Narendra modi set for record third term in gujarat

gujarat assembly polls, narendra modi set for record third term in gujarat,gujarat chief minster narendra modi, narendra modi set for hat-trick, gujarat elections 2012

Narendra Modi set for record third term in Gujarat

Gujarat.gif

Posted: 12/20/2012 03:52 PM IST
Narendra modi set for record third term in gujarat

Narendra Modi set for record third term in Gujarat

అందరు అనుకున్నదే  గుజరాత్ ఎన్నికల విషయంలో జరిగింది. గుజరాత్  ముఖ్యమంత్రి  నరేంద్ర మోడీ  హ్యాట్రిక్ సాధించాడని  ఆ రాష్ట్ర ప్రజలు , సర్వేలు, మీడియా ఛానల్స్  కోడైకూశాయి. ఇప్పుడు అందరి  మాటలు ఒకటిగా  మోడీ  తన ఘన విజయం సాధించారు.  ఆయనకు  గుజరాత్ రాష్ట్ర ప్రజలు  మళ్లీ పట్టం కట్టారు.  గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ   ఇక ముందుకు  పోవడమే వెనుకకు తిరిగి చూడటమంటూ  వుండదని  ఆయన అన్నారు.  అజేయమైన ధైర్యంతో , ఓర్పుతో  శక్తితో  ముందుకు  దూసుకుపోవడమేనని ఆయన అన్నారు. గుజరాత్ తన కంచుకోట అని నరేంద్ర మోడీ మరోసారి నిరూపించారు. ముచ్చటగా మూడోసారి మోడీ విజయ కేతనం ఎగురువేశారు. మణినగర్‑లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి శ్వేతాభట్‑పై 75వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అంతే కాకుండా పటేళ్ల ప్రభావం ఉన్న సౌరాష్ట్రలోనూ మోడీ తన ఆధిక్యాన్ని చాటుకున్నారు.  జనాగఢ్ జిల్లా మంగ్రోల్‑లో బీజేపీ అభ్యర్థి రాజేశ్ భాయ్ గెలుపొందారు. మోడీ విజయంతో అహ్మదాబాద్ లోని బీజేపీ కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. డప్పు వాయిద్యాల మధ్య బీజేపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు సందడి చేస్తున్నారు. మిఠాయిలు పంచుకుంటూ ఒకొరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. నరేంద్ర మోడీ.. అభివృద్ధిలో గుజరాత్‌ను దేశంలోనే నెంబర్‌వన్‌ చేశారు. యవ్వనం నుంచీ సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోవడంలో మోడీని మించినవారు లేరంటారు. వివాదాలు చుట్టుముట్టినా.. విమర్శలు వెల్లువెత్తినా.. ఆయన ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. నా రూటు సపరేటంటూ.. ముందుకు సాగిపోతున్నారు. భావి భారతాన్ని నడిపించే సత్తా ఉందని మాటలతో కాకుండా చేతలతో చూపుతున్నారు. మోడీకి ఎదురైన సవాళ్లలో అతిపెద్దది.. ఇప్పటికీ నీడలా వెంటాడుతున్నది.. గోద్రా అల్లర్లు. సీఎం అయి ఆర్నెళ్లు కూడా గడవకముందే 2002 ఫిబ్రవరి 27న సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. కరసేవకుల సజీవ దహనం... రాష్ట్రం అగ్నిగుండంగా మారడం ఈయనకు సవాల్‌గా మారింది.కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులిచ్చినా.. కేంద్ర బలగాలను మోహరించినా.. గోద్రాలో మారణహోమాన్ని ప్రోత్సహించారన్న అపవాదును మోడీ మూటగట్టుకున్నారు.నాటి గొడవల్లో అన్ని వర్గాలవారూ సమిధలయ్యారు.

Narendra Modi set for record third term in Gujarat

 కేంద్రంలోని సంకీర్ణ సర్కారును నడుపుతున్న బీజేపీకి ఇది సంకటంగా మారింది. మోడీతో రాజీనామా చేయించాలన్న డిమాండ్‌ మార్మోగింది. దీంతో.. మోడీ దానికి కూడా రెడీ అన్నారు.  రాజీనామా సమర్పించి ఏకంగా ఎన్నికలకు వెళ్లారు.మితంగా మాట్లాడే మోడీ మతవాది అన్నది ప్రధాన ఆరోపణ. అందుకు గోద్రా ఘటన తర్వాత చెలరేగిన మారణహోమమే నిదర్శనమని ప్రత్యర్థులు చెప్తారు. కానీ.. ఏ విచారణలో కూడా ఈయనపై అభియోగాలు రుజువు కాలేదు. కానీ.. ప్రత్యర్థులకు మాత్రం అదో ఆయుధం. సోహ్రాబుద్ధీన్‌ను ఎన్‌కౌంటర్‌ చేయించారన్నది మరో ఆరోపణ. ఇది కూడా అంతే. కానీ.. రాజకీయ ప్రత్యర్థులు చెప్తున్నట్టు ఈయన అలౌకికవాది కాదని పరిశీలకులు చెప్తారు. ఎందుకంటే.. అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుగా నిలిచిన ఆలయాలను, అనుమతుల్లేకుండా కట్టిన మందిరాలను మోడీ తృణప్రాయంగా తొలగించేశారు. గుజరాత్  ప్రగతి కోసం తపించారు. అదే ఆయనకు హ్యాట్రిక్‌ను అందించింది. ఐదు లక్ష్యాలతో ప్రవేశపెట్టిన పంచామృత్‌ యోజన, సద్భావన మిషన్, కృషి మహోత్సవ్‌ మోడీ మానస పుత్రికలు. ఉగ్రవాదంపై కఠిన వైఖరి ఆయనకో భూషణం. సుజలాం..సుఫలాం నినాదంతో ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి, ఆందోళనల్ని ఎదుర్కొని నర్మదా డ్యాం ఎత్తును పెంచారు. లక్ష హెక్టార్లను అదనంగా సాగులోకి తెచ్చారు. ఇప్పుడు గుజరాత్‌ అంటే ఇ-గవర్నెన్స్‌కు రోల్‌మోడల్. పెట్టుబడులకు స్వర్గధామం. పేదరిక నిర్మూలనకు వేదిక. గ్యాస్‌ సిలిండర్లు అందించేందుకు కేంద్రం డక్కామొక్కీలు తింటున్నా, ఆరుకు పరిమితం చేసి చేతులెత్తేసినా.. ఇంటింటికీ పైప్‌లైన్‌ గ్యాస్‌ అందిస్తున్న గుజరాత్‌తో ఏ రాష్ట్రమూ కనీసం పోల్చుకోలేని పరిస్థితి. సెజ్‌ల కాన్సెప్ట్‌ను సద్వినియోగం చేసుకోవడంలో మోడీ తర్వాతే ఎవరైనా. నానో తయారీకి బెంగాల్‌లో అడ్డంకులు ఎదురైతే టాటాలకు రెడ్‌కార్పెట్‌ పరిచి కార్పొరేట్‌ రంగం తనవైపు చూసేలా చేసుకున్న వ్యూహకర్త.. మోడీ.

Narendra Modi set for record third term in Gujarat

తమ హయాంలో వేయించిన రోడ్లపై మన్మోహన్‌ తనతో చర్చకు రావాలంటూ ఏకంగా ప్రధానినే సవాల్‌ చేశారంటే మోడీ చేసిన అభివృద్ధి ఏస్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. అన్నిటికి మించి ప్రభుత్వ పథకాల్లో పార్టీ నేతల కంటే ప్రజల భాగస్వామ్యం ఎక్కువ కాబట్టే.. ఆటోమేటిగ్గా గుజరాతీలు ఓట్లు రాల్చారు. తమ అభిమాన నాయకుడిని అందలం ఎక్కించారు. ముళ్ల కుర్చీలా మారిన సీఎం పీఠాన్ని పూలపాన్పుగా మార్చుకోవడంలో మోడీ చాణక్యం ప్రదర్శించారనే చెప్పాలి. తాను ముఖ్యమంత్రి కుర్చీని అధిరోహించే సమయానికి గుజరాత్‌ ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడిపోతుండేది.ఎటు చూసినా సాయం కోసం ఎదురుచూసే బాధితులే. భూకంపాలు, వరదలు గుజరాతీల్ని తేరుకోనివ్వలేదు. ఏ ప్రాంతం చూసినా కష్టాల కడలికి ఎదురీదేది. అలాంటి క్లిష్ట సమయాల్లో బాధ్యతలు చేపట్టిన మోడీ.. గుజరాత్‌ను వెలిగిపోయేలా చేయాలన్న సంకల్పమే బలమైన ఆయుధంగా పనిచేశారు. అహోరాత్రాలు కృషి చేసి రాష్ట్రాన్ని గాడిలోకి తెచ్చారు. అన్నం ఉడికిందో లేదో తెలుసుకనేందుకు ఓ మెతుకును పట్టుకుని చూసినట్టే.. మోడీ సత్తా ఏంటో భూకంపంతో అల్లాడిన భుజ్‌ ప్రాంతం చెప్తుంది. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు మోడీకి వివిధ దేశాలు తిరిగే అవకాశం వచ్చింది. ప్రముఖులతో సాంగత్యం, ఎన్నో అంశాలపై చర్చలు, సందేహాల నివృత్తి, విశ్లేషణలు వంటి కార్యక్రమాలతో మోడీ దృక్కోణంలో పూర్తిగా మార్పు వచ్చింది. భారత్‌ను బలీయమైన శక్తిగా మార్చాలన్న ఉక్కు సంకల్పం ఏర్పడింది. మరో రకంగా చెప్పాలంటే కరుడుగట్టిన రాజకీయ వాదిగా మోడీ రాటుదేలారు. అదే ఆవేశంతో, మోడీ గుజరాత్‌ను అభివృద్ధిలో నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలిపారు. గుజరాత్ ఒక్క మగాడుగా నిలిచారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress delay strategy on telangana issue
Kajal agarwal marriage news  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more