Mla angry for traffic police stopping his vehicle at mid night

mla car stopped, mla angry on traffic police, mla srinivasarao, bheemly constitution, maharashtra mlas, traffic cop beaten in assembly

mla angry for traffic police stopping his vehicle at mid night for check up

నా కారునే ఆపుతావా అంటూ ఆగ్రహం వహించిన ఎమ్మెల్యే

Posted: 04/21/2013 08:55 AM IST
Mla angry for traffic police stopping his vehicle at mid night

మద్యం సేవించి వాహనాలను నడిపేవాళ్ళ కోసం తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు నిన్న అర్థరాత్రి వాహనాలను నిలిపి తన విధిని నిర్వహిస్తుండగా విశాఖ జిల్లా భీమిలి శాసన సభ్యుడు శ్రీనివాసరావు అదే దారిలో కుటుంబ సమేతంగా వెళ్తున్నారు.  విధి నిర్వహణలో ఆ కారుని కూడా ఆపటంతో శ్రీనివాసరావు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 

కుటుంబ సభ్యుల ముందు సామాన్య పౌరుడిలా ఒద్దికగా ట్రాఫిక్ పోలీసుని తనిఖీ చెయ్యనివ్వటం చిన్నతనమనిపించింది కాబోలు, తనెవరో తెలియజెప్పటమే కాకుండా, నా కారునే ఆపుతావా, ఎంత ధైర్యం నీకు, నీ సంగతి తేలుస్తా అని ట్రాఫిక్ పోలీసు మీద విరుచుకుపడ్డారాయన. 

మహారాష్ట్రలో కూడా ఇలాగే జరిగింది.  కారు స్పీడ్ లిమిట్ దాటిందని ఆపేటప్పటికి ఎమ్మెల్యేలకి పట్టరాని కోపం వచ్చేసింది.  కానీ అది ఆ తర్వాత విపరీత పరిణామాలకు దారితీసింది.  ఆ ట్రాఫిక్ పోలీస్ ని ఎమ్మల్యే మిత్రబృందమంతా కలిసి శాసన సభలోనే మూకుమ్మడిగా దాడి చేసేటప్పటికి ఆ ట్రాఫిక్ పోలీస్ స్పృహతప్పి రెండు రోజులు హాస్పిటల్ లో ఉన్నాడు.  పోలీసులు ఆ శాశనసభ్యులమీద  సభాపతికి ఫిర్యాదు చెయ్యగా ఆయన వాళ్ళని సస్పెండ్ చేసారు. అంతటితో ఆగలేదు.  విధి నిర్వహణలో ఉన్న పోలీసుని అడ్డుకున్నందుకు వాళ్ళ మీద కేసు పెట్టారు. కథ మళ్ళీ మలుపు తిరిగింది. 

శాసన సభ్యులంతా ఆందోళన చెయ్యటంతో పాటు, శాసనసభలో ట్రాఫిక్ పోలీస్ కేమి పని, అక్కడ విధి నిర్వహణలో లేడు కదా అని లా పాయింట్ తీసారు.  సస్పెండ్ అయిన శాసనసభ్యుల సస్పెన్షన్ రద్దు చెయ్యటమే కాకుండా, వత్తిడిని తట్టుకోలేక ఆ ట్రాఫిక్ పోలీసుని సస్పెండ్ చేసారు.  దానితో పోలీసు శాఖ ఆ శాసన సభ్యుల సెక్యూరిటీని ఉపసంహరించుకుంది.  ఇలా ఎన్నో మలుపులు తిరిగిందా కథ. 

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, చట్టాలను తయారుచేసే వారే చట్టాల అమలుకి అభ్యంతరాలు చెప్పటం ఎలాంటి సంకేతమిస్తోంది?  వాళ్ళు చేసే చట్టాలు వాళ్ళకి వర్తించవనా, వాళ్ళు వాటికి అతీతులనా?  రాజుల కాలం పోయినా ఇంకా ప్రజాప్రతినిధులు పాలించే రాజుల మనస్తత్వాన్నే కలిగివుండటం ఆశించదగ్గది కాదు కదూ!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more