Bhadrachalam ramanavami festival

sriramanavami at bhadrachalam, endowment minister ramachandraiah offers silk clothes, chief minister kiran kumar reddy offers pearls

bhadrachalam-ramanavami-festival

భద్రాచలంలో శ్రీరామ నవమి

Posted: 04/19/2013 11:51 AM IST
Bhadrachalam ramanavami festival

 భద్రాచలంలో అత్యంత వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫునుంచి దేవాదాయ శాఖా మంత్రి రామచంద్రయ్య స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.

ఆదర్శదంపతులుగా పేరుగాంచిన సీతారాముల కళ్యాణాన్ని దేశమంతటా ఘనంగా చేసుకుంటుంది. సీతారాముల కళ్యాణం లోక కళ్యాణానికి హేతువని హైందవులందరూ నమ్ముతారు. అందుకే, భక్తి శ్రద్ధలతో పాటు నిర్వహించటమే కాకుండా శాస్త్రోక్తంగా కళ్యాణ విధిని పూర్తిచేస్తారు.

ఈరోజు భద్రాచలం లో జరిగే శ్రీరామ నవమి కళ్యాణ వేడుకలలో, ఉదయం 8 నుంచి 9 వరకు ధృవమూర్తులకు కళ్యాణం జరిగిన తర్వాత 9 నుంచి 9.30 వరకు జరిగిన అలంకరణ అనంతరం ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్ళి 10.30 కి కళ్యాణ మండపాన్ని చేరుకుని వివాహానికి ముందుగా చెయ్యవలసిన విష్వక్సేన పూజ, ఆ తర్వాత పుణ్యఃవచనం చేసి, వివాహంలో ఉపయోగించే సామగ్రి సంప్రోక్షణ చేసారు. ఆ తర్వాత రామయ్యకు సీతమ్మకు రక్షాసూత్రాలను కట్టి, రాముడికి బంగారు యజ్ఞోపవీతాన్ని ధరింపజేసారు.

పెళ్ళి తంతు శాస్త్రోక్తంగా జరిగే ఈ విధిలో పెద్దలు రాముడికి సీత తగిన వధువన్న నిర్ణయాన్ని ప్రకటించి, ఇరువైపుల వంశాలను గుర్తుచేస్తారు. పెళ్ళి కొడుకు పాద ప్రక్షాళన తర్వాత పెళ్ళి కూతురు పుష్పోదక స్నానం చేయించటం జరుగుతుంది.

గోదానం చేసి శ్రీరామ చంద్రునికి సీతమ్మను కన్యాదానం చేస్తారు. కన్యాదాన ఫలితం కోసం షోడశ దానాలు చేసి వధూవరులకు మంగళాశీస్సులను చదువుతారు. తర్వాత శుభలగ్నానికి జీలకర్ర బెల్లం మాడు మీద పెట్టటం, తలంబ్రాలు తలమీద పోసుకోవటం, ఆ తర్వాత బ్రహ్మముడి వేస్తారు. చివరిగా మంగళహారతి ఇచ్చి ఆశీర్వదిస్తారు.

వివాహం జరిగేది భగవంతునిగా కొలిచే ఆరాధ్య దైవానికైనా, తంతు మాత్రం మానవులు చేసుకునే విధానంలో ఉంటుంది. ఎందుకంటే పరమాత్మ మానవ రూపంలోనే అవతారమెత్తి మనందరికీ ఆదర్శ ప్రాయమైన జీవన విధానాన్ని స్పయంగా పాటించి తెలియజేసారు కాబట్టి.

ఆనవాయితీ ప్రకారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంచి ముత్యాలను తలంబ్రాలలో కలపటానికి తీసుకెళ్ళారు.

-శ్రీజ

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more