Pawan kalyan trivikram movie shooting in hyderabad

pawan kalyan, trivikram movie, pawan trivikram combo, pawan trivikram movie shooting, pawan movie shooting in hyderabad, samantha heroine, heroine praneetha, bvss prasad producer, director trivikram

pawan kalyan trivikram movie shooting in hyderabad

8.gif

Posted: 02/07/2013 03:16 PM IST
Pawan kalyan trivikram movie shooting in hyderabad

      pawan_movie_working_stills పొల్లాచ్చి వెళ్లాల్సిన పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా షూటింగ్ చివరి క్షణంలో రద్దై హైదరాబాద్ షెడ్యూల్ కొనసాగిస్తోంది. ఈ షూటింగులో భాగంగా బంజారాహిల్స్ సిటీ సెంటర్ షాపింగ్ మాల్ లో పోరాట సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఈ సన్నివేశాల్లో పవన్ తోపాటు పలువురు నటులు, ఫైటర్లు పాల్గొన్నారు. ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ ఈ ఫైట్స్ కంపోజ్ చేశారు.
    కాగా, బంజారాహిల్స్ లో పవన్ షూటింగ్ జరుగుతోందని తెలియగానే, పెద్ద సంఖ్యలో అభిమానులు మాల్ దగ్గరకు చేరుకున్నారు. కొందరు అభిమానులు సెల్ కెమేరాలతో ఫోటోలు తీసి సామాజిక సైట్లలో కూడా పెట్టేశారు.
        ఈ సినిమాలో సమంతా ప్రధాన కథానాయిక కాగా, మరో హీరోయిన్ గా ప్రణీత ఎంపికయింది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 'జల్సా' తరహాలో ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ మేనరిజం, త్రివిక్రమ్ పంచ్ డైలాగులు సినిమాకు హైలైట్ కానున్నాయని చిత్రవర్గాలు చెబుతున్నాయ్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rudhrama devi moive music sittings
Actress ilyana acts with nagarjuna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles