Live in relationship enough for domestic violence act

Domestic Violence Act, Livi in relations, Live in Deemed marriage, Live in relation registration, divorce applies to live in, Tamilnadu High Court, Kerala High Court

Live in relationship enough for domestic violence act to apply

పెళ్ళికాకపోయినా అవన్నీ తప్పవు

Posted: 07/17/2013 03:23 PM IST
Live in relationship enough for domestic violence act

మొన్నామధ్య తమిళనాడు హైకోర్టు లైంగిక సంబంధమే అసలు వివాహమని, అందరి ముందు చేసుకునే వివాహ వేడుక కేవలం తంతు మాత్రమేనని సంచలన వ్యాఖ్యలను చేసింది.  దాని మీద ఎన్నో వ్యాఖ్యానాలను ఎందరో చేసారు.  కేరళ హైకోర్టు మరో అడుగు ముందుకేసి, గృహ హింస చట్టం కూడా వాళ్ళకి వర్తిస్తుందని తీర్పునిచ్చింది. 

ఒకే కప్పుకింద కాపురం చేస్తూ పిల్లలను కూడా కన్న తర్వాత మాకు పెళ్ళి కాలేదు అంటే కుదరదని తమిళనాడు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆ మహిళా బాధితురాలికి న్యాయం చేయటానికే అయినా అప్పటి కోర్టు వ్యాఖ్యలను వక్రీకరిస్తూ, అయితే నాకు పెళ్ళయినట్టే నేను కన్యను కానుగా అని ఒకళ్ళు, అయితే నాకు ఎప్పుడో పెళ్ళయిపోయిందని మరోకళ్ళు ఇలా రకరకాలుగా ట్వీట్లు చేసారు. 

లైంగిక సంబంధంతో పెళ్ళి జరిగిపోయనట్లే అయినా వాళ్ళు కావాలంటే వాళ్ళ వివాహాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చని, కావలంటే విడాకులు కూడా చట్ట బద్ధంగా తీసుకోవచ్చని కోర్టు తెలియజేసింది.  గృహ హింస చట్టం కూడా వాళ్ళకి వర్తిస్తుందని కేరళ హైకోర్టు తెలియజేయటంతో యువత కాస్త ఆలోచనల్లో పడక మానదు.  పెళ్ళి కాకపోయినా అన్నీ కావాలనుకునే యువతకు పెళ్ళి కాకపోయినా అన్ని బాధ్యతలను తీసుకోవలసివస్తుందనే భయం కూడా వారి విచ్చలవిడితనానికి కొంత కళ్ళెం వేసే అవకాశం ఉంది!

తనతో సహజీవనం చేస్తున్నవాడు తనని హింసిస్తున్నాడంటూ కోర్టుకెక్కిన మహిళతో తనకి ఆమెతో పెళ్ళే కాలేదు కాబట్టి ఆ చట్టం వర్తించదని అన్న ప్రబుద్ధుడికి బుద్ధి చెప్పటానికే కేరళ హైకోర్టు వాళ్ళకి కూడా చట్టం వర్తిస్తుందని తీర్పునిచ్చింది.

సహజీవనం సాగించినవాళ్ళలో సుప్రసిద్ధులు జాన్ అబ్రహాం బిపాసాబసు, సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ జంటలు.  అందులో మొదటి జంట విడపోయింది కానీ రెండవ జంట పెళ్ళి కూడా చేసుకుని ఆదర్శంగా నిలిచింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more