ATM Cash Withdrawal Limit For Major Banks ఏటీయం నుంచి డబ్బులు డ్రా.. బాదుడు మొదలెట్టిన బ్యాంకులు

Check the atm transaction limits and charges of different banks

atm transaction limit,sbi free atm transaction limit,sbi atm withdrawal rules,sbi atm withdrawal limit,sbi atm cash withdrawal limit,sbi atm charges,hdfc bank atm transaction,hdfc bank atm charges,hdfc atm withdrawal limit from other bank,hdfc atm withdrawal limit per month,hdfc atm withdrawal charges,icici bank atm transaction,icici bank atm cash withdrawal,icici bank atm withdrawal charges,axis bank atm cash withdrawal,axis bank transaction limit per month,axis bank cash withdrawal limit from branch

All major banks, both in the public and private sector, allow a limited number of free transactions at the ATMs every month. Beyond the free transactions, which include financial and non-financial services, the lenders levy a charge with applicable taxes. Using the ATMs beyond the permissible limit of free monthly transactions will be chargeable.

ఏటీయం నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారా.? బ్యాంకుల బాదుడు షురూ.!

Posted: 08/17/2022 03:50 PM IST
Check the atm transaction limits and charges of different banks

జేబులో డబ్బులు పెట్టుకుని తిరిగితే.. ఎవరైనా జేబు దొంగలు కొట్టేస్తారేమో అన్న అందోళన అవసరం లేకుండా.. ఎంచక్కా.. డిజిటల్ పే వచ్చేసింది. ఇక ఎదో ఒకచోట డబ్బు అవసరం అయితే.. అక్కడికక్కడే కనిపించే ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకువస్తామంటారా.. కరెక్టే కానీ.. వందకు, ఐదొందలకు కార్డు పెట్టి లాగేసుకుంటామంటే ఇకపై కుదరదు. ఏందుకని అంటే.. ఇకపై ఎలాపడితే అలా.. డబ్బును విత్ డ్రా చేస్తే.. బ్యాంకులు కూడా బాదేుస్తాయి. ఔనా.. మళ్లీ నోట్ల రద్దుకు పూర్వస్థితి మాదిరి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయా.? అంటే కాదనలేం.

ఉచిత లావాదేవీలను పరిమితం చేస్తూ, ఆపై చేసే ప్రతి లావాదేవీకి చార్జీలు వసూలు చేయాలని దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు నిర్ణయించాయి. పరిమితి దాటిన తర్వాత ఆర్థిక, ఆర్థికేతర సేవలపై చార్జీలను విధించనున్నాయి. ఖాతా రకం, డెబిట్ కార్డుల ఆధారంగా ఏటీఎంలో ఉచిత లావాదేవీల సంఖ్య విషయంలో మార్పు ఉండే అవకాశం ఉంది. ప్రతి నెల అనుమతించిన వాటికి మించి జరిపే లావాదేవీలపై ఖాతాదారులు చార్జీలు చెల్లించకతప్పదు. నిజానికి ఇందుకు సంబంధించి గతేడాది జూన్‌లోనే భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఏటీఎంలో ఉచిత లావాదేవీలు పరిమితికి మించితే ఈ ఏడాది జనవరి 1 నుంచి ప్రతి లావాదేవీకి రూ. 21 చార్జ్ వసూలు చేసేందుకు బ్యాంకులకు అనుమతినిచ్చింది. గతంలో ఈ చార్జ్ రూ. 20గా ఉండేది. ఖాతాదారులు ప్రతి నెల తమ బ్యాంకు ఏటీఎం నుంచి ఉచితంగా ఐదు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి మూడు ఉచిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. నాన్ మెట్రో కేంద్రాల్లోని ఖాతాదారులు ఇతర బ్యాంకు ఏటీఎంలలో ఐదు లావాదేవీలను ఉచితంగా చేసుకోవచ్చు. ఈ పరిమితి దాటితే ప్రతి లావాదేవీపైనా బాదుడు తప్పదు.

ఇక పలు బ్యాంకులు డబ్బు విత్ డ్రాపై కూడా పరిమితి విధించాయి. యాక్సిస్ బ్యాంకు మాత్రం ఏటీయంలో తమ ఖాతాదారులకు ఒక్క విత్ డ్రాకు పదివేల రూపాయల పరిమితి విధించింది. ఇదిలా ఉండగా, ఆగస్టు 1 నుంచి ఆర్థిక లావాదేవీకి రూ. 17, ఆర్థికేతర లావాదేవీకి రూ. 6 చొప్పున ఇంటర్‌చేంజ్ రుసుమును విధించుకునేందుకు అన్ని బ్యాంకులకు ఆర్బీఐ అనుమతినిచ్చింది. మరిన్ని ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేయడానికి, వాటి నిర్వహణ కోసమే బ్యాంకులు ఈ సర్వీసు చార్జీలను ఉపయోగిస్తాయి. అలాగే, అన్ని మేజర్ బ్యాంకులు డెబిట్ కార్డులపై వార్షిక ఫీజును కూడా వసూలు చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles