Gandhi and my father had a difficult relationship, says Netaji’s daughter ఆ రెండింటి పోరాట ఫలితంగానే దేశానికి స్వతంత్ర్యం: అనితా బోస్

Netaji s daughter anita talks about her father s relationship with mahatma gandhi

Kangana ranaut, Independence bheek, netaji subhash chandra bose, Mahatma gandhi, anita bose, Jawaharlal nehru, Bhagat singh

Netaji Subhas Chandra Bose’s daughter, Anita Bose Pfaff, on Wednesday, November 17, said that her father and Mahatma Gandhi had a difficult relationship as Gandhi felt that he could not control Netaji. “On the other hand, my father was a great admirer of Gandhi,” Anita Bose Pfaff said.

ఆ రెండింటి పోరాట ఫలితంగానే దేశానికి స్వతంత్ర్యం: అనితా బోస్

Posted: 11/17/2021 05:33 PM IST
Netaji s daughter anita talks about her father s relationship with mahatma gandhi

దేశానికి స్వాతంత్ర్యం హింసాయుత, అహింసాయుత పోరాటమార్గాల ద్వారానే లభించిందని నేతాజీ సుభాష్ చంద్రబోస్ తనయ అనితా బోస్ షాప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గడచిన కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ నేతలు చెబుతున్న విధంగా కేవలం అహింసాయుత మార్గంలో పోరాటం ద్వారానే దేశానికి స్వతంత్ర్య సమకూరలేదని అమె సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీ, నేతాజీలిద్దరూ హీరోలేనని ఆమె శ్లాఘించారు. ఆ ఇద్దర్లో ఏ ఒక్కరు లేకపోయినా అది సాధ్యమయ్యేది కాదన్నారు.

నాణానికి ఆ ఇద్దరూ రెండు వైపులని చెప్పిన ఆమె అదే విధంగానే హింసాయుత, అహింసాయుత మార్గాలు కూడా దేశ స్వాతంత్ర్యానికి రెండు పోరాట మార్గాలని వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీ, తన తండ్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవని నేతాజీ కూతురు అనితా బోస్ ఫాఫ్ అన్నారు. నేతాజీని అదుపులో పెట్టలేనంటూ గాంధీ అనేవారని గుర్తు చేశారు. మరోవైపు గాంధీ అంటే తన తండ్రి నేతాజీకి అమితమైన అభిమానమని చెప్పారు. అయితే దేశబాసిన శృంఖాలాలను తెంచే విషయంలో మారు ఎంచుకున్న మార్గాలు వేరని అమె అన్నారు.

నేతాజీని మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూలే బ్రిటీషర్లకు అప్పగించేందుకు ప్రయత్నించారన్న కామెంట్లపై ‘ఇండియా టుడే’ అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. నేతాజీ, ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ) చర్యలూ దేశ స్వాతంత్ర్యానికి కారణమన్నారు. అలాగని నేతాజీ, ఐఎన్ఏ వల్లే స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పడం కూడా కరెక్ట్ కాదన్నారు. తన తండ్రి సహా ఎందరికో గాంధీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. కొన్ని లక్షల మంది పోరాటం, త్యాగాల వల్లే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles