర్చల మీద చర్చలు చేసిన వారి దగ్గర చిన్న ఉల్లిపాయ సంగతి ఎత్తితే కోపం రాదా మరి!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more