AAP MP Bhagwant Mann alleges BJP tried to lure him బీజేపి డబ్బు, కేంద్రమంత్రి పదవితో ప్రలోభపెట్టింది: అప్ ఎంసీ అరోపణ

Aap punjab mp says bjp leader offered him money cabinet seat to join party

AAP MP Bhagwant Mann alleges BJP tried to lure him with money, Bhagwant Mann alleges BJP offered him cabinet rank, AAP MP alleges BJP tried to lure him with money, Bhagwant Mann, AAP Member of Parliament, Aravind Kejriwal, BJP Punjab, Bhagwant Mann accuses BJP of poaching, Punjab, Politics

Punjab Aam Aadmi Party president Bhagwant Mann claimed a senior BJP leader offered him money and a place in the Union Cabinet to join their party ahead of the state assembly polls next year. The Sangrur MP hit out at the BJP for "horse-trading" and asserted that he could not be bought. The BJP has rubbished these allegations and challenged Mr Mann to publicly reveal the name of the leader he is referring to.

బీజేపి డబ్బు, కేంద్రమంత్రి పదవితో ప్రలోభపెట్టింది: అప్ ఎంసీ అరోపణ

Posted: 12/06/2021 05:59 PM IST
Aap punjab mp says bjp leader offered him money cabinet seat to join party

పంజాబ్ అసెంబ్లీకి మరికొన్ని వారాల్లో ఎన్నికలకు వెళ్లనుంది. ఈ క్రమంలో అక్కడ రాజకీయం ఇప్పటికే వేడెక్కింది. ఓ వైపు బీజేపి.. మరోవైపు అకాళీదళ్, ఇంకో వైపు కెప్టెన్ అమరీందర్ సింగ్. వీరితో పోటీ పడుతూ అప్ కూడా రంగంలో దిగి ఇప్పటికే ప్రచార పర్వాలను నిర్వహిస్తున్నాయి. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం.. ఈ సారి కూడా పంజాబ్ కోటపై విజయబావుటా ఎగురవేసేది తామేనంటూ భీష్మించుకుని కూర్చుంది. ఈ క్రమంలో బలమైన పార్టీలను దెబ్బకొట్టాలని పథక రచనలు కూడా సాగుతున్నాయి. ఇందుకోసం ప్రజల ముక్కుపిండి పన్నుల రూపంలో వసూళ్లు చేసిన డబ్బును అప్పనంగా నేతలకు అందించి.. తమ పార్టీలోకి వచ్చేలా ఆపర్ల వర్షం కూడా కురిపించడం కామన్.

రైతుల అంశాల్లో బీజేపితో విభేధించిన అకాళీదళ్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో ఒంటిరిగా తనకు అనుకున్నంత బలం లేకపోవడంతో బీజేపి పంజాబ్ ఎన్నికలలో ఎలా పావులు కదపాలో కూడా తెలియని అయోమయస్థితిలోకి జారుకుంది. ఈ క్రమంలో పంజాబ్ కాంగ్రెస్ కు అన్నీ తానై వ్యవహరించిన ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీ పదవీచ్యుతిడిని చేసిన వెంటనే పార్టీకి రాంరాం పలికిన ఆయన కొత్త పార్టీని పెట్టి.. బీజేపికితో జతకలసి పోరాడుతున్న విషయం కూడా తెలిసిందే.

అయితే అంచనాలు ముందే తెలుసుకన్న బీజేపి.. అమరీందర్ తమతో జతకట్టినా.. లాభం ఉండకపోవచ్చునని అంచనా వేసింది. దీంతో ఇతర పార్టీలలో పలుకుబడి కలిగిన నేతలను తమ పార్టీలోకి లాగేందుకు యత్నిస్తున్నారు. అదేనండీ అపరేషన్ కమలాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ రాష్ట్ర ప్రజలపై ఎన్నికల హామీలను కురిపిస్తున్నారు. తమ పార్టీ ఎన్నికలలో గెలిస్తే విద్యుత్ సహా పలు విషయాల్లో రాయితీలను ప్రకటిస్తున్నారు. తాను మాటల మనిషిని కాదని, ఢి్లిలో చేసిన చూపించిన తరహాలోనే ఇక్కడా కూడా అమలు చేసి చూపిస్తానని ఉద్ఘాటిస్తున్నారు.

దీంతో ఆ పార్టీని బలహీనం చేయడానికి బీజేపి వేసిన ఎత్తుగడ పారలేదు. ఆప్ పార్టీకి మూలస్థంబంగా వున్న పంజాబ్ అప్ రాష్ట్రశాఖ అధ్యక్షుడు భగవంత్ మాన్ ను ప్రలోభాలకు గురిచేసిన బీజేపి.. ఆయనను తమ పార్టీలోకి మళ్లించుకోగలిగితే.. పంజాబ్ లో అమరీందర్ తో కలసి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవచ్చునని కూడా పథకరచన చేసింది. కానీ తానొకటి తలిస్తే.. భగవంతుడు మరోటి తలుస్తాడన్న నానుడిలా మారింది బీజేపి పరిస్థితి. ఇక ముక్కుసూటి మనత్తత్వం గల భగవంత్ మాన్ తనను బీజేపిలోకి లాగేందుకు ప్రయత్నాలు కొనసాగాయని చేసిన అరోపణలు పంజాబ్ లో బీజేపిని నడివీధిలో నిలబెట్టింది.

ఎంపీ భగవంత్ మాన్ బీజేపీపై చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. నాలుగు రోజుల క్రితం బీజేపీ సీనియర్ నేత నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని చెప్పిన ఆయన.. ఆప్‌ను వదిలేసి బీజేపీలో చేరితే భారీగా నగదుతోపాటు కేంద్రమంత్రి పదవి కూడా ఇస్తామని చెబుతూ ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ‘‘మాన్ సాబ్, బీజేపీలో చేరడానికి ఎంత తీసుకుంటారు? మీకు డబ్బు కావాలా?’’ అని ఆయన నేరుగా అడిగేశారని భగవంత్ మాన్ విలేకరులకు తెలిపారు. ఆ నేత ఆఫర్‌ను తాను తిరస్కరించినట్టు చెప్పారు. తానో మిషన్‌పై రాజకీయాల్లోకి వచ్చానని, తనను డబ్బుతో కొనలేరని తేల్చి చెప్పారు. తాను కమిషన్ల కోసం రాజకీయాల్లోకి రాలేదని ఎంపీ స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles