Small plane emergency landing in Swain County బిజీ హైవేపై విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..

Caught on camera plane dodges traffic makes emergency landing on busy us highway

emergency landing, pilot, Vincent Fraser, carolina highway, US highway, Swain County, emergency landing on highway, viral video, North Carolina highway, GoPro Camera, florida pilot, emergency landing, vincent fraser, fraser pilot, pilot emergency landing, north Carolina pilot, swain county landing, aero commander, cape coral pilot, florida man landing, North Carolina, US, United States, America, social media, viral video

A pilot recently made an emergency landing on a busy highway in the United States and a video from a camera placed on the wing captured the incredible moment. According to FoxNews, on July 3, pilot Vicent Fraser was flying a single-engine aircraft with his father-in-law when he was forced to land on a four-lane highway in North Carolina as his plane's engine began to fail. Taking to Facebook, the Swain County Sheriff's Office shared the footage that was taken from Mr Fraser's perspective as he made the tense landing.

ITEMVIDEOS: బిజీ హైవేపై విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. తప్పుకున్న వాహనాలు

Posted: 07/12/2022 03:38 PM IST
Caught on camera plane dodges traffic makes emergency landing on busy us highway

అది రహదారి. నిత్యం వేలాది కార్లు, ఇతర భారీ వాహనాలు వెళ్తుండే రహదారి. ఈ హైవేపై బిజీగా కార్లు వెళ్తున్నాయి. అదే సమయంలో అదే రోడ్డుపై ఓ అత్యంత భారీ వాహనం ఎదురుగా రావడం చూసి అంతా షాక్ అయ్యారు. ఏంటిదీ ఇది ఆకాశంలో విహరించాల్సిన వాహనమే కదా.. మరీ రోడ్డుపైకి ఎందుకు వచ్చింది. ఎందుకని తమకు ఇబ్బందులను కలగజేసేలా చేసిందని అందరూ భావించారు. ఈ లోగా రోడ్డుపై దిగిన ఆ భారీ వాహనం కొంత దూరం రోడ్డుపై పరుగుపెట్టి ఓ కూడలి వద్ద నిలిచిపోయింది. ఏదో సమస్య వచ్చి ఉంటుంది.. అందుకనే ఇలా రోడ్డుపై విహంగం వాలిపోయిందని కొందరు భావించారు.

మీకూ మ్యాటర్ అర్థమైపోయిందనుకుంటా.. గాల్లో ఎగరాల్సిన విమానం రోడ్డుపైకి ఎందుకు వచ్చిందా.? అనుకుంటున్నారా.? తిరుగుతున్న ఒక సింగిల్ ఇంజిన్ విమానం.. నెమ్మదిగా ఆ రోడ్డుపై ల్యాండయింది. అది చూసిన వాహనదారులు ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ విమానం నడుపుతున్న విసెంట్ ఫ్రేజర్ అనే వ్యక్తి మాజీ మరీన్. ప్రయాణంలో ఉండగా ఆ చిన్న విమానం ఇంజిన్ ఫెయిలైంది. దీంతో దాన్ని రోడ్డుపై ఎమర్జెన్సీగా దింపేయాలని ఫ్రేజర్ నిర్ణయించుకున్నాడు.

రోడ్డుపై వెళ్తున్న కార్లు, ఎత్తుగా ఉన్న ఎలక్ట్రిసిటీ వైర్లను త్రుటిలో తప్పించుకుంటూ చాకచక్యంగా విమానాన్ని రోడ్డుపై ల్యాండ్ చేశాడు. నార్త్ కరోలినాలోని స్వెయిన్ కౌంటీలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఆ సిటీ పోలీసులు.. ఆ సమయంలో ఎలక్ట్రిసిటీ వైర్లు తగిలినా, కార్లకు డ్యాష్ ఇచ్చినా ఎంతో ప్రమాదం జరిగేదన్నారు. కానీ అదృష్టవశాత్తూ ఏమీ జరగలేదని కొనియాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఫ్రేజర్ నైపుణ్యాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles