బిజినెస్ టైకూన్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా నిత్యం సామాజిక మాద్యమాల్లో యాక్టివ్ గా ఉంటారు. ఏదేని వీడియోనో, లేదా ఫోటోలు తన అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంటూ తన ఫాలోవర్స్ తో ఔరా.. అనిపించేలా చేస్తారు. ఇక తన మదిని గెలుచుకున్న వీడియోలు.. ఫోటోలకు కూడా మంచి క్యాప్షన్ పెట్టి మరీ షేర్ చేస్తారు. ఇక భారత దేశానికి ఎనలేని గుర్తింపును తీసుకువచ్చిన ప్రముఖులకు తన మహీంద్రా కార్లను కానుకలుగా అందించి అందరి మొప్పును కూడా పోందుతుంటారు. ఇక ఆయన మదిని ఎప్పుడు ఏ వీడియో, ఫోటో దోచుకుంటుందోనని ఫాలోవర్లు కూడా కాచుకుని చూస్తుంటారు.
అదేంటి అలా అంటారు.. అంటే ఆయన త్వరగా చలించే హృదయం గల వ్యక్తి. ఈ క్రమంలోనే ఆయన నుంచి సర్ ప్రైజ్ పోందినవారు చాలా మందే ఉంటారు. అవతలివారి కష్టాన్ని గుర్తించడమే కాదు.. వారి తపన, దీక్ష, పట్టుదల నచ్చిన నేపథ్యంలో ఆయన ఒక్కోసారి కానుకలు కూడా ఇచ్చేస్తుంటారు. అలా ఇప్పుడు ఓ సామాన్యుడికి బంపరాఫర్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ మహీంద్రా ఆఫర్ ఇచ్చింది ఓ పేద కమ్మరికి!. తన టాలెంట్‌కు పదునుపెట్టి పాత సామాన్లతో ఫోర్ వీలర్ ను తయారు చేశాడతను. అసమాన్యమైన ఆ ప్రతిభకు, సృజనాత్మక ఆవిష్కరణకు ఆనంద్ మహీంద్రా ఫిదా అయిపోయారు.
అందుకే ఆ వీడియోను షేర్ తన ట్విటర్లో షేర్ చేశారు. అందులో ఆ కారు ఎలా పని చేస్తుందో కూడా వివరంగా ఉంది. పనిలో పనిగా ఆ వ్యక్తి తయారు చేసిన వాహనం తీసుకుని.. తన కంపెనీ తరపున బొలెరో వాహనాన్ని ఇవ్వాలని ఫిక్సయ్యారు ఆనంద్ మహీంద్రా. ‘‘ఇది నిబంధనలకు అనుగుణంగా లేకపోవచ్చు. కానీ తక్కువ వనరులతో ఎక్కువ ఫలితాన్ని చూపెట్టే మన ప్రజల చాతుర్యాన్ని మెచ్చుకోకుండా నేను ఉండలేను’’.. అంటూ ట్విటర్ వేదికగా పెద్దగా చదువుకోని ఆ ‘ఇంజినీర్’పై ప్రశంసలు గుప్పించాడు.
హిస్టోరికానో యూట్యూబ్ ఛానెల్ ప్రకారం.. ఆ ఆవిష్కరణ చేసిన వ్యక్తి పేరు దత్తాత్రేయ లొహార్. ఊరు మహారాష్ట్రలోని దేవ్రాష్ట్రే గ్రామం. పాత, పాడుబడ్డ కార్ల నుంచి పార్ట్‌లను సేకరించి ఈ ప్రయత్నం చేశాడు. పాత సామాన్లను చేర్చి ఆ వాహనం చేయడానికి అతను 60 వేల రూపాయల అప్పు కూడా చేశాడు. టూవీలర్స్‌లోని మెకానిజంతో ఈ బండిని తయారు చేయడం విశేషం. పేద కుటుంబమే అయినప్పటికీ కేవలం కొడుకు ముచ్చట తీర్చడానికే చేశాడట! మరి ఆనంద్ మహీంద్రా ఇచ్చిన ఆఫర్‌ను దత్తూ స్వీకరిస్తాడా? లేదా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
This clearly doesn’t meet with any of the regulations but I will never cease to admire the ingenuity and ‘more with less’ capabilities of our people. And their passion for mobility—not to mention the familiar front grille pic.twitter.com/oFkD3SvsDt
— anand mahindra (@anandmahindra) December 21, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more