Dances in bars permitted by supreme court

dance bars open, SC allows dance bars, Dance bars in Maharashtra, Supreme Court, High Court of Maharashtra, Bombay Police Act 2005

Dances in bars permitted by supreme court

సరే, బార్ లలో నృత్యాలు చేసుకోండిక

Posted: 07/16/2013 12:51 PM IST
Dances in bars permitted by supreme court

ముంబై బార్ లలోమహిళలు నృత్యాలు చెయ్యటాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.  ఆ నిర్ణయాన్ని హైకోర్టు కూడా సమర్థించింది.  దానితో ముంబైలోని బార్ లలో లోగడ లాగా మహిళలకు నృత్యాలు చెయ్యటానికి అవకాశం లేకపోవటంతో ఆ నర్తకులంతా ఉపాధిని కోల్పోయారు.  ఇది జరిగి ఎనిమిది సంవత్సరాలైంది.

అయితే తమ వృత్తి నృత్యం చెయ్యటమేనని, నిషేధం వలన తాము ఉపాధిని కోల్పోయి నానా యాతనలు పడుతున్నామని డ్యాన్సర్లు సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకున్నారు.

బోంబే పోలీస్ చట్టం 2005 ప్రకారం బార్ లలో నృత్యాలు చెయ్యటాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.  ఈ చట్టం ఆహారపానీయాలు సేవించే చోట, పర్మిట్ రూం లేదా బార్ లేక బీర్ రూంలలో డ్యాన్స్ లు చెయ్యటాన్ని నిషేధించింది కానీ త్రీస్టార్ అంతకంటే పై స్థాయి హోటళ్ళు, కొన్ని పెద్ద సంస్థలలో అందుకు మినహాయింపు ఇచ్చింది.   ప్రజాప్రయోజనాల దృష్ట్యా మత్తు పదార్థాల సేవించే చోటు నృత్యాలు తగవని, అనైతికమని, అశ్లీలమని, వ్యభిచారానికి దారితీసే అవకాశముందని, మహిళలపట్ల దురాచారమని మహారాష్ట్ర ప్రభుత్వం వాదించింది. 

కానీ చట్టం ఎక్కడైనా ఒక్కటే కాబట్టి కొన్ని చోట్ల అనుమతులు మరికొన్ని చోట్ల నిషేధాలుండటం సరికాదని 2006 లో డ్యాన్సర్లు బార్ యజమానులు ఎపెక్స్ కోర్టు ని ఆశ్రయించగా కోర్టు వారి వాదనతో ఏకీభవించింది.  ఈ లోపు బొంబాయి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం డాన్సర్లకు వారి వృత్తిని వారు చేసుకునే హక్కుని కాలరాస్తోందని అభిప్రాయపడింది.  దానిని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ని కొట్టివేస్తూ సుప్రీం కోర్టు నిషేధాన్ని ఎత్తివేసింది. 

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఇక ముంబైలో ఎక్కడైనా డాన్స్ బార్ లలో డాన్స్ లు నిర్వహించవచ్చు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more