Man turns billionaire with Rs 6,833 cr in his Demat account వారం రోజులుగా వ్యక్తి డిమాట్ అకౌంట్లో రూ.7 వేల కోట్లు.!

Man turns billionaire since a week with rs 6 833 cr in his demat account

Man becomes billionaire, Lakhisarai Man, Suman Kumar, stock marker trader, Demat bank account, Trading account, bank transaction, withdrawl, 1.5 trillion, billionaire, Barhia, lakhisarai district, Bihar News, Viral news

A person from Lakhisarai, Bihar suddenly became a billionaire. Now, getting so much money where one should get immense happiness. At this place, the problem of said person increased. The youngsters are now trying to find out from RTI where this huge sum suddenly came from in his account. He avoids withdrawing even a single rupee from his account.

వారం రోజులుగా వ్యక్తి డిమాట్ అకౌంట్లో రూ.7 వేల కోట్లు.. అధికారుల మౌనం.!

Posted: 08/08/2022 03:46 PM IST
Man turns billionaire since a week with rs 6 833 cr in his demat account

ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం డబ్బలు వచ్చినట్టు తెలుస్తుండగా, ఇప్పటికీ ఆ ఖాతాలోనే వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. దీంతో సదరు వ్యక్తి గతవారం రోజులుగా కోటీశ్వరుడిగానే ఉండిపోయాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లాలో ఓ దినసరి కూలి.. అకస్మాత్తుగా కోటీశ్వరుడైన వెంటనే.. డబ్బును ఉపసంహరించుకునేందుకు వెళ్లగా.. ఆ డబ్బును బ్యాంకు అధికారులు సీజ్ చేసిన ఘటన తెలిసిందే.

కాగా ఈ ఘటన మాత్రం బిహార్ లోని లక్కీసరాయ్ కు చెందిన సుమన్ కుమార్ కు కోటక్ సెక్యూరిటీస్ మహీంద్రా బ్యాంకులో డిమాట్ అకౌంట్ ఖాతా ఉంది. దాంతో అతను గత కోంత కాలంగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కూడా చేస్తున్నాడు. వారం రోజుల క్రితం అతడి బ్యాంకు ఖాతాలోకి రూ.6,833.42 కోట్లు వచ్చి చేరాయి. ఇటీవల ఖాతా తనిఖీ చేసుకున్న సుమన్​కు విషయం తెలిసింది. అకౌంట్లో వేల కోట్ల రూపాయలు చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు సుమన్. అయితే, డబ్బులు ఎలా వచ్చాయో తెలియడం లేదు. ఇప్పటికీ సదరు మొత్తం ఖాతాలోనే ఉంది

దీంతో తొలుత ఇది సాంకేతిక తప్పదం కారణంగా బ్యాలెన్స్ ను ఇలా చూపించిదని భావించిన సుమన్ కుమార్.. అసలు నిజమేంటో తెలుసుకునేందుకు కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి.. తన ఖాతాలో ఉన్న మొత్తాన్ని అడిగి తెలుసుకున్నాడు. డబ్బులు నిజంగానే క్రెడిట్ అయ్యాయని స్పష్టం కావడంతో అతనికి ఎక్కడలేని సంతోషం కలిగింది. అయితే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసుకునేందుకు బ్యాంకు అధికారులను అడిగినా స్పష్టత కొరవడింది. దీంతో తన అకౌంట్లోకి ఏకంగా వేల కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్న వివరాలు తెలుసుకునేందుకు ఇక సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించినా.. ఫలితం లేకపోయింది.

ఇప్పటివరకైతే సుమన్ కుమార్ ఖాతాలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి..? ఎవరు వేశారు.? అన్న వివరాలు తెలియరాలేదని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. దీనిపై తమకు పూర్తి సమాచారం అందలేదని సూర్యగఢ స్టేషన్ హౌస్ అధికారి చందన్ కుమార్ వెల్లడించారు. 'పట్నా నుంచి మాకు ఒకరు కాల్ చేసి ఈ విషయం గురించి చెప్పారు. కానీ, అధికారికంగా మాకు ఎలాంటి సమాచారం అందలేదు. బ్యాంకు అధికారులు ఈ విషయంపై మమ్మల్ని సంప్రదిస్తే ఏమైనా చెప్పగలం' అని వివరించారు. దీంతో ప్రస్తుతం వేల కోట్ల రూపాయలు ఖాతాలోనే ఉన్నాయి. పొరపాటున నగదు బదిలీ అయిందనుకున్నా.. దీనిపై ఇంతవరకు ఎవరూ పోలీసులను సంప్రదించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles