Why hyderabad state why not telangana

hyderabad state, telangana rashtra samiti, AP State division, AICC Core committee, Gandhi, Andhra State, Rayalaseema districts

why hyderabad state why not telangana

హైద్రాబాద్ ఎందుకు, తెలంగాణా పేరెందుకొద్దు?

Posted: 07/12/2013 11:27 AM IST
Why hyderabad state why not telangana

ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీలో ప్రతిపాదించదలచుకున్న నోట్ మీడియా లోకి ఎలాగో వచ్చేసింది.  

అది చూస్తే కాంగ్రెస్ పార్టీలోని పెద్ద తలకాయలు రాజకీయాల్లో ఎంతగా పండాయో అర్థమౌతుంది.  తెలంగాణా విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్ప మరే పార్టీ కూడా ఇంతకాలం తాత్సారం చేసి మనగలిగివుండేది కాదు.  కానీ ఇప్పటికీ విభజన అనేది తెరాస కృషితో కాకుండా కాంగ్రెస్ వలనే వస్తుందని చెప్పటానికి, దాని ప్రయోజనాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీకే రావటానికే ఇంతకాలం చర్చల మీద చర్చలు జరుగుతున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.  చివరకు ఒక మంచి ప్రతిపాదన తెరమీదకు వచ్చింది.

రాష్ట్రాన్ని విభజన చెయ్యటం తప్పనిసరన్నది అర్థమౌతోంది కాబట్టి చేసేదేదో ఇతర పార్టీలకు ఇందులో ఎంతమాత్రం లాభం చేకూరకుండా చెయ్యటమనేది కూడా అవసరమని పార్టీ భావించినట్లుగా అనిపిస్తోంది.  అందుకే ప్రతిపాదనలో తెలంగాణా పేరు లేకుండా హైద్రాబాద్ రాష్ట్రమని పేరు పెడుతూ విభజన చెయ్యాలంటే అందుకో కారణం ఉండాలి కాబట్టి రాయలసీమలోని రెండు జిల్లాలను కలుపుతోంది.  అంటే తెలంగాణా లోని 10 జిల్లాలతో పాటు కర్నూలు, అనంతపురం కూడా కలిపి 12 జిల్లాలతో హైద్రాబాద్ రాష్ట్రంగా రూపొందించదలచుకుంది.

తెలంగాణా పేరు ఉంచితే ఏమవుతుంది అనుకుంటున్నారా.  తెలంగాణా కోసమే పుట్టాం, తెలంగాణా తెచ్చేది మేమే అంటూ చెప్పుకుంటూ వచ్చిన తెలంగాణా రాష్ట్ర సమితికి రాష్ట్ర విభజన తర్వాత ఆ ఘనత దక్కకుండా ఉండాలంటే ఆ పేరుని తొలగించటం అవసరం.  తెరాసకి, కొత్త రాష్ట్రానికి మధ్య ఎటువంటి పోలిక ఉండకుండా ఉండాలంటే ఏదో ఒకదాని పేరు మార్చాలి.  పార్టీ పేరులోని తెలంగాణా పదాన్ని తీసెయ్యటం సాధ్యం కాదు కాబట్టి, హైద్రాబాద్ రాష్ట్రమని పేరు పెడితే రేప్పొద్దున తెరాస రాజకీయ ప్రయోజనాలకోసం దాన్ని వాడుకునే అవకాశం లేకుండావుంటుంది.

నిజానికి మహాత్మా గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీ పేరుని వ్యతిరేకించారు.  ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్, రాజకీయ పార్టీ కాదు- త్యాగధనుల సమూహం.  అదే పేరుతో రాజకీయ పార్టీగా రాజకీయాల్లోకి రావటం వలన దేశానికి స్వాతంత్ర్యం సంపాదించింది మేమే అని చెప్పుకోవటానికి వీలుంటుంది, అది ప్రజలను తప్పుదారి పట్టించటమవుతుందన్న ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ పేరు ని రాజకీయాల్లో వాడవద్దని గాంధీ చెప్పారు.  అయినా అదే పేరు వచ్చింది, స్వాతంత్ర్య పోరాటం చేసిన ఘనత పార్టీకి కూడా ఉపయోగపడింది.  ఇప్పుడు తెలంగాణా రాష్ట్ర సమితి కూడా అలాగే తెలంగాణా తెచ్చింది మేమే అని చెప్పటానికి వీల్లేకుండా రాష్ట్రం పేరునే మార్చేస్తే పోలే అన్నదే ఈరోజు కోర్ కమిటి లోని ప్రతిపాదనలోని హైద్రాబాద్ రాష్ట్రమనే పేరు విషయంలో కాంగ్రెస్ నాయకుల ఎత్తుగడని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more