Stand-off continues in Andhra over employees’ PRC కొనసాగుతున్న ఉద్యోగుల అందోళనలు.. మంత్రుల కమిటీకి లేఖ..

Andhra prc row employees up in arms writes letter to ministers committee

Andhra Pradesh government, government employees, pay revision, protest intensifies, employees unions, five member minister committee, Andhra Pradesh, PRC Row

The stand-off between Andhra Pradesh government and employees over pay revision continued as the latter turned down another invitation for talks and intensified their protest. The employees’ unions rejected the fresh offer of talks by a five-member committee constituted by the government to hold talks to resolve the contentious issue.

కొనసాగుతున్న ఉద్యోగుల అందోళనలు.. మంత్రుల కమిటీకి లేఖ..

Posted: 01/25/2022 03:09 PM IST
Andhra prc row employees up in arms writes letter to ministers committee

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వఉద్యోగ, ఉపాధ్యాయుల ఆందోళ‌నలు కొన‌సాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు ఆందోళన చేస్తున్న విష‌యం తెలిసిందే. పీఆర్సీ అర్థాన్ని మార్చివేసి జీవోలను తీసుకువచ్చి.. రాష్ట్ర అభివృద్దిలో అహర్నిశలు కష్టపడుతున్న ఉద్యోగుల కడుపు కోట్టడం ఎంతవరకు సమంజసమని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. పీఆర్సీ వచ్చిందంటే వేతనాలు పెరుగుతాయని, కానీ వైఎస్సార్ సిపీ ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీతో తమ వేతనాలు తిరోగమనంలో పయనిస్తున్నాయని ఉద్యోగులు విమర్శల పర్వానికి కూడా దిగిన విషయం తెలిసిందే. దీంతో ఉధ్యోగ, ఉపాధ్య సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అందోళనలు నిర్వహిస్తున్నా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఉద్యమాలను మరింత ఉదృతం చేస్తున్నారు.

ఇప్ప‌టికే ప్రభుత్వానికి సమ్మె నోటీసు కూడా ఇచ్చారు. ఉద్యోగులు ఫిబ్ర‌వ‌రి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్న నేప‌థ్యంలో ఈ రోజు మధ్యాహ్నం సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులకు మంత్రుల కమిటీ ఆహ్వానం పంపింది. అయితే, మంత్రుల కమిటీ భేటీకి కూడా వెళ్ల‌బోమ‌ని ఉద్యోగ సంఘాల నేతలు స్ప‌ష్టం చేశారు. పీఆర్సీ జీవోల రద్దుతో పాటు మిశ్రా కమిటీ నివేదికకు బహిర్గతం చేయాలని, పాత పద్ధతిలోనే జీతాలు ఇవ్వాలని, అలా అయితేనే చర్చలకు వెళ్తామని స్పష్టం చేస్తున్నాయి. అయితే ఉద్యోగులు నూరు శాతం ప్రభుత్వంలో భాగమేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో అటు హైకోర్టులోనూ ఉద్యోగ సంఘాలకు ఎదురుదెబ్బ తగిలింది.

కాగా, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంఘాలు క‌లిపి పీఆర్సీ స్ట్రగుల్‌ కమిటీగా ఏర్పడినట్లు ఇప్ప‌టికే ఉద్యోగులు చెప్పారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ నేడు అన్ని జిల్లాల కేంద్రాల్లో ఉద్యోగులు ధ‌ర్నాలు చేస్తున్నారు. విజ‌య‌వాడ పాత బ‌స్టాండ్ నుంచి ధ‌ర్నా చౌక్ వ‌ర‌కు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వ‌హించారు. పీఆర్సీకి సంబంధించి అధికారుల కమిటీ ఉద్యోగుల అభిప్రాయాలను, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే ప్ర‌భుత్వం జీవోలు జారీ చేసింద‌ని అంటున్నారు. ఈ జీవోలు జారీ చేయడంతో తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పారు. ఇప్ప‌టికే తాము నిరసన కార్యక్రమాలకు ప్రణాళికలు రచించామని తెలిపారు. నిరవధిక సమ్మెకు వెళ్తామ‌ని హెచ్చ‌రించారు. ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా వెన‌క్కి త‌గ్గి త‌మ గురించి ఆలోచించాల‌ని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles