Case on CI Kambagiri Ramudu in his Police Station దిమ్మదిరిగే షాకిచ్చిన ఎస్పీ.. సీఐ స్టేషన్లోనే కేసు..

Kurnool sp suspended taluka ci kambagiri ramudu on corruption charges

ci corruption in kurnool, corrupted ci in kurnool, kurnool latest news, latest news in kurnool, kurnool taluka ci , latest crime news in kurnool, kurnool crime news, Panchalingala Check Post,Kurnool Circle Inspector flees with money, Kurnool Circle Inspector flees, Kurnool inspector case, Kurnool Taluka Circle police station, Satish Balakrishnan 15 lakh, Kurnool Circle Inspector flees with ₹15 lakh, Kurnool funny, Kurnool news, Kurnool Superintendent of Police, Panchalingala news, are cops criminals, is police criminal, Taluk police station, Kurnool, Andhra Pradesh, Crime

The Kurnool police on March 25 began a search for Kurnool Taluka Circle Inspector (CI) of Police Kambagiri Ramudu, who allegedly took away ₹15 lakh out of ₹75 lakh confiscated at Panchalingala Check Post on the city outskirts four days ago from a Tamil Nadu-based person identified as Satish Balakrishnan.

ITEMVIDEOS: సిఐకి దిమ్మదిరిగే షాకిచ్చిన ఎస్పీ.. పనిచేసిన ఠాణాలోనే నిందితుడిగా కేసు..

Posted: 03/25/2022 08:28 PM IST
Kurnool sp suspended taluka ci kambagiri ramudu on corruption charges

చేతివాటం ప్రదర్శించే కళ ఉన్నవారు కొందరున్నారు. అయితే వీరిని కూడా మించిన స్థాయిలో నాజుక్కా హస్తలాఘవం ప్రదర్శించిన ఓ సర్కిల్ ఇన్స్ పెక్టరుకు జిల్లా పోలీసు ఉన్నతాధికారి దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. ఇంతకీ చేతివాటం ప్రదర్శించే వారు పిక్ పాకెటర్స్. మరోలా చెప్పాలంటే దొంగలు. అయితే వీరిని మించిన స్థాయిలో తన హస్తలాఘవాన్ని ప్రదర్శించిన వ్యక్తి ఎవరో కాదండీ ఏకంగా పోలీసు. అది సర్వసాధారణ పోలీసు హోంగార్డో.. కానిస్టేబుల్, హెడ్డో కూడా కాదండీ.. ఏకంగా తన స్టేషన్లోని ఏఎస్ఐలు, ఎస్ఐలకు కూడా ఆయన పెద్ద. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ స్టేషనే ఆయనే బాస్.

ఇలాంటి వ్యక్తి ఏకంగా ఓ వ్యక్తికి చెందిన డబ్బును తన డబ్బుగా మార్చేసి.. స్వాహా అనిపించాడు. ఇంతకీ ఎవరాయన.? అంటే అయనే ఆ స్టేషన్ కు సర్కిల్ ఇన్స్ పెక్టర్. ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా ఉండేందుకు.. తన జిల్లాలోని పోలీసులు అందరికీ ఓ గుణపాఠాం చెప్పేందుకు ఏకంగా కర్నూలు జిల్లా ఎస్పీ చక్కటి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇక సిఐ పరారీలో ఉన్నారు. అదెలా అంటే డబ్బులు నోక్కేసిన తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ కంబగిరి రాముడుపై.. అదే స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ విధంగా తాను సిఐగా పనిచేసినే చోటే నిందితుడిగా మారడంతో ఆయన పరారీలో వున్నారు.

ఇక ఈ విషయం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల 19న పంచలింగాల చెక్ పోస్టు వద్ద సెబ్ అధికారులు హైదరాబాద్ నుంచి తమిళనాడు వెళ్తున్న బస్సును ఆపి తనిఖీ చేశారు. తమిళనాడుకు చెందిన సతీశ్ బాలకృష్ణన్ అనే ప్రయాణికుడి వద్ద 75 లక్షల రూపాయలు దొరికాయి. సెబ్ అధికారులు డబ్బుతోపాటు అతన్ని కర్నూలు తాలూకా అర్బన్ పోలీసు స్టేషన్ కు అప్పగించారు. డబ్బుకు సంబంధించిన పత్రాలు అప్పుడు తనవద్ద లేకపోవడంతో.. సతీష్ డబ్బు తనదేనని నిరూపించుకునే అధారాలతో వచ్చి సెబ్ అధికారులకు చూపించాడు. దీంతో వారు డబ్బును రిలీజ్ చేయాలని లేఖను జారీ చేశారు.

దీంతో సదరు లేఖను కర్నూలు తాలుకా పోలిస్ స్టేషన్లోని సిఐ కంబగిరి రాముడుకు చూపించగా, ఆయన మొత్తం సొమ్ము తిరిగి ఇవ్వకుండా.. జిల్లా ఎస్పీకి ఇవ్వాలంటూ 15 లక్షల రూపాయలు బలవంతంగా తీసుకున్నాడు. దీంతో బాధితుడు నేరుగా వెళ్లి జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డిని కలిశారు. తనకు జరిగిన విషయాన్ని చెప్పారు. తనకు తన రూ.15 లక్షలు ఇప్పించాలని కోరాడు. దీంతో తాలుకా పోలీస్ స్టేషన్లో సీఐపై కేసు నమోదు చేసి.. కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించారు. బాధితుడు సతీశ్ బాలకృష్ణన్ ఫిర్యాదు మేరకు సీఐతోపాటు ముగ్గురు మధ్యవర్తులపైనా కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ పరారీలో ఉన్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles