10-year-old acts fast to save his mom from drowning ఈతకొలనులో తల్లికి ఫిట్స్.. పదేళ్ల కోడుకు ఏం చేశాడంటే..

Ten year old boy saves his mother from drowning in pool after she has a seizure

boy saves mom from drowning, hero rescue, 10 year old rescues his mother, best rescues, boy saves mom, boy saves mother from drowning, oklahoma rescue, boy rescues mother, mother rescue, caught on camera, rescue caught on camera

A 10-year-old boy displayed great resolve and strength in saving the life of his mother who suffered a seizure in a swimming pool. A surveillance camera caught the moment Gavin Keeney jumped into the pool to save his drowning mother. The incident took place at their home in Oklahoma.

ITEMVIDEOS: ఈతకొలనులో తల్లికి ఫిట్స్.. పదేళ్ల కోడుకు ఏం చేశాడంటే..

Posted: 08/30/2022 10:29 PM IST
Ten year old boy saves his mother from drowning in pool after she has a seizure

పదేళ్ల కుర్రాడు.. అంటే సుమారుగా ఐదవ తరగతి చదవుతుంటాడు. కానీ తన తల్లికి ఆపద చుట్టుముట్టిన సమయంలో.. అమెను కాపాడుకున్నాడు. దాదాపుగా అపస్మారక స్థితిలోకి వెళ్లిన తల్లిని.. తన బలంతో కొంతదూరం లాక్కోచ్చి.. తన అరుపులతో అందరినీ అలర్ట్ చేసి కాపాడుకున్నాడు. అసలింతకీ బాలుడి తల్లికి ఏం జరిగిందీ.? తల్లిని కాపాడుకునేందుకు బాలుడు ఏంచేశాడు అన్న వివరాల్లోకి వెళ్తే.. తనఇంటి ఆవ‌ర‌ణ‌లోని స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్న ఓ మ‌హిళ‌కు ఆస్మాత్తుగా ఫిట్స్ వ‌చ్చాయి. దాంతో ఆమె ఈద‌లేక నీటిలో మునిగిపోతున్న‌ది.

ఇది గ‌మ‌నించిన ఆ మ‌హిళ ప‌దేండ్ల కొడుకు ప‌రుగున వ‌చ్చి, స్విమ్మింగ్ పూల్‌లో దూకి.. మునిగిపోతున్న త‌న త‌ల్లిని పూల్ మెట్ల వ‌ర‌కు లాక్కొచ్చాడు. అంత‌కంటే మీద‌కు లాగ‌డానికి బ‌లం చాల‌క‌పోవ‌డంతో.. అరుస్తూ త‌న తాత‌య్య వ‌చ్చే వ‌ర‌కు త‌ల్లి త‌ల నీళ్ల‌లో మున‌గ‌కుండా పైకి లేపి ప‌ట్టుకున్నాడు. ఆ త‌ర్వాత వాళ్ల తాత‌య్య వ‌చ్చి మ‌హిళ‌ను బ‌య‌టికి తీసుకొచ్చాడు. అమెరికాలోని ఓక్ల‌హామా రాష్ట్రంలో ఆగ‌స్టు 6న ఈ ఘ‌ట‌న జ‌రిగింది. బాలుడు మ‌హిళ‌ను కాపాడే స‌మ‌యంలో వారి పెంపుడు కుక్క కూడా స్విమ్మింగ్ పూల్‌ మెట్ల మీది వ‌ర‌కు ప‌రుగున వ‌చ్చింది.

అవ‌స‌ర‌మైతే పూల్‌లో దూకేందుకు సిద్ధ‌మైంది. మ‌హిళ ఇంట్లోని సెక్యూరిటీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ‌య్యాయి. బాధిత మ‌హిళే ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. త‌న పేరు లారీ కీనీ అని, త‌నను కాపాడిన త‌న కొడుకు పేరు గ‌విన్ అని పోస్టులో పేర్కొంది. ఈ వీడియోకు వేల‌ల్లో వ్యూస్‌, వంద‌ల్లో కామెంట్‌లు వ‌స్తున్నాయి. నీ కొడుకు నిన్ను కాపాడిన దేవుడు. అత‌నొక హీరో అని ఒక నెటిజ‌న్ కామెంట్ చేశాడు. గాడ్ బ్లెస్ యు గ‌విన్‌. నువ్వు మీ అమ్మ పాలిట దేవుడివి అని మ‌రో నెటిజ‌న్ పేర్కొన్నాడు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles