Reinfections up as Covid cases surge in Hyderabad ప్రతీ ముగ్గురిలో ఒకరకి కరోనా రీ-ఇన్ఫెక్షన్ కేసులు

Reinfections up as covid cases surge in hyderabad

Omicron, Delta, Deltacron, reinfections, Covid-19, fully vaccinated, third wave surge, Prakash Mantripragada, second infection, RT-PCR test, Rekha Sharma, Dr Rajiv Singhal, Care hospitals CEO, Dr Anurag Agrawal, director, Institute of Genomics and Integrative Biology, Dr Pradeep Panigrahi, SLG Hospitals. Hyderabad, Telangana

As the third wave surges, an estimated 20-25% cases detected in the city are reinfections in people who had tested positive for Covid-19 either in the first or second wave. Reinfections are occurring across age groups and also in those fully or partially vaccinated.

కరోనా రీ-ఇన్ఫెక్షన్ కేసులు: హైదారబాదులో ప్రతీ ముగ్గురిలో ఒకరు ఇదే బాట

Posted: 01/19/2022 12:05 PM IST
Reinfections up as covid cases surge in hyderabad

కరోనా మూడో విడత నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా వుండాలని వైద్యు నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. కరోనా తోలి, రెండో దశలో దాని బారిన పడిన వారిలో యాంటీబాడీలు ఉంటాయని, దీంతో వారు మరలా కరోనా బారిన పడరని వచ్చిన కొన్ని వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇప్పటికే అద్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మరీముఖ్యంగా హైదరాబాద్ లో వెలుగు చూస్తున్న కొత్త కేసుల్లో ప్రతి మూడింటిలో ఒకటి గతంలో ఇన్ఫెక్షన్ బారిన పడి, మళ్లీ ఇన్ఫెక్షన్ కు గురైనవే (రీ ఇన్ఫెక్షన్) ఉంటున్నాయి. రెండు డోసుల కరోనా టీకా తీసుకున్నవారు కూడా మరోమారు కరోనా బారిన పడటం అందోళనకరం.

మొదటి లేదా రెండో విడతలో కరోనా బారిన పడిన వారు మళ్లీ వైరస్ కోరల్లో చిక్కుకుంటున్నట్టు తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయితే తొలి, రెండవ దశలో కరోనా నుంచి కోలుకునేందుకు అధిక సమయం పట్టిందని, దీంతో పాటు అసుపత్రులలో చేరాల్సి వచ్చిందని.. ఇక లక్షణాలు కూడా తీవ్రంగా ఉండేవి. కాగా, మూడవ విడతలో ఎక్కువ మందిలో లక్షణాలు లేకపోవడం, ఉన్నా కానీ, స్వల్పంగా కనిపిస్తుండటం ఆశాజనకం. కరోనా రెండో విడతలో ఇన్ఫెక్షన్ బారిన పడిన ఓ వ్యక్తి కోలుకునేందుకు నెల పట్టింది. కానీ, ఇప్పుడు పాజిటివ్ గా మరోసారి వచ్చినా లక్షణాలు ఏవీ లేవని తెలిపాడు. మరో గృహిణి సైతం ఐదు నెలల విరామంతో రెండోసారి కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు.

దీనిపై కేర్ హాస్పిటల్స్ గ్రూపు సీఈవో రాజీవ్ సింఘాల్ స్పందిస్తూ.. ‘‘మా ఆసుపత్రులకు వచ్చే కేసుల్లో కరోనా రీఇన్ఫెక్షన్ కేసులు 20-25 శాతంగా ఉంటున్నాయి. ఎక్కువ కేసుల్లో స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయి. వారికి ఔట్ పేషెంట్ గానే చికిత్స అందిస్తున్నాం’’ అని చెప్పారు. ఇప్పటికీ డెల్టా కేసులు వస్తూనే ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ‘‘రీ ఇన్ఫెక్షన్ కేసులు గణనీయంగానే వస్తున్నాయి. చాలా  వరకు పురోగతి ఇన్ఫెక్షన్ కేసులు కనిపిస్తున్నాయి. ఇన్ఫెక్షన్ బారిన పడకుండా రెండు డోసుల టీకా తీసుకున్న వారు సైతం.. ఇప్పుడు ఇన్ఫెక్షన్ కు గురి అవుతున్నారు. 30 శాతం మేర ఇవే కేసులు ఉంటున్నాయి’’ అని ఎస్ఎల్జీ హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ ప్రదీప్ పాణిగ్రాహి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles