Congress questions ED summons to Kharge in National Herald case ఈడీ చర్యలు క్షక్షపూరితం: జైరాం రమేశ్

Not even an accused congress questions ed summons to mallikarjun kharge in national herald case

Mallikarjun Kharge, Leader of the Opposition, Rajya Sabha, Kharge ED questioning, Jairam Ramesh, Congress, National Herald case, National Politics

The Congress questioned the Enforcement Directorate’s summoning of Leader of Opposition Mallikarjun Kharge during Parliament session and said that it was done with the sole purpose of harassing LoP and the Congress party. “Kharge is not even an accused in the AJL case," Congress leader Jairam Ramesh said.

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చర్యలు క్షక్షపూరితం: జైరాం రమేశ్

Posted: 08/08/2022 06:35 PM IST
Not even an accused congress questions ed summons to mallikarjun kharge in national herald case

కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కేంద్ర సంస్థలను తమ చెక్కుచేతల్లో పెట్టుకుని.. ప్రతిపక్షాలపై వేధింపు రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ అరోపించింది. మునుపెన్నడూ లేని విధంగా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని అందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చేసిన నిర్వాకమే నిదర్శనంగా నిలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌. నేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి.. రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గేకు.. సమన్లు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ చర్య కాంగ్రెస్‌ను కించపరిచే ప్రయత్నమని విమర్శించారు. ఇది కాంగ్రెస్ పార్లమెంటరీ సభ్యుడితో పాటు రాజ్యసభను, పెద్దల సభ స్పీకర్‌, ప్రిసైడింగ్‌ అధికారిని కూడా అవమానించడమే అవుతుందని అన్నారు. ఇకపైనైనా ఇలాంటి చర్యలు ఆపాలన్నారు. ఈ కేసులో ఖర్గే నిందితుడు కాదని, అయినప్పటికీ విచారణకు సహకరిస్తానని ఈడీకి హామీ ఇచ్చారని జైరాం రమేశ్‌ గుర్తు చేశారు. అయితే, పార్లమెంట్‌ సమావేశాల జరుగని సమయంలో విచారణకు హాజరవుతారని చెప్పగా.. ఈడీ ఇందుకు అంగీకరించలేదు. పార్లమెంట్‌ సభ్యులను వేధింపుల నుంచి కాపాడాలని లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మన్లకు జైరాం రమేశ్‌ విజ్ఞప్తి చేశారు.

యంగ్ ఇండియా లిమిటెడ్ కార్యాలయంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం.. శోధించడం, కేసులో ఆయన స్టేట్‌మెంట్‌ను నమోదు చేసేందుకు పిలువడం వెనుక కాంగ్రెస్‌, మల్లికార్జున ఖర్గేలను కించపరచడమే ఏకైక ఉద్దేశమని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా ఎంపీల గౌరవాన్ని, సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్‌ చేశారు. ఉభయ సభల ప్రిసైడింగ్ అధికారులు సంప్రదింపులు జరిపి పార్లమెంటును, ఎంపీలను ఇలాంటి అవమానాలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles