కళ్యాణ రాముని కమనీయ వైభవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తజనకోటి కోసం భద్రాచలం సిద్ధమైంది. ఎండవేడి నుండి తట్టుకోవటానికి కళ్యాణ మండపం దగ్గర పందిళ్ళు, దాహం తీర్చుకోవటానికి మంచినీటి ఏర్పాటు చేసిన దేవస్థానం యాజమాన్యం, రాముని పెళ్ళి తంతుకి కావలసిన ఏర్పాట్లు కూడా చేసుకుంది.
దేవుడి పెళ్ళికి అందరూ ఆహ్వానితులే కాబట్టి వచ్చిన భక్తులకు కావలిసింది వైభవంగా పెళ్ళి జరగటం, ఆ తర్వాత ప్రసాదం కంటే ముఖ్యంగా తలంబ్రాలు లభించటం. తలంబ్రాలు మూడు రకాలుగా సిద్ధం చేసారు. 50 వేల సాధారణ తలంబ్రాల ప్యాకెట్లు, 40 వేల తలంబ్రాల ప్యాకెట్ లలో ఒక్కో ముత్యం వేసి, మరో 10 వేల తలంబ్రాల ప్యాకెట్లలో మూడు ముత్యాలు వేసి భక్తులకోసం సిద్ధం చేసారు. ప్రసాదం ఇంటికి తీసుకెళ్ళే భక్తుల కోసం 75 వేల లడ్డూలను ఇప్పటికే తయారుచేసారు, ఇంకా తయారవుతున్నాయి.
భక్తి అంటేనే నమ్మకం. సీతా రాముల తలంబ్రాలను చాలా పవిత్రంగా చూస్తారు. వాటిని తలమీద వేసుకుంటే పెళ్ళికాని వాళ్ళకు పెళ్ళవుతుందని హైందవుల నమ్మకం. అలాగే ప్రసాదం కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. అయితే మనం చాలా విషయాల్లో ఆపద్ధర్మాలను అనుసరిస్తుంటాం. అంటే ఆచారం పడగొట్టగూడదు, కానీ ఇబ్బందీ కలుగగూడదు. అదే భక్తితో దైవ పూజలో పాటించే ఆపద్థర్మమంటే. అసలు పూజకే రారేమోననే భయంతో పూజా విధులలో ఎన్నో వెసులుబాట్లు కలిగించారు. మీకు చేతనైనంతే అనే మాటను ఉపయోగిస్తారు. మీ ఇష్టానుసారం, శక్త్యానుసారం పూజలు చెయ్యండి అంటారు. ఉంటే బంగారు లేక పోతే వెండి, అదీ లేకపోతే రాగి, లేదా, ఇత్తడి, అదీ లేకపోతే మట్టిపాత్రనూ కలశంగా ఉపయోగించవచ్చు అన్నట్టు ఆకులోనైనా సరే నైవేద్యం పెట్టవచ్చు. ప్రసాదం అంటే ఇంత ఉండాలి అనే నియమం ఏమీ లేదు. అంటే తక్కువలో తక్కువకూడా నైవేద్యం చెయ్యవచ్చు. ఏమీ లేక పోతే బెల్లం ముక్క కానీ లేదా కొంచెం పంచదార కానీ దేవుడికి పెడతారు. ఇవే ఆపద్ధర్మాలంటే. వెసులుబాట్లు.
ప్రసాదమంటే నిజానికి దేవుడికి నైవేద్యం పెట్టినది. దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని అందరూ తీసుకుంటారు కాబట్టి అది ఎంత తక్కువ పరిణామంలో ఉన్నా పరవాలేదు. అయితే దేవుడికి అసలే పెట్టకపోతేనూ. అలాగే జరుగుతోంది యాత్రా స్థలాల్లో. దేవడు ఎక్కడో ఉంటాడు, ప్రసాదం మరెక్కడో తయారై ప్యాకెట్లలోకి వెళ్ళిపోతుంది. దుకాణాల్లో దొరుకుతుంది. కాకపోతే ఆ ప్యాకెట్ల మీద దేవుడి బొమ్మను ముద్రిస్తారు.
అలాగే తలంబ్రాలు కూడా ముందుగానే ప్యాకెట్లలో సిద్ధమై భక్తులకోసం ఇప్పటి నుంచే ఎదురుచూస్తున్నాయి. దేవస్థానం ఏర్పాటు చేసింది కాబట్టి దేవుడిదన్నట్లే మరి. రేపటి కార్యక్రమాలు అని టివి చూపించేవాటిలో చూపించగూడనివి వార్తలు. వార్తలు అప్పటికప్పుడే కానీ ముందుగా చూపించటం కుదరని పని. కానీ రాముడు 19 న చేసుకోబోయే పెళ్ళి తలంబ్రాలు, ఆ రోజు ప్రసాదం ఇప్పటినుంచే తయారుగా లేకపోతే అప్పటికప్పుడు లక్షలాది మందికి వితరణ చెయ్యటం సాధ్యం కాని పని కదా. అందుకే ఈ ఏర్పాట్లు.
ఇవన్నీ తెలిసినా సరే కళ్ళకి అద్దుకుని మరీ తీసుకుంటాం. అదే నమ్మకం. అదే భక్తి. సృష్టిలోనిదంతా పరమాత్ముడిదే అయినప్పుడు, అనాది నుంచీ ఆ ప్రకృతి మనకోసమే ఉన్నప్పుడు రెండు రోజుల ముందు చేసే ఏర్పాట్లను తప్పుగా లెక్కలోకి తీసుకోగూడదు. అందుకే అందరూ పవిత్రంగా చూస్తారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more