Change INC's name to Federation of Congress: PM Modi ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

If there was no congress pm modi attacks grand old party in rajya sabha

narendra modi, congress, PM Modi Congress, budget session, congress, rajya sabha, parliament, motion of thanks, pm narendra modi, corona congress parliament, motion of thanks, National, Politics

Prime Minister Narendra Modi continued his tirade against Congress in the Parliament as he spoke in the Rajya Sabha on the President's address. Tearing into the Congress, he said dynastic parties are the biggest threat to democracy. He also suggested that the grand old party to change its middle name from 'national' to 'federal' in response to Rahul Gandhi's speech in Lok Sabha.

కాంగ్రెస్ పై ప్రధాని నిప్పులు.. రాష్ట్ర విభజనపై మోడీ కీలక వ్యాఖ్యలు

Posted: 02/08/2022 04:08 PM IST
If there was no congress pm modi attacks grand old party in rajya sabha

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన జరిగిన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఎనమిదేళ్ల క్రితం జరిగిన రాష్ట్ర పునర్విభజనపై గతంలోనే ఓ పర్యాయం సభలో అవేదన వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్రమోడీ మరోమారు అదే అంశాన్ని ప్రస్తావించి కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ తీరును ఎండగట్టారు. ఈ క్రమంలో ఏపీ విభజన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. తెలంగాణ ఏర్పాటుకు తమ పార్టీ వ్యతిరేకం కాదన్న ప్రధాని.. చర్చలతో సజావుగా విభజన జరిగి వుండాల్సిందని అన్నారు.

బీజేపి నేతృత్వంలో అటల్ బిహారీ వాజ్‌పేయీ హయాంలో అప్పటి ఎన్డీయే ప్రభుత్వం కూడా 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసిందని, అయితే అందరూ శాంతియుతంగా కలిసి కూర్చుని, చర్చించి ఆ రాష్ట్రాల ఏర్పాటు బిల్లులను పాస్‌ చేశారు. కానీ ఏపీ, తెలంగాణ విషయంలో అలా జరగలేదని అన్నారు. నాడు కాంగ్రెస్‌ హయాంలో సభలో మైకులు ఆపేసి.. పెప్పర్‌ స్ప్రే కొట్టి.. డోర్లు మూసి.. రాష్ట్ర విభజన చేశారన్నారు, విభజన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయి. కాంగ్రెస్‌ అహంకారం, అధికార కాంక్షకు ఇదే నిదర్శనమని ప్రధాని అన్నారు. విభజన సరిగ్గా జరిగి ఉంటే రెండు రాష్ట్రాలకు సమస్యలు వచ్చేవి కావని మోదీ దుయ్యబట్టారు.

అదే సందర్భంగా కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలు భారత దేశ ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు అని ప్రధాని అన్నారు. ఏ రాజకీయ పార్టీలోనైనా కుటుంబానికే అధిక ప్రాధాన్యం కల్పించడంతో.. ఆ స్థానాన్ని అక్రమించాల్సిన ప్రతిభవంతులకు అతిపెద్ద నష్టం వాటిల్లుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే దేశ ప్రజలు నీరు, విద్యుత్‌, రోడ్ల వంటి కనీస సదుపాయాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది కాదంటూ విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన అలాంటి పార్టీ నుంచి తాము నేర్చుకునేది ఏమీ లేదంటూ ఎద్దేవా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles