Police protection given to Dalit man's wedding procession పోలీసుల ప‌హారాలో పెళ్లి బారత్.. గుండాల బెదిరింపులకు వరుడి సవాల్

Dalit groom takes out wedding procession under police watch in madhya pradesh

Dalit groom wedding, Madhya Pradesh, Manasa, Police guard, Bhimrao Ambedkar Sahib, Constitution of India, Dalit groom, cops guard Dalit groom, Dalit groom rides horse to wedding, Sarsi village, 100 cops protect Dalit groom, Neemuch, Madhya Pradesh, Crime

Nearly 100 policemen stood guard and protected a Dalit bridegroom, who wanted to ride a horse to his wedding, and ensured there was no trouble or objection from upper caste people in Neemuch district, police said. Police personnel did a flag march before the wedding procession of Rahul Meghwal, a resident of Sarsi village of the district.

పోలీసుల ప‌హారాలో పెళ్లి బారత్.. గుండాల బెదిరింపులకు వరుడి సవాల్

Posted: 01/29/2022 01:18 PM IST
Dalit groom takes out wedding procession under police watch in madhya pradesh

ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ద‌ళిత ఆధిపత్య చర్యలు అప్పుడప్పుడు వార్తల్లో కూడా నిలుస్తుంటాయి. అగ్రవర్ణాలకు చెందిన పలువురు గ్రామంలో తమ అధిపత్యం నిత్యం కనబరుస్తూనే ఉంటారు. అలాంటి పెద్దలతో పాటు వారి ప్రేరణతో రెచ్చిపోయే గుండాలకు ఓ దళిత వరుడు సవాల్ విసిరాడు. తన పెళ్లి ఊరేగింపును అడ్డుకోవాలని సవాల్ విసిరి.. వారి చర్యలను చెక్ పెట్టాడు. దళిత వర్గాలు పెళ్లి ఊరేగింపును అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించి, వ‌రుడిని గుర్రంపై ఊరేగిస్తే ఏడాది కాలం పాటు గ్రామం నుంచి బ‌హిష్క‌రిస్తామ‌ని గూండాలు హెచ్చ‌రికలను తోసిరాజుతూ గుర్రంపై ఊరేగింపు నిర్వహించాడు. అయితే అందుకు పోలీసులు రక్షణగా నిలవడం కొసమెరుపు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని నీముచ్ జిల్లా స‌ర్సి గ్రామానికి చెందిన రాహుల్ మేఘ్వాల్ జ‌న‌వ‌రి 27న పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లిని ఘ‌నంగా నిర్వ‌హించొద్ద‌ని, గుర్రపు స్వారీ చేయొద్ద‌ని గూండాలు ఆదేశించారు. ఒక‌వేళ నిర్వ‌హిస్తే ఏడాది కాలం పాటు గ్రామం నుంచి బ‌హిష్క‌రిస్తామ‌ని హెచ్చ‌రించారు. దీంతో రాహుల్, ఆయ‌న తండ్రి జిల్లా క‌లెక్ట‌ర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. త‌మ కుమారుడి వివాహానికి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని రాహుల్ తండ్రి ఫ‌కీర్‌చంద్ మేఘ్వాల్ అధికారుల‌కు విజ్ఞ‌ప్తి చేశాడు. దీంతో క‌లెక్ట‌ర్ స్పందించి.. రాహుల్ పెళ్లికి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని పోలీసులను ఆదేశించారు. ఇక మూడు పోలీసు స్టేష‌న్ల పోలీసులు రాహుల్ పెళ్లికి ర‌క్ష‌ణ క‌ల్పించారు.

డీజే సౌండ్లు, డ్యాన్సుల మ‌ధ్య గుర్రంపై వ‌రుడిని ఊరేగించారు. ఈ పెళ్లికి పోలీసు ఉన్న‌తాధికారుల‌తో పాటు త‌హ‌సీల్దార్, ఎస్‌డీవోపీ, ఎస్‌డీఎం హాజ‌ర‌య్యారు. గ్రామ‌స్తులు కూడా చాలా వ‌ర‌కు స‌హ‌క‌రించారు. ఇక పెళ్లి కుమారుడు రాహుల్ గుర్రంపై వెళ్తున్న స‌మ‌యంలో త‌న చేతిలో అంబేద్క‌ర్ ర‌చించిన భార‌త రాజ్యాంగాన్ని ఉంచి ప్ర‌ద‌ర్శించారు. అంతకుముందు, సాగర్ జిల్లా గనియారి గ్రామంలో కొందరు గ్రామస్థులు గుర్రపు స్వారీ చేసినందుకు దళిత వరుడు దిలీప్ అహిర్వార్ ఇంటిపై దాడి చేశారు. అహిర్వార్ పోలీసు రక్షణలో రాచ్ అని పిలిచే వివాహ ఊరేగింపులో గుర్రంపై ప్రయాణించాడు, కాని తరువాత రాత్రి; దాదాపు 20 మంది అతని ఇంటిపై దాడి చేసి రాళ్లు రువ్వారు. పోలీసులు 20 మందిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ యాక్టులోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారిలో ఆరుగురిని అరెస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles