Two-headed snake photos go viral online అత్యంత అరుదైన రెండు తలల సరీసృపం.. నెట్టింట్లో ఫోటోలు వైరల్..!

Double take two headed snake photos go viral online netizens amused

Rare Two Headed Snake, Southern Brown Egg eater, local snake rescuer Nick Evans, Two-headed snakes, Nick Evans, Durban, coastal city, KwaZulu-Natal province, South Africa, viral pics

In all the years Evans has worked with snakes, this marked the first time he'd come across a two-headed one. As someone with a lifelong passion for reptiles, he jumped at the opportunity to retrieve the unusual animal. After collecting the snake, Evans was able to quickly identify it as a harmless southern brown egg-eater

అత్యంత అరుదైన రెండు తలల సరీసృపం.. నెట్టింట్లో ఫోటోలు వైరల్..!

Posted: 07/02/2022 03:49 PM IST
Double take two headed snake photos go viral online netizens amused

భూమిపైన ఉన్న జంతుజాలంలో మనకు కనబడనవాటినే మనం గుర్తిస్తాం. కానీ మనకు తెలియని ఎన్నోరకాల జీవచరాలు భూమిపై ఉన్నాయన్న విషయం మీకు తెలుసా.? ఇక మనకు తెలిసిన వాటిలోనూ ఎన్నో అరుదైన జీవులు వున్నాయని, వాటిని ఇప్పటివరకు అత్యంత తక్కువ మంది మాత్రమే వీక్షించారని మీకు తెలుసా.? ఇలాంటి అరుదైన జీవరాశులు ఇప్పడు కనిపిస్తే.. ఏముందీ.? ఓ రెండు దశాబ్దాల క్రితం అయితే ఏమో కానీ.. ఇప్పుడైతే సోషల్ మీడియా ఫుణ్యమా అని ఆ అరుదైన జీవి ఫోటోలు, వీడియోలను మనం మన ఫోన్లోనే విక్షించే వెసలుబాటు కలిగింది.

ఇంతకీ ఇప్పుడు కనిపించిన ఈ అరుదైన జీవరాశి ఏదీ.? అంటారా.. సరీసృపం.. ఇందులో వింతేముంది మనకు కూడా చాల రకలా పాములు కనిపిస్తుంటాయి అంటారా.? అయితే ఈ పాములు కొంత స్పెషల్. నిజంగా.. ఇవి సంయోగ పాము. అవిభక్త కవలలు మాదిరిగా ఒకే తలతో ఉన్న రెండు పాముల గురించి మేము చెప్పడం లేదు.. అయితే సంయోగ దేహంతో రెండు తలలు విడిగా ఉన్న వింత పాము గురించి తెలుసా..? ఇప్పుడు మేము చెప్పబోతున్నది ఈ పాము గురించే. ఈ పాము ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్ మారాయి. ఇంతకీ ఇది కూడా మార్పింగ్ ఫోటోనా లేక నిజమైనదేనా.? ఇలా కూడా పాములు ఉంటాయా.? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయా.?

ఇది నిజమైన సరీసృపమే. ఇది ఓ వ్యక్తి గార్డెన్ లోకి కనిపించగా.. ఆయన దానిని చూసి బెదిరిపోయి.. దానిపై ఓ కూజను పెట్టి వెంటనే స్థానికంగా పాములను పట్టుకుని నిక్ ఈవాన్స్ అనే వ్యక్తికి కబురుపెట్టారు. తన గార్డెన్లో రెండు తలల పాము వచ్చిందని తెలిపాడు. దీంతో ఆయన అక్కడికి వెళ్లి దానిని పరిశీలించి అది హానీకారక (విషపూరిత) పాము కాదని గ్రహించి మెళ్లిగా పట్టుకున్నాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందంటే.. ద‌క్షిణాఫ్రికాలో. ఈ దేశంలోని క్వాజులు-నాటల్ ప్రావిన్స్‌లోని తీరప్రాంత నగరమైన డర్బన్‌కు ఉత్తరాన 60కిమీ దూరంలో ఉన్న నడ్వెడ్వేకి చెందిన ఒక వ్యక్తి గార్డెన్ లో ఈ పాము దర్శనమిచ్చింది.  

పాముల సంర‌క్ష‌కుడు నిక్ ఎవాన్స్ ఈ రెండు త‌ల‌ల సదరన్ బ్రౌన్ ఎగ్-ఈటర్ సరీసృపాన్ని పట్టుకుని.. దాని ఫొటోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. ఓ వ్య‌క్తి త‌న గార్డెన్‌లో ఈ పాము క‌నిపించ‌గా ప‌ట్టుకునేందుకు త‌న‌ను పిలిచాడ‌ని, తీరా వెళ్లి చూస్తే ఈ అరుదైన పాము క‌నిపించింద‌ని నిక్ తెలిపాడు. ఇది హానిచేయ‌ని జాతి అని, చాలా అరుదైన‌ద‌ని పేర్కొన్నాడు. ఈ పామును సీసాలో బంధించి తీసుకొచ్చిన‌ట్లు తెలిపాడు. ఈ వికృత‌మైన పామును చూడ‌డం చాలా వింత‌గా అనిపించింద‌ని, దీని త‌ల‌లు ఒక‌దానికొక‌టి వ్య‌తిరేక దిశ‌లో వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని చెప్పాడు. ప్ర‌స్తుతం దీన్ని తానే సంర‌క్షిస్తున్న‌ట్లు తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles