Edible oil firms to slash prices after govt nudge తీపి కబరు చెప్పిన కేంద్రం.. వంట నూనె ధర తగ్గింపు..

Cooking oil to become cheaper by rs 15 litre as centre directs firms to cut mrp immediately

Centre, Food and Public Distribution Department, Edible Oil Associations, distributors, manufacturers, refiners, price reduce, price drop, edible oils price reduced, immediate effect

The Department of Food and Public Distribution in a meeting on July 6th, 2022 has directed leading Edible Oil Associations to ensure a reduction in the MRP of edible oils by Rs. 15/- with immediate effect. The Centre also advised that the price to distributors by the manufacturers and refiners also needs to be reduced immediately so that the price drop is not diluted in any way.

తీపి కబరు చెప్పిన కేంద్రం.. వంట నూనె ధర తగ్గింపు.. తక్షణం అమల్లోకి..

Posted: 07/08/2022 06:50 PM IST
Cooking oil to become cheaper by rs 15 litre as centre directs firms to cut mrp immediately

దేశం ప్రజలకు మరీ ముఖ్యంగా మహిళలకు కేంద్రప్రభుత్వం తీపికబురు చెప్పింది. వంటనూనెల ధరలను అదుపు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్న కేంద్రం తాజాగా శుభవార్త అందించింది. ఓ వైపు డీజిల్, పెట్రోల్ సహా వంట గ్యాస్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతుంటే.. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదని మధ్యతరగతి మహిళలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి కేంద్ర ప్రభుత్వం కొంత ఊరట కల్పించే వార్తను చెప్పింది. నూనె ధరలు కూడా విపరీతంగా పెరగడంతో.. వంట నూనెల రిటైల్ ధరను లీటరుకు రూ. 15 తగ్గించింది. సవరించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని సంబంధిత మంత్రిత్వశాఖ ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ధర తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు తక్షణమే అందించాలని తయారీదారులు, రిఫైనరీలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.  దీంతో సామాన్యులకు వంటింటి  భారం నుంచి భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో రేట్లు దిగిరావడం, ఆయిల్ తయారీ కంపెనీలతో చర్చల నపథ్యంలో వంట నూనె ధరలు దిగి వచ్చాయి. కాగా వినియోగదారుల వ్యవహారాల శాఖ అందించిన సమాచారం ప్రకారం జూన్ 1 నుంచి దేశంలో ఆవ, పొద్దు తిరుగుడు, సోయాబీన్, పామాయిల్  రిటైల్ ధరలు 5-11 శాతం తగ్గాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles